మారుతి సుజుకి 'కూల్ యువర్ కార్' సమ్మర్ సర్వీస్ క్యాంప్ - డీటేల్స్

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, తమ వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక సర్వీస్ క్యాంప్‌ను ప్రకటించింది. ఈ వేసవి సీజన్‌కు తగినట్లుగా, మారుతి సుజుకి కస్టమర్లు తమ కార్లను సిద్ధంగా ఉంచుకునేందుకు గాను కంపెనీ 'కూల్ యువర్ కార్' పేరిట ఈ స్పెషల్ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించింది.

మారుతి సుజుకి 'కూల్ యువర్ కార్' సమ్మర్ సర్వీస్ క్యాంప్ - డీటేల్స్

మారుతి సుజుకి కూల్ యువర్ కార్ సర్వీస్ క్యాంప్ ఏప్రిల్ 20, 2021వ తేదీ నుండి ప్రారంభమైన మే 20, 2021వ తేదీ వరకు కొనసాగుతుందని కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి అరెనా మరియూ నెక్సా డీలర్‌షిప్‌లలో నెల రోజుల పాటు ఈ ప్రత్యేక సర్వీస్ క్యాంప్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.

మారుతి సుజుకి 'కూల్ యువర్ కార్' సమ్మర్ సర్వీస్ క్యాంప్ - డీటేల్స్

కూల్ యువర్ కార్ సర్వీస్ క్యాంప్‌లో భాగంగా, మారుతి సుజుకి సర్వీస్ సెంటర్లకు కస్టమర్లు తీసుకువచ్చే కార్లకు కంపెనీ కొన్ని రకాల ఉచిత తనిఖీలను చేయనుంది. అంతేకాకుండా, ఈ సమయంలో కంపెనీ కొన్ని రకాల సేవలు మరియు విడిభాగాలపై ప్రత్యేక రాయితీలను కూడా అందిస్తుంది.

MOST READ:రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

మారుతి సుజుకి 'కూల్ యువర్ కార్' సమ్మర్ సర్వీస్ క్యాంప్ - డీటేల్స్

పైన పేర్కొన్న సమయంలో మారుతి సుజుకి సర్వీస్ సెంటర్లకు వచ్చే వాహనాల విషయంలో కంపెనీ ఎసి రిపేర్ వర్క్, ఎసి ఫిల్టర్, ఎసి గ్యాస్, ఎసి ట్రీట్మెంట్ కిట్, కండెన్సర్ వంటి వాటిని తనిఖీ చేయనుంది. కోవిడ్-19 నేపథ్యంలో, సర్వీస్ సెంటర్‌కు వచ్చిన వాహనాలను సర్వీస్‌కు ముందు మరియు తర్వాత కంపెనీ పూర్తిగా శానిటైజ్ చేస్తుంది.

మారుతి సుజుకి 'కూల్ యువర్ కార్' సమ్మర్ సర్వీస్ క్యాంప్ - డీటేల్స్

అదేవిధంగా కారుపై పనిచేసే టెక్నీషియన్లు మరియు సలహాదారులు కూడా కారు లోపల మరియు వెలుపల ఏ విధంగానూ ప్రత్యక్ష సంబంధం లేకుండా ఉండలా రక్షణ కవర్లు ధరిస్తారని కంపెనీ తెలిపింది. ఈ విధంగా, వాహన తనిఖీ సమయంలో ఉద్యోగులు మరియు కస్టమర్ల మధ్య కోవిడ్-19 సంక్రమణ నుండి రక్షణ పొందవచ్చని కంపెనీ తెలిపింది.

MOST READ:కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

మారుతి సుజుకి 'కూల్ యువర్ కార్' సమ్మర్ సర్వీస్ క్యాంప్ - డీటేల్స్

ఈ ఆఫర్లన్నీ మారుతి సుజుకి యొక్క అధికారిక సర్వీస్ సెంటర్లలో మాత్రమే లభిస్తాయని గుర్తుంచుకోండి. అయితే, మీకు దగ్గరలో ఉన్న డీలర్‌షిప్ ఆపరేటింగ్‌లో ఉన్నది లేనిది అనే విషయాలు ఆయా రాష్ట్రాల లాక్‌డౌన్ నిబంధనలను బట్టి ఆధారపడి ఉంటాయి. మరిన్ని వివరాలను మీ స్థానిక మారుతి సుజుకి డీలరు నుండి తెలుసుకోవచ్చు.

మారుతి సుజుకి 'కూల్ యువర్ కార్' సమ్మర్ సర్వీస్ క్యాంప్ - డీటేల్స్

వేసవిలో కారును కూల్‌గా ఉంచుకోవటం ఎలా? - చిట్కాలు!

వేసవి కాలంలో కారును ఎండలో పార్క్ చేయటం వలన చాలా తక్కువ సమయంలోనే కారు లోపల వాతావరణం అత్యంత వేడిగా మారిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కారును చల్లగా ఉంచుకోవటం ఎలా? - ఇందుకు సంబంధించిన చిట్కాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

Most Read Articles

English summary
Maruti Suzuki Cool Your Car Summer Service Camp Announced, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X