చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీకి కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసినదే. ఈ ఎస్‌యూవీ కోసం విపరీతమైన డిమాండ్ రావడంతో, దీని వెయిటింగ్ పీరియడ్ కూడా 10 నెలలకు పెరిగిపోయింది.

చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

కొత్త 2020 మహీంద్రా థార్‌ను మార్కెట్లో విడుదల చేసిన ప్రారంభంలో, ఈ ఆఫ్-రోడర్‌ను మూడు వేరియంట్లలో విక్రయించేవారు. అవి: ఏఎక్స్, ఏఎక్స్ (ఆప్షనల్) మరియు ఎల్ఎక్స్. కాగా, ఇప్పుడు ఇది కేవలం ఏఎక్స్ ఆప్షనల్ మరియు ఎల్ఎక్స్ వేరియంట్లలో మాత్రమే లభిస్తోంది.

చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

ఈ మోడల్ ప్రారంభ సమయంలో, దీని బేస్ వేరియంట్‌ను ఏఎక్స్ రూపంలో 6-సీట్ల కాన్ఫిగరేషన్‌తో (వెనుక వరుసలో ఫార్వార్డ్ ఫేసింగ్ సీట్లతో) అందించారు. అయితే, ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన కొద్ది రోజుల్లోనే కంపెనీ ఇందులోని బేస్ వేరియంట్ (ఏఎక్స్) కోసం బుకింగ్స్ స్వీకరించడాన్ని నిలిపివేసింది.

MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఎక్కువ మంది వినియోగదారులు టాప్-స్పెక్ ఎల్ఎక్స్ వేరియంట్‌ను ఎంచుకుంటున్న నేపథ్యంలో బేస్ వేరియంట్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కాగా, తాజా అప్‌డేట్ ప్రకారం మహీంద్రా ఇప్పుడు చిన్న ఇంజన్‌తో కూడిన ఓ చవకైన బేస్ వేరియంట్ థార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం. ఈ ఇంజన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. కాకపోతే, ఈ బేస్ వేరియంట్ మహీంద్రా థార్ ఎస్‌యూవీలో 4-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండకపోవచ్చు.

MOST READ:బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

ఇదివరకు చెప్పుకున్నట్లుగా కొత్త తరం మహీంద్రా థార్ మోడల్‌ను 6-సీటర్ మరియు 4-సీటర్ మోడళ్లలో ప్రవేశపెట్టారు. అయితే, భద్రతా పరీక్షలలో 6-సీటర్ వెర్షన్ సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్నందున కంపెనీ ఈ వేరియంట్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో, థార్ ఎస్‌యూవీలో చౌకైన ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడానికి మహీంద్రా ఓ కొత్త బేస్ వేరియంట్‌పై పనిచేస్తోంది.

చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

ఈ కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్ అందుబాటులోకి వచ్చినట్లయితే, ఇది మరింత ఎక్కువ మంది వినియోగదారులకు చేరువయ్యే అవకాశం ఉంది. మహీంద్రా థార్ అంటే కేవలం ఆఫ్-రోడర్ మరియు తక్కువ మైలేజీనిస్తుందనే అపోహ చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో, ఎక్కువ మైలేజీనిచ్చే థార్ ఎస్‌యూవీని విడుదల చేసేలా మహీంద్రా కృషి చేస్తోంది.

MOST READ:స్వామీజీని తాకిన పేస్ మాస్క్ ఎఫెక్ట్.. ఎలా అనుకుంటున్నారా?

చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్లో కేవలం ఇంజన్‌లో మాత్రమే మార్పు ఉంటుంది, దాని యొక్క పరిమాణం ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఇతర వేరియంట్ల మాదిరిగానే ఉంచబడుతుంది. అయితే, ఈ వేరియంట్ ధరను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఇందులో చిన్న చక్రాలను ఉపయోగించవచ్చు.

చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మహీంద్రా థార్ 2.0 లీటర్ ఎమ్-స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ ఎమ్-హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి శక్తిని, 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి శక్తిని, 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే

చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం లభిస్తున్న అన్ని వేరియంట్లలో 4-వీల్ డ్రైవ్ ఆప్షన్ స్టాండర్డ్‌గా ఉంటుంది. కాకపోతే, కొత్తగా రాబోయే బేస్ వేరియంట్లో మాత్రం 4-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండబోదు, అది కేవలం 2-వీల్ డ్రైవ్‌తో మాత్రమే లభ్యం కానుంది.

చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

మహీంద్రా ఈ ఎస్‌యూవీని సాఫ్ట్ టాప్, కన్వర్టిబుల్ టాప్ మరియు హార్డ్ టాప్ / ఫిక్స్‌డ్ టాప్ అనే మూడు రూఫ్ టాప్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. ఈ ఎస్‌యూవీకి గ్రౌండ్ క్లియరెన్స్ 226 మిమీ ఉండగా, వాటర్ వేడింగ్ సామర్థ్యం 650 మిమీగా ఉంటుంది.

చిన్న ఇంజన్‌తో రానున్న కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్; ధర కూడా తక్కువే!

కొత్త థార్‌లో రూఫ్ టాప్ స్పీకర్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఈ కారులో ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ రియల్ టైమ్ పొజిషన్ సిస్టమ్ ఇవ్వబడింది, ఇది కారు యొక్క ప్రస్తుత స్థితిని చూపుతుంది. వీటితో పాటుగా ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, రియర్ పార్కింగ్ అసిస్ట్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.

Source: Team-BHP

Most Read Articles

English summary
Mahindra To Launch New Base Variant Thar SUV With Smaller Petrol Engine. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X