XUV700 ఉత్పత్తి ప్రారంభించిన Mahindra; ఫస్ట్ యూనిట్ ఫోటోలు
భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీదారుగా ప్రసిద్ధి చెందిన Mahindra (మహీంద్రా) కంపెనీ ఇటీవల తన కొత్త XUV700 SUV ని విడుదల చేసింది. ఈ కొత్త Mahindra XUV700 ధర రూ. 11.99 లక్షలు. అయితే ఇటీవల కంపెనీ ఈ కొత్త SUV యొక్క ఉత్పత్తి పూణేలోని చకన్ ప్లాంట్ లో ప్రారంభించింది. అంతే కాకుండా ఈ SUV యొక్క మొదటి యూనిట్ ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.

Mahindra కంపెనీ ఈ కొత్త XUV700 SUV ని ఈ నెల చివరి నాటికి టెస్ట్ డ్రైవ్ మోడల్ మరియు షోరూమ్ డిస్‌ప్లే మోడల్‌ను త్వరలో పంపనుంది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త SUV 2021 ఆగష్టు 14 న విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి కూడా ఎక్కువమంది వినియోగదారులు ఈ కొత్త Mahindra XUV700 కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే కంపెనీ యొక్క డీలర్‌షిప్‌లు అనేక చోట్ల అనధికారికంగా బుకింగ్‌లను తీసుకోవడం ప్రారంభించాయి. అయితే Mahindra XUV700 బుకింగ్స్ అధికారికంగా ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనితోపాటు ఈ SUV యొక్క టెస్ట్ డ్రైవ్ కూడా సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

అయితే ఈ SUV యొక్క డెలివరీలో త్వరలో ప్రారంభమవుతాయి. ఈ కొత్త Mahindra XUV700 SUV కి ఇప్పటికే మంచి స్పందన వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. Mahindra XUV700 యొక్క అమ్మకాలు కూడా చాలా బాగా జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నాము.

Mahindra యొక్క XUV700 యొక్క బేస్ వేరియంట్‌లో AX సిరీస్ అందుబాటులో ఉంటుంది. MX వేరియంట్ ఒకే ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. అదేవిధంగా AdrenoX సిరీస్ మాత్రం మూడు ట్రిమ్స్ లో లభిస్తుంది. అవి AX3, AX5 మరియు AX7 ట్రిమ్‌లు. ప్రస్తుతానికి 5 సీటర్ మాన్యువల్ మోడల్స్ ధర మాత్రమే వెల్లడైంది, మిగిలిన వేరియంట్ల ధర త్వరలో వెల్లడవుతుంది.

Mahindra XUV700 అద్భుతమై డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉంటాయి. ఈ SUV లో సి- ఆకారపు ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కొత్త ఎల్ఈడీ హెడ్ లైట్ యూనిట్లను పొందుతుంది. ఈ SUV చాలా పొడవుగా ఉంటుంది. ఇది 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక భాగంలో పెద్ద టెయిల్ లైట్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్, రిఫ్లెక్టర్ వంటివి కూడా అందుబాటులో ఉంటుంది. అవి మాత్రమే కాకుండా ఇందులో రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫ్లష్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వాటి అధునాతన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

Mahindra XUV700 SUV లోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సౌండ్ కోసం సోనీ సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది. దీనితో పాటు, ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్‌ప్లే, ఇ-సిమ్ ఆధారిత కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటివి ఉన్నాయి. ఐతే కాకూండా Mahindra XUV700 లో ఈ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెడ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది.

Mahindra XUV700 లోఐ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.

Mahindra XUV700 లో మల్టిఫుల్ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఆప్సన్స్ కలిగి ఉంటాయి. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఇవ్వబడింది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది.

ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే 198 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమవుతుంది.

ఇక రెండవ ఇంజిన్ 2.2-లీటర్ టర్బో డీజిల్ విషయానికి వస్తే, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

దేశీయ మార్కెట్లో కొత్త Mahindra XUV700 విడుదలైన తర్వాత Hyundai Alcazar, MG Hector Plus, Tata Safari మరియు రాబోయే Jeep Meridian వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇటీవల మేము కొత్త Mahindra XUV700 డ్రైవ్ చేసాము. Mahindra XUV700 గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








