మహీంద్రా బ్రాండ్ కింగ్ 'ఎక్స్‌యూవీ700' రివ్యూ; లేటెస్ట్ ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో ప్రముఖ కంపెనీగా అవతరించిన మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ విడుదలవుతుందని ఇంతకు ముందు చాలా కథనాల్లో తెలిపాము. దాదాపు నెల రోజుల పాటు ఈ ఎస్‌యూవీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీతో పంచుకున్నాము. చాలామంది వాహన ప్రియులు కూడా ఈ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మహీంద్రా కంపెనీ విడుదల చేయనున్న కొత్త 'మహీంద్రా ఎక్స్‌యూవీ700' ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎక్స్‌యూవీ700 ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు. ఈ కొత్త ఎస్‌యూవీ నిజంగా కంపెనీ యొక్క ఉత్తమమైన ఎస్‌యూవీ.

ఇటీవల మేము ఈ కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని డ్రైవ్ చేసాము. ఈ ఎస్‌యూవీలోని ఫీచర్స్ మరియు పరికరాలు మాత్రమే కాకుండా ఈ ఎస్‌యూవీ యొక్క పర్ఫామెన్స్ వంటి వాటి గురించి మొత్తం సమాచారం ఈ రివ్యూ ద్వారా మీ కోసం ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాము.

మహీంద్రా ఎక్స్‌యూవీ చరిత్ర:

మనం మహీంద్రా యొక్క కొత్త ఎస్‌యూవీ అయిన ఎక్స్‌యూవీ700 గురించి తెలుసుకునే ముందు, దాని చరిత్ర గురించి కొంత సమాచారం తెలుసుకోవాలి. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 దాని ఎక్స్‌యూవీ500 ఆధారంగా రూపొందించబడింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోనోకాక్ చాసిస్ పై ఆధారపడిన మొట్టమొదటి ఎస్‌యూవీ. ఇది దేశీయ మార్కెట్లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా మంచి ప్రజాదరణ పొందగలిగింది. ఈ ఎస్‌యూవీ మంచి ఫీచర్స్ కలిగి ఉంది. అయినప్పటికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతూనే ఉంది.

ఈ విధంగా అప్డేట్ చేయబడే క్రమంలో ఎక్స్‌యూవీ500 కి వారసుడిగా పుట్టుకొచ్చిన ఎస్‌యూవీ ఈ కొత్త ఎక్స్‌యూవీ700. ఈ కొత్త ఎస్‌యూవీ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలతో ప్రస్తుత తరానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 డిజైన్ మరియు స్టైల్:

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది మొదటి చూపులోనే ఇది ఎక్స్‌యూవీ అని గుర్తించడం చాలా సులభం. అంతే కాకుండా ఇది ఎక్స్‌యూవీ500 కాదని కూడా ఖచ్చితంగా గుర్తించవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 పూర్తిగా లేటెస్ట్ డిజైన్ లో లేటెస్ట్ ఎలిమెంట్స్ కలిగి ఉండి, కఠినమైన వైఖరిలో ఉంటుంది. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో డ్యూయల్ టోన్ గ్రిల్ ఉంది. దీని మధ్యలో మహీంద్రా యొక్క కొత్త లోగో ఉంది. ఇది రెండు వైపులా మల్టిపుల్ బ్లాక్ స్లాట్‌లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఆరు ట్విన్ స్లాట్‌లు సిల్వర్‌లో పూర్తయ్యాయి.

ఇందులో ఉన్న గ్రిల్ ఫ్రంట్-ఎండ్‌కి బదులుగా పైకి కనిపించే రూపాన్ని ఇస్తుంది, అదే సమయంలో ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు డిఆర్ఎల్ లతో ఉంటుంది. ఎక్స్‌యూవీ700 బంపర్‌ బూమేరాంగ్ ఆకారంలో ఉన్న బ్యాక్ ప్లాస్టిక్‌ని కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్‌లు బంపర్‌లోకి విస్తరించాయి.

ఫాగ్ ల్యాంప్స్ బంపర్ దిగువన ఉన్నాయి మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్ సిల్వర్‌లో పూర్తి చేయబడింది. మొత్తం మీద ఈ కొత్త ఎస్‌యూవీ యొక్క పరిమాణం స్పష్టంగా మరియు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఎక్స్‌యూవీ700 ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌స్, చంకీ షోల్డర్ లైన్ మరియు స్లొపింగ్ రూఫ్ లైన్‌ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇందులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ ఉంటాయి. సాధారణంగా ఈ ఫీచర్ సూపర్ కార్లలో కనిపిస్తుంది. ఎక్స్‌యూవీ700 అద్భుతంగా కనిపించడంతో పాటు, ఈ డోర్ హ్యాండిల్స్ ఫీల్-గుడ్ ఫ్యాక్టర్‌ను పెంచుతాయి. ఇది ఆపరేట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది.

ఇందులో ఉన్న డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌ను పొంది ఉంటాయి. ఇక్కడ 10 స్పోక్స్ చూడవచ్చు. ఇవి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

ఎక్స్‌యూవీ700 యొక్క రియర్ ప్రొఫైల్ విషాయానికి వస్తే, ఇక్కడ పెద్ద స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లతో విస్తృతంగా ఉంటుంది. దీని పైన షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు పదునైన అంచులతో కూడా స్పాయిలర్‌ ఉంటుంది. వెనుక భాగంలో షార్ప్ ప్రోట్రూషన్ ఉంది మరియు దానిపైన మధ్య భాగంలో కొత్త మహీంద్రా లోగో ఉంటుంది.

దీని కింది భాగంలో XUV700 మరియు AX7 బ్యాడ్జింగ్ ఉంది. మేము టాప్-స్పెక్, ఫుల్-లోడెడ్ AX7 వేరియంట్‌ను డ్రైవ్ చేసాము. ఇందులో బంపర్ కింద సిల్వర్‌లో పూర్తి చేసిన ఫాక్స్ బాష్ ప్లేట్ ఉంది. ఎక్స్‌యూవీ700 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అద్భుతమైన డిజైన్ కలిగి అందరిని ఆకర్షించేలా చేస్తుంది.

కాక్‌పిట్ అండ్ ఇంటీరియర్:

మహీంద్రా ఎక్స్‌యువి700 యొక్క ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ ఉపయోగించి లోపలి వెళ్ళగానే మీకు అద్భుతమైన క్యాబిన్ స్వాగతం పలుకుతుంది. లోపల ఇంటీరియర్ మొత్తం తెలుపు రంగులోని లెదర్ తో ఉండటం మీరు గమనించవచ్చు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

డాష్‌బోర్డ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్‌ కలిగి చాలా అధునాతనమైనదిగా కనిపిస్తుంది. ఇది లెదర్ ట్రిమ్ మరియు సాఫ్ట్-టచ్ ప్లాస్టిక్‌తో ప్రీమియం టచ్ కలిగి ఉంది. 'గ్లాస్ స్లాబ్' ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం రెండు 10.25-ఇంచెస్ స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే మాత్రమే టచ్‌స్క్రీన్ యూనిట్.

ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఇది అమెజాన్ అలెక్సా ఎనేబుల్ చేయబడింది, కాబట్టి మీరు సిస్టమ్‌కు ఆదేశాలను వాయిస్ చేయవచ్చు. ఇది 60 కి పైగా కనెక్ట్ చేయబడిన ఫీచర్లను పొందుతుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం దాని ఓన్ ఈ-సిమ్ కార్డును కూడా పొందుతుంది.

మీ ఫోన్‌ని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కి జత చేయడం చాలా సులభం. అయితే సిస్టమ్ కొన్ని చోట్ల వెనుకబడి ఉందని మేము గమనించాము. కానీ దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. మేము డ్రైవ్ చేసిన కారు ప్రీ-ప్రొడక్షన్ మోడల్, ఇది పూర్తిగా ఉత్పత్తిలోకి వచ్చిన తరువాత ఇవన్నీ పరిష్కరించబడతాయి.

మహీంద్రా ఎక్స్‌యువి700 లో సోనీ సౌండ్ సిస్టమ్‌ ఉంటుంది, కావున దీని ద్వారా మ్యూజిక్ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. సోనీ అధికారికంగా OEM సరఫరాదారుగా స్పీకర్‌లను అందించడం ఇదే మొదటిసారి. ఈ సెటప్‌లో 13-ఛానల్ DSP యాంప్లిఫైయర్ మరియు 12 కస్టమ్-డిజైన్డ్ స్పీకర్‌లు ఉన్నాయి.

మొత్తం ఆడియో అవుట్‌పుట్ 445 వాట్స్ RMS వద్ద రేట్ చేయబడింది, సోనీ సౌండ్ బిల్డింగ్ బ్లాక్‌లు మరియు 360 డిగ్రీ స్పేషియల్ సౌండ్ టెక్నాలజీతో పాటు అద్భుతమైన ఆరెల్ అనుభవాన్ని అందిస్తుంది.

ఎక్స్‌యువి700 లో సిల్వర్ కలర్ స్ట్రిప్ ఉంది, ఇది ముందు డోర్స్ లో ఒకదాని నుండి మొదలై మరొకటి ముగుస్తుంది. మధ్యలో, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కింద కుడివైపు డ్యూయల్ AC వెంట్‌లు ఉన్నాయి. దాని కింద క్లైమేట్ కంట్రోల్ కోసం కంట్రోల్స్ ఉన్నాయి. దీనికి దిగువన సెంటర్ కన్సోల్ ఉంది.

సెంటర్ కన్సోల్ కూడా పియానో ​​బ్లాక్‌లో పూర్తి చేయబడి ఉంటుంది. గేర్ లివర్ ముందు భాగంలో మీ మొబైల్ ఫోన్ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ స్పాట్ ఉంది, అంతే కాకుండా గేర్ లివర్ పక్కన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు హిల్-హోల్డ్ బటన్‌లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కంట్రోల్ చేయడానికి రోటరీ సెలెక్టర్ నాబ్ కూడా ఉంది.

ఎక్స్‌యువి700 లోని స్టీరింగ్ వీల్ మందంగా మరియు చంకీగా ఉంటుంది, కావున మంచి పట్టుని అందిస్తుంది. స్టీరింగ్ వీల్ పైన కొత్త మహీంద్రా లోగో ఫ్యాన్సీగా కనిపిస్తుంది. పియానో ​​బ్లాక్‌లో పూర్తి చేసిన స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్‌లోని త్రీ స్పోక్స్ మంచి సిల్వర్ అవుట్ లైన్ కలిగి ఉంటుంది. మొత్తం సెటప్ ప్రీమియంగా అనిపిస్తుంది.

మహీంద్రా డోర్ ప్యానెల్‌లో ఫాక్స్-వుడ్ ట్రిమ్‌ ఉపయోగించబడింది. అదే ట్రిమ్‌లో, బూమేరాంగ్ షేప్ లివర్‌లు డోర్ ఓపెన్ చేయడానికి మరియు లాక్ చేయడానికి/అన్‌లాక్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. డ్రైవర్ సీటు మాత్రమే పూర్తిగా ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయబడుతుంది, దాని కోసం కంట్రోల్స్ ఒకే డోర్ ప్యానెల్‌లో అమర్చబడి ఉంటాయి. ఫ్లోర్ కార్పెట్స్ XUV700 లోగోతో ఆకర్షణీయంగా ఉంటాయి.

మహీంద్రా ఎక్స్‌యువి700 అదే విలాసవంతమైన అంశాలను వెనుక వైపుకు కూడా తీసుకువెళతాయి. సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. లెగ్ రూమ్, క్నీ రూమ్ మరియు హెడ్ రూమ్ అన్నీ చాలా బాగున్నాయి. ఇందులోని రెండవ మరియు మూడవ వరుసలో AC వెంట్‌లు అమర్చబడి ఉంటాయి. ఇది ఎయిర్ ప్యూరిఫయర్‌ను కూడా పొందుతుంది. రెండవ వరుసలో కప్ హోల్డర్‌లతో ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్ లభిస్తుంది. ఇవి రెండవ వరుసలోని ప్రయాణీకులను చాలా సౌకర్యంగా ఉంటాయి.

ఇక మూడవ వరుస సీట్ల విషయానికి వస్తే, ఇది ఇతర ఎస్‌యూవీలలో కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ ఈ స్పేస్ పిల్లలకు ఉత్తమంగా ఉంటుంది. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పెద్దవారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మొత్తానికి ఎక్స్‌యువి700 మంచి అనుభవాన్ని అందిస్తుంది.

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్:

సాధారణంగా మహీంద్రా యొక్క ఎక్స్‌యువి500 సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కావున ఎక్స్‌యువి700 కూడా మరింత సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు. చెన్నై శివార్లలో ఉన్న మహీంద్రా యొక్క కొత్త ప్రూవింగ్ గ్రౌండ్స్ వాస్తవ ప్రపంచ డ్రైవింగ్‌ను అనుకరించడానికి అనేక రహదారులను కలిగి ఉంది.

ఈ రోడ్లపై మరియు హై-స్పీడ్ విభాగంలో, ఎక్స్‌యువి700 మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులోని డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మూడు వరుసలలోని AC వెంట్‌లు, విశాలమైన ఇంటీరియర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి అద్భుతమైన సౌకర్యాన్ని అందించడంలో సహాయపడుతుంది.

మహీంద్రా తన అన్ని వాహనాలకు ప్రాక్టికాలిటీని అందించే బ్రాండ్‌లలో ఒకటి, కావున కొత్త ఎక్స్‌యువి700 మంచి ప్రాక్టికాలిటీ కలిగి ఉంటుంది. ఇందులో డోర్ పాకెట్స్ పెద్దవిగా ఉటాయి, ఇది వైర్‌లెస్ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం నిర్దిష్ట స్థలాన్ని కూడా ఇందులో ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యువి700 మూడు వరుసల సీట్లను కలిగి ఉండటం వల్ల, బూట్ స్పేస్ ఉత్తమంగా ఉంటుంది. ఏదేమైనా, రెండవ మరియు మూడవ వరుస స్ప్లిట్ సీట్లను ఫోల్డ్ పెట్టే ఫీచర్‌ ఇందులో ఉంది. ఇందులోకి సీట్లను ఫోల్డ్ చేసినప్పుడు ఇది దాదాపు ఫ్లాట్‌బెడ్‌గా మారుతుంది. మహీంద్రా ఎక్స్‌యువి700 60-లీటర్స్ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యాన్ని పొందుతుంది.

ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

సరికొత్త మహీంద్రా ఎక్స్‌యువి700 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలతో అందించబడింది. ఇందులోఐ పెట్రోల్ యూనిట్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్, ఇది 197.2 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ గ్యాసోలిన్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది 5 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఇక రెండవ ఇంజిన్ 2.2-లీటర్ mHawk డీజిల్ యూనిట్. మేము ఈ మోడల్ డ్రైవ్ చేసాము. ఇది 184.4 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. అయితే, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ టార్క్ అవుట్‌పుట్ భిన్నంగా ఉంటుంది. మాన్యువల్ వేరియంట్ 420 ఎన్ఎమ్ టార్క్ మరియు ఆటోమేటిక్ వేరియంట్ 450 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యువి700 రెండు డ్రైవ్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంది. ఒకటి ఫ్రంట్-వీల్ డ్రైవ్ మరియు మరొకటి 4-వీల్ డ్రైవ్ సెటప్. మేము 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసిన ఫ్రంట్-వీల్-డ్రైవ్ వేరియంట్‌ను డ్రైవ్ చేసాము. ఇందులోని డీజిల్ వేరియంట్‌లకు డ్రైవింగ్ మోడ్‌లు లభిస్తాయి కానీ పెట్రోల్ వేరియంట్‌కు లభించదు.

ఇందులో మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. జిప్ (ఎకో), జాప్ (కంఫర్ట్), జూమ్ (స్పోర్ట్/డైనమిక్) మరియు కస్టమ్ (ఇండ్యూజువల్). మేము ఈ కారును జిప్ మోడ్‌లో నడపడం ప్రారంభించాము. ఇందులో త్రాటల్ రెస్పాన్స్ కొత్త తక్కువగా అనిపిస్తుంది, కానీ ఇది ఇంధనాన్ని ఆదా చేస్తుంది. జాప్ మోడ్‌లో, త్రాటల్ రెస్పాన్స్ కొద్దిగా మెరుగుపడుతుంది. నగరంలో ప్రయాణించే వాహనదారులకు ఈ మోడ్ ఉత్తమంగా ఉంటుంది.

జూమ్ మోడ్‌లో త్రాటల్ రెస్పాన్స్ చాలా షార్ప్ గా ఉంటుంది, కారు యొక్క గరిష్ట సామర్థ్యాన్ని ఈ మోడ్‌లో ఉపయోగించుకోవచ్చు. మేము రోజంతా ఎక్స్‌యువి700 ని ఈ మోడ్‌లో డ్రైవ్ చేశాము. జూమ్ మోడ్‌లో పవర్ డెలివరీ ప్రారంభంలో సరళంగా ఉంటుంది, కానీ మీరు పెడల్‌ను ఫ్లోర్ చేస్తే అకస్మాత్తుగా పవర్ పెరుగుతుంది.

ఎక్స్‌యువి700 యొక్క డీజిల్ యూనిట్లు చాలా బలమైన మిడిల్ రేంజ్ కలిగి ఉన్నాయి. ఇందులో రెవ్-లిమిటర్ 4,300 ఆర్‌పిఎమ్ రెడ్‌లైన్ మార్క్ వద్ద ప్రారంభమవుతుంది. ఎక్స్‌యువి700 వేగం పెరుగుతుంది, కానీ అలా చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈ కారు అధిక వేగంతో కూడా బాగా నిర్వహించగలదు.

మహీంద్రా యొక్క కొత్త టెస్ట్ ట్రాక్ వివిధ రహదారి పరిస్థితులను అనుకరించడానికి వివిధ సెటప్‌లను కలిగి ఉంది. మేము ఇక్కడ ఉన్న అసమాన రహదారులపై డ్రైవ్ చేశాము. అయితే ఇది ఇలాటి రోడ్డులో కూడా సజావుగా ముందుకు సాగింది. స్టీరింగ్ వీల్ తక్కువ వేగంతో తేలికగా అనిపించింది మరియు అధిక వేగంతో కొద్దిగా గట్టిపడుతుంది.

ఎక్స్‌యువి700 యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులోకి బ్రేకింగ్ రెస్పాన్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రేక్ పెడల్‌లోని ప్రతి ఇన్‌పుట్‌కు కారు బాగా రెస్పాండ్ అవుతుంది.

మహీంద్రా ఎక్స్‌యువి700 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ కలిగి ఉన్న మొదటి భారతీయ వాహనం ఎక్స్‌యువి700. ఇందులోకి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఫీచర్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్-కీప్ అసిస్ట్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

అటానమస్ బ్రేకింగ్ అనే ఫీచర్ వాహనం ముందు ఉన్న అడ్డంకిని గుర్తించినప్పుడు, వేగంతో సంబంధం లేకుండా, అది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఒక సందేశాన్ని పాప్ చేస్తుంది. ఈ హెచ్చరిక తర్వాత కూడా, మీరు సందేశాన్ని విస్మరించి, మీ ముందు ఉన్నదానికి దగ్గరగా ఉంటే, మొదట స్టీరింగ్ వీల్ వైబ్రేట్ అవ్వడం ప్రారంభమవుతుంది మరియు అకస్మాత్తుగా బ్రేకులు వేయబడతాయి. మొదట్లో ఇది కొంత భయానకంగా ఉంటుంది. కానీ ఇది చాలా మంచి సేఫ్టీ ఫీచర్.

మహీంద్రా ఎక్స్‌యువి700 మైలేజ్ విషయానికొస్తే, మేము ఈ కారును కొన్ని గంటలు మాత్రమే డ్రైవ్ చేసాము. కావున పూర్తి స్థాయిలో మైలేజ్ గణాంకాలను పరీక్షించలేకపోయాము. అయితే ట్రాక్‌లో సాధ్యమయ్యే అన్ని టెస్ట్ లు మరియు హై-స్పీడ్ రన్స్ చేసిన తర్వాత, ఎమ్ఐడి స్క్రీన్ మీద ఒక లీటరునికి 7.5 నుండి 10 కిమీ మైలేజ్ అందించినట్లు చూపించింది. మేము త్వరలో సరైన రోడ్ టెస్ట్ రివ్యూ చేయబోతున్నాము. ఆ సమయంలో ఖచ్చితమైన మైలేజ్ గణాంకాలను వెల్లడిస్తాము.

మహీంద్రా ఎక్స్‌యువి700 కీ ఫీచర్స్:

మహీంద్రా ఎక్స్‌యువి700 అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో

  • 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
  • సోనీ ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్
  • అమెజాన్ అలెక్సా
  • ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే
  • యాంబియంట్ లైటింగ్
  • డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్
  • ఎయిర్ ఫ్యూరిఫైర్
  • 10.25 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్
  • ఇన్ బిల్ట్ నావిగేషన్, 3 డి మ్యాప్, లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్
  • AdrenoX యాప్ బేస్డ్ కంట్రోల్స్
  • ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్లు
  • మహీంద్రా ఎక్స్‌యువి700 సేఫ్టీ ఫీచర్స్:

    • 7 ఎయిర్‌బ్యాగులు
    • ESP
    • ఫ్రంట్ కొలీషియన్ వార్ణింగ్
    • అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్
    • లేన్ కీప్ అసిస్ట్
    • స్మార్ట్ పైలట్ అసిస్ట్
    • ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్
    • ఏబీఎస్ విత్ ఈబిడీ
    • ఎక్స్‌యువి700 లో ఉన్న 7 ఎయిర్‌బ్యాగులలో ఒకటి క్రాష్ అయినప్పుడు డ్రైవర్ మోకాళ్లను రక్షించడానికి స్టీరింగ్ కింద ఉంచబడుతుంది.

      డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

      కొత్త మహీంద్రా ఎక్స్‌యువి700 మనం పైన చెప్పుకున్నట్లుగా అద్భుతమైన అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, మంచి పనితీరుని అందిస్తూ వాహనదారునికి మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇది మంచి ధర వద్ద కూడా అందుబాటులో ఉంది.

      మహీంద్రా ఎక్స్‌యువి700 భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజార్, ఎంజి హెక్టర్ ప్లస్, టాటా సఫారీ మరియు రాబోయే జీప్ మెరిడియన్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కొనుగోలుదారులు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉన్న ఒక మంచి ఎస్‌యూవీ కోసం ఎదురుచూస్తున్నట్లతే ఎక్స్‌యువి700 మంచి ఎంపిక అవుతుంది.

Most Read Articles

English summary
Mahindra xuv700 telugu review interiors features specs engine performance driving impressions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X