జనవరిలోనూ అదే తీరు.. లగ్జరీ కార్ల అమ్మకాలు బేజారు..

కొత్త సంవత్సరంలో అమ్మకాలు మెరుగుపడతాయని భావించిన లగ్జరీ కార్లకు నిరాశే ఎదురైంది. వరుసగా జనవరి 2021 నెలలో కూడా దేశీయ లగ్జరీ కార్ అమ్మకాలు క్షీణించాయి. గడచిన జనవరి నెలలో భారతదేశంలో మొత్తం లగ్జరీ కార్ల అమ్మకాలు 40 శాతం క్షీణించి 2,194 యూనిట్లుగా నమోదయ్యాయి.

జనవరిలోనూ అదే తీరు.. లగ్జరీ కార్ల అమ్మకాలు బేజారు..

ఈ డేటా ప్రకారం, జనవరి 2021లో కూడా టాప్ 10 లగ్జరీ కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా తన అగ్రస్థానాన్ని అలానే నిలుపుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్, వోల్వో, పోర్ష్ మొదలైన బ్రాండ్‌లు ఉన్నాయి. గత నెలలో బ్రాండ్ వారీగా అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి:

జనవరిలోనూ అదే తీరు.. లగ్జరీ కార్ల అమ్మకాలు బేజారు..

జనవరి 2021లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయ విపణిలో 859 లగ్జరీ కార్లను విక్రయించింది. కాగా, జనవరి 2020లో వీటి సంఖ్య 1,202 యునిట్లుగా నమోదైంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 28.5 శాతం క్షీణించాయి.

MOST READ:ఈ బైక్ తినేయొచ్చు, మీరు విన్నది నిజమే.. ఓ లుక్కేయండి

జనవరిలోనూ అదే తీరు.. లగ్జరీ కార్ల అమ్మకాలు బేజారు..

మెర్సిడెస్ బెంజ్ తర్వాతి స్థానంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఉంది. గత నెలలో మొత్తం 703 బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్లు అమ్ముడుపోగా, జనవరి 2020లో వీటి సంఖ్య 1,345 యునిట్లుగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే కంపెనీ గత నెలలో 47.7 శాతం క్షీణతను నమోదు చేసింది.

జనవరిలోనూ అదే తీరు.. లగ్జరీ కార్ల అమ్మకాలు బేజారు..

ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నది జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి. గత జనవరి 2021లో ఆడి ఇండియా మొత్తం 254 లగ్జరీ కార్లను విక్రయించగా, నజవరి 2020లో 421 కార్లను విక్రయించి 39.7 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

Rank Model Jan-21 Feb-20 Growth (%)
1 Mercedes-Benz 859 1,202 -28.5
2 BMW 703 1,345 -47.7
3 Audi 254 421 -39.7
4 Jaguar Land Rover 211 409 -48.4
5 Volvo 109 194 -43.8
6 Porsche 46 48 -4.2
7 Rolls-Royce 7 2 250.0
8 Ferrari 3 5 -40.0
9 Bentley 1 0 -
10 Lamborghini 1 3 -66.7

MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

జనవరిలోనూ అదే తీరు.. లగ్జరీ కార్ల అమ్మకాలు బేజారు..

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. గత నెలలో జెఎల్ఆర్ మొత్తం 211 కార్లను విక్రయించింది. అంతకు ముందు ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 409 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో జెఎల్ఆర్ 48.4 శాతం క్షీణతను నమోదు చేసింది.

జనవరిలోనూ అదే తీరు.. లగ్జరీ కార్ల అమ్మకాలు బేజారు..

ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నది స్వీడన్‌కి చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో. వోల్వో ఇండియా గడచిన నవరి 2021లో మొత్తం 109 కార్లను విక్రయించింది. జనవరి 2010లో ఇవి 194 యూనిట్లుగా నమోదయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే కంపెనీ అమ్మకాలు 43.8 శాతం క్షీణించాయి.

MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?

జనవరిలోనూ అదే తీరు.. లగ్జరీ కార్ల అమ్మకాలు బేజారు..

ఆరవ స్థానంలో ఉన్న పోర్ష్ లగ్జరీ బ్రాండ్ జనవరి 2021లో 46 యూనిట్లను విక్రయించి 4.2 శాతం క్షీణతను నమోదు చేసింది. జనలరి 2010లో కంపెనీ మొత్తం 48 కార్లను విక్రయించింది.

జనవరిలోనూ అదే తీరు.. లగ్జరీ కార్ల అమ్మకాలు బేజారు..

రోల్స్ రాయిస్ గడచిన జనవరి 2021లో అనూహ్యంగా 7 లగ్జరీ కార్లను విక్రయించి 250 శాతం వృద్ధిని నమోదు చేసింది. జనవరి 2020లో ఈ కంపెనీ 2 కార్లను మాత్రమే విక్రయించింది. కాగా గత నెలలో ఫెరారీ మొత్తం 3 కార్లను విక్రయించి 40 శాతం క్షీణతను నమోదు చేసింది.

MOST READ:ఇలా చేస్తే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందటం వెరీ సింపుల్

జనవరిలోనూ అదే తీరు.. లగ్జరీ కార్ల అమ్మకాలు బేజారు..

జనవరి 2021లో బెంట్లీ కేవలం 1 కారును మాత్రమే విక్రయించగా, జనవరి 2020లో ఎలాంటి విక్రయాలు జరపలేదు. ఇక ఈ జాబితాలో చివరిగా లాంబోర్గినీ గత నెలలో 1 కారును మాత్రమే విక్రయించింది. జనవరి 2020లో లాంబోర్గినీ మొత్తం 3 కార్లను విక్రయించింది. ఈ సమయంలో లాంబోర్గినీ అమ్మకాలు 66.7 శాతం తగ్గాయి.

Most Read Articles

English summary
Luxury Cars Sales In January 2021; Mercedes Benz Tops The List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X