2022 లో వాహనాల ధరలు పెంచనున్న కంపెనీల జాబితా.. చూసారా..!!

2021 వ సంవత్సరం ముగియడానికి ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ సంవత్సరం ఆటో మొబైల్ కంపెనీలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాలం విజయవంతంగా ఈ సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ దేశీయ మార్కెట్లో సెమీకండక్టర్ చిప్ కొరత మరియు ఇతర ఆటో మొబైల్ పరికరాల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా దాదాపు చాలా కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను 2022 ప్రారంభం నుంచి పెంచడానికి సిద్దమయ్యాయి.

2022 నుంచి ధరలు పెంచనున్న కంపెనీల గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

2022 లో వాహనాల ధరలు పెంచనున్న కంపెనీల జాబితా.. చూసారా..!!

మారుతి సుజుకి (Maruti Suzuki):

భారతీయ మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ప్రసిద్ధి పొందిన 'మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్' (Maruti Suzuki India Ltd) తమ ఉత్పత్తుల ధరలను 2022 జనవరి నుంచే పెంచనున్నట్లు తెలిపింది. ధరలు పెరగడానికి ప్రధాన కారణం ముడిసరుకుల కొరత మరియు ముడిసరుకుల ధరల పెరుగుదల అని కూడా కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ ఏ మోడల్ పైన ఎంత ధర పెంచుతుంది అనే విషయం త్వరలో అధికారికంగా తెలుస్తుంది.

2022 లో వాహనాల ధరలు పెంచనున్న కంపెనీల జాబితా.. చూసారా..!!

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp):

భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2022 జనవరి 04 నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచునున్నట్లు ఇప్పటికే తెలిపింది.ఇందులో బైకులు మరియు స్కూటర్లు ఉన్నాయి. దేశీయ మార్కెట్లో వాహనాల తయారీకి కావాల్సిన ముడిసరుకుల ధరలు అమాంతం పెరగటం వల్ల వాహనాల ధరలు పెరిగాయని కంపెనీ తెలిపింది. కంపెనీ యొక్క ధరల పెరుగుదల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

2022 లో వాహనాల ధరలు పెంచనున్న కంపెనీల జాబితా.. చూసారా..!!

టాటా మోటార్స్ (Tata Motors):

స్వదేశీ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' (Tata Motors) కూడా ధరల పెంచనున్న కంపెనీల జాబితాలో ఉంది. టాటా మోటార్స్ 2022 ప్రారంభం నుంచి తమ వాహనాల ధరలను పెంచే అవకాశం ఉంది. అయితే ఏ మోడల్స్ పైన ఎంత ధర పెరుగుతుంది అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ త్వరలో వెల్లడిస్తుంది.

2022 లో వాహనాల ధరలు పెంచనున్న కంపెనీల జాబితా.. చూసారా..!!

డుకాటీ ఇండియా (Ducati India):

ప్రముఖ బైక్స్ తయారీ సంస్థ 'డుకాటి' రానున్న కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ధరలను పెంచనుంది. భారతదేశంలోని కంపెనీకి చెందిన తొమ్మిది డీలర్‌షిప్‌లలో డుకాటి ఇండియా బైక్‌ల ధరలు పెరగనున్నాయి. పెరగనున్న కొత్త ధరల జాబితా త్వరలో వెల్లడవుతుంది.

2022 లో వాహనాల ధరలు పెంచనున్న కంపెనీల జాబితా.. చూసారా..!!

ఆడి ఇండియా (Audi India):

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఆడి' (Audi) కంపెనీ కూడా భారతీయ మార్కెట్లో 2022 జనవరి ప్రారంభం నుంచి ధరలు పెంచనుంది. కంపెనీ తమ కార్ల ధరలను దాదాపు 3 శాతం వరకు పెంచనుంది. అంతే కాకుండా కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త వాహనాలను పెంచే అవకాశం ఉంటుంది. కావును కొత్త ధరల జాబితా కూడా త్వరలో వెల్లడవుతుంది.

2022 లో వాహనాల ధరలు పెంచనున్న కంపెనీల జాబితా.. చూసారా..!!

టయోటా (Toyota):

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ భారతీయ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొడగలిగింది. ఈ కంపెనీ యొక్క వాహనాలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతూ మంచి ఆదరణతో ముందుకుసాగుతున్నాయి. అయితే కంపెనీ రానున్న 2022 జనవరి నుంచి తమ వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది.

2022 లో వాహనాల ధరలు పెంచనున్న కంపెనీల జాబితా.. చూసారా..!!

వాహన తయారీకి కావాల్సిన ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల తమ ఉత్పత్తుల ధరలను పెంచవలసి వచ్చిందని, కంపెనీ తెలిపింది. పెరిగిన కొత్త ధరల జాబితా త్వరలో వెల్లడవవుతుంది. అయితే పెరిగిన ధరలు అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

2022 లో వాహనాల ధరలు పెంచనున్న కంపెనీల జాబితా.. చూసారా..!!

కవాసకి (Kawasaki):

కవాసకి ఇండియా కూడా 2022 జనవరి 1 భారతదేశంలో తన అన్ని మోడళ్ల ధరలను పెంచనుంది. ఇంతకు ముందు కవాసకి ఇండియా (Kawasaki India) ఆగస్టు 2021లో ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచింది. కవాసకి ధరల పెరుగుదల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

2022 లో వాహనాల ధరలు పెంచనున్న కంపెనీల జాబితా.. చూసారా..!!

సిట్రోయెన్ ఇండియా (Citroen India):

ప్రముఖ ప్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ దేశీయ మార్కెట్లో సి5 ఎయిర్ క్రాస్ SUV విడుదల చేసి మంచి ఆదరణ పొందుతోంది. అయితే కంపెనీ రానున్న కొత్త సంవత్సరంలో మరో కొత్త మోడల్ భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అంతే కాకూండా రానున్న కొత్త సంవత్సరంలో కంపెనీ యొక్క ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే కంపెనీ తమ సి5 ఎయిర్ క్రాస్ SUV ధరను ఎక్కువ మొత్తంలో పెంచింది.

2022 లో వాహనాల ధరలు పెంచనున్న కంపెనీల జాబితా.. చూసారా..!!

పైన తెలిపిన కంపెనీలు మాత్రమే కాకుండా.. స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India) మరియు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కూడా దేశీయ మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలని పెంచనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో తెలుస్తుంది. అయితే పెరుగుతున్న ధరలు అమ్మకాలపైనా ప్రభావం చూపుతాయా.. లేదా అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
List of bikes and cars manufacturers increasing price from jan 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X