అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) దేశీయ విపణిలో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) లోని డీజిల్ వేరియంట్లలో గుర్తించిన ఓ సమస్య కారణంగా కంపెనీ వీటిని రీకాల్ చేస్తున్నట్లు సమాచారం.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీలోని డీజిల్ వెర్షన్లలో ఇంటర్‌కూలర్ పైప్ (Intercooler Hose) లోపం కంపెనీ వీటిని రీకాల్ చేసింది. బిఎస్6 కంప్లైంట్ డీజిల్ కలిగిన వేరియంట్లు మాత్రమే ఈ రీకాల్ కు వర్తిస్తాయి. అయితే, ఈ సమస్య వలన ఎన్ని కార్లు ప్రభావితమయ్యాయనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

ఈ ఎస్‌యూవీలోని డీజిల్ వెర్షన్లలో ఇంటర్‌కూలర్ హోస్ సమస్య కారణంగా, డీజిల్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లు కాలక్రమేణా పగుళ్లను అభివృద్ధి చేశాయని కంపెనీ నివేదించింది. అయితే, ఈ సమస్య వలన ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు నమోదు కాలేదని, క్వాలిటీ చెక్ లో భాగంగా ఈ సమస్యను గుర్తించామని కంపెనీ పేర్కొంది.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

ప్రభావిత వాహనాల సంఖ్యను మహీంద్రా అధికారికంగా వెల్లడించలేదు కానీ, సమీప డీలర్‌షిప్‌లో ఒకసారి తమ ఎక్స్‌యూవీ300 ని తనిఖీ చేసుకోవాలని కంపెనీ వినియోగదారులకు తెలియజేస్తోంది. ఈ విషయం గురించి కంపెనీ త్వరలోనే ఓ అధికారిక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. రీకాల్ కు వర్తించే మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలలో లోపపూరితమైన భాగాన్ని కంపెనీ ఉచితంగా భర్తీ చేయనుంది.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

మహీంద్రా గత కొంత కాలంగా కంపెనీ XUV300 ఎస్‌యూవీలోని ఫీచర్లను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ఇటీవల, కంపెనీ ఇందులోని W8 (O) వేరియంట్ లో ఏడవ ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్ ను తొలగించింది. డ్రైవర్ మోకాలిని రక్షించడానికి ఈ ఎయిర్‌బ్యాగ్ అందించబడేది. ఈ మార్పు తర్వాత ఈ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ XUV300 ఇప్పుడు 7 ఎయిర్‌బ్యాగ్ లకు బదులుగా ముందు, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్ లతో కలిపి మొత్తం 6 ఆరు ఎయిర్‌బ్యాగ్ లతో వస్తుంది.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) 2019 లో భారత మార్కెట్లో విడుదలైనప్పుడు ఈ ఎస్‌యూవీ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. ఈ కారులో ఈబిడితో కూడిన ఏబిఎస్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్, ఇంపాక్ట్ సెన్సిటివ్ డోర్ లాక్ మరియు డిస్క్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఇది కూడా ఒకటి.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

భారత విపణిలో Mahindra XUV300 W4, W6, W8 మరియు W8 (O) అనే నాలుగు ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. ఇందులోని బేస్ వేరియంట్ నుండే కంపెనీ అనేక సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో, దేశంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటైన ఎక్స్‌యూవీ300 ఇలాంటి లోపం సంభవించడంతో ఇప్పుడు కొత్త ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. బహుశా ఈ కారణంగానే కంపెనీ ఈ రీకాల్ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలుస్తోంది.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ300 విషయానికి వస్తే, కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని రెండు ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో మొదటిది 109 బిహెచ్‌పి పవర్ ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేసే 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

ఇకపోతే, రెండవ ఇంజన్ ఆప్షన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 300 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

ఇదిలా ఉంటే, కంపెనీ ఇందులో మరో కొత్త ఇంజన్ ఆప్షన్ పై కూడా పనిచేస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో కంపెనీ కొత్తగా 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ ను మరియు 230 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రావచ్చని భావిస్తున్నారు.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం..

మహీంద్రా ఎక్స్‌యూవీ300 లోని లోపం గురించి కంపెనీ నేరుగా వినియోగదారులకు తెలియజేస్తోంది. అయితే దీని గురించి కంపెనీ ఇంకా ఎలాంటి బహిరంగ ప్రకటన జారీ చేయలేదు. ఇప్పుడు కంపెనీ తమ సురక్షితమైన కారులోని లోపాన్ని ఎంతకాలం అంగీకరిస్తుందో చూడాలి.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 టెస్ట్ డ్రైవ్ డీటేల్స్

మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎక్స్‌యూవీ700 (XUV700) అక్టోబర్ 1వ తేదీ నుండి డీలర్‌షిప్‌లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. మొదటి దశ టెస్ట్ డ్రైవ్ ప్రక్రియ అక్టోబర్ 02, 2021 వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. మొదటి దశలో, ఢిల్లీ ఎన్‌సిఆర్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పూణే, ఇండోర్, లక్నో, కోయంబత్తూర్ మరియు వడోదర వంటి నగరాల్లో టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభం కానున్నాయి.

అలెర్ట్.. అలెర్ట్..: Mahindra XUV300 ఇంటర్‌కూలర్ హోస్‌లో సమస్య, రీకాల్!

కాగా, రెండవ దశ టెస్ట్ డ్రైవ్ ప్రక్రియ అక్టోబర్ 07, 2021వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ దశలో జైపూర్, సూరత్, పాట్నా, కొచ్చిన్, కటక్, కాన్పూర్, కాలికట్ మరియు నాసిక్‌ నగరాల్లో టెస్ట్ డ్రైవ్ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. - Mahindra XUV700 ధర, వేరియంట్లకు సంబంధించిన ఇతర సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Mahindra xuv300 diesel variants recalled due to intercooler hose issue details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X