అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India), వాహనాల ఉత్పత్తిలో అక్టోబర్ నెలలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనుంది. ఈ నెలలో కంపెనీ తమ మొత్తం ఉత్పత్తిలో 40 శాతాన్ని కోల్పోయే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా, మారుతి సుజుకి అక్టోబర్ 2021 లో నిర్దేశించిన మొత్తం ఉత్పత్తిలో కేవలం 60 శాతాన్ని మాత్రమే సాధించనున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి సంస్థకు భారతదేశంలో మానేసర్, గుర్గావ్ లలో రెండు కార్ల తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యం తగ్గనుంది.

అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

గత నెలలో కూడా కంపెనీ ఇదే సమస్యను ఎదుర్కుంది. ఫలితంగా, సెప్టెంబర్ 2021 నెలలో మారుతి సుజుకి కార్ల అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయి. ఈ అక్టోబర్ నెలలో కూడా తమ ఉత్పత్తి కార్యకలాపాలు సాధారణం కంటే 60 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని మారుతి సుజుకి ఓ ప్రకటనలో తెలిపింది.

అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

అదేవిధంగా, గత సెప్టెంబర్ మరియు ఆగస్టు నెలల్లో కూడా మారుతి సుజుకి ప్లాంట్‌లలో కార్ల ఉత్పత్తి సాధారణం కంటే 40 శాతం తగ్గి, 60 శాతానికి పడిపోయింది. ఈ నెల ప్రారంభంలో, మారుతి సుజుకి అక్టోబర్‌ 2021 నెలలో సుమారు 1,60,000 యూనిట్ల నుండి 1,80,000 యూనిట్ల కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

కాగా, తాజా నివేదిక ప్రకారం, కారు విడిభాగాల సరఫరా కొరతను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు మారుతి సుజుకి గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ సరఫరా కొరతను ఆధిగమించడం ద్వారా మారుతి సుజుకి అక్టోబర్ 2021 నెలలో ఉత్పత్తి లోటును భర్తీ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు మారుతి సుజుకి వివిధ పంపిణీదారుల నుండి ఎలక్ట్రానిక్ భాగాలను కలిగి ఉన్న చిప్‌సెట్‌ను కొనుగోలు చేయడానికి కొన్ని చర్యలు తీసుకుంటుందని కూడా నివేదించబడింది.

అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

ఉత్పత్తి అంతరాయాన్ని భర్తీ చేయడానికి మారుతి సుజుకి ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అక్టోబర్ 2021 నెలలో కార్ల ఉత్పత్తిని 60 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మారుతి గుజరాత్ ప్లాంట్ తన జపనీస్ భాగస్వామి సుజుకి కింద పనిచేస్తుంది. అయితే, గత కొన్ని నెలలుగా ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి తగ్గుతోంది.

అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

మారుతి సుజుకి మాత్రమే కాదు, ఈ సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా మహీంద్రా మరియు హ్యుందాయ్ వంటి ఇతర దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కుంటున్నాయి. ఈ సమస్య కారణంగా, కార్ల ఉత్పత్తిలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా, వాటి వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇది అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.

అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

ఇదివరకు సెమీకండక్టర్ చిప్స్ కోసం కార్ కంపెనీలు ఒకరు లేదా ఇద్దరు వెండర్లపై మాత్రమే ఆధారపడేవారు. ఎప్పుడైతే, ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య అధికమైందో, ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు అందుబాటులో ఉన్న వివిధ సరఫరాదారుల నుండి సెమీకండక్టర్ చిప్స్ ను కొనుగోలు చేయటం ప్రారంభిస్తున్నాయి. అయినప్పటికీ, సదరు కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని సాధారణ స్థాయికి చేర్చలేకపోతున్నారు.

అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

గడచిన సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలపై ఈ సెమీకండక్టర్ చిప్స్ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. సాధారణం కన్నా ఎక్కువ రేటు చెల్లించి సెమీకండక్టర్ చిప్స్ కొనుగోలు చేయటం వలన కంపెనీల ఉత్పాదక వ్యయం పెరిగింది. మరోవైపు పెరుగుతున్న ముడిసరుకుల ధరల వలన ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలను కూడా పెంచాల్సి వచ్చింది.

అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

ఈ సమస్యల వలన వాహనాల తయారీలో ఆలస్యం జరిగి, వాటి వెయిటింగ్ పీరియడ్ కూడా పెరుగుతోంది. ఫలితంగా, కస్టమర్లు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆసక్తి చూపినప్పటికీ, దాని సుధీర్ఘ వెయిటింగ్ పీరియడ్ కారణంగా వేరే బ్రాండ్ మోడళ్ల వైపుకు మళ్లుతున్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమలో మరికొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

కార్ల ఉత్పత్తిలో సెమీకండక్టర్ల కొరత కారణంగా సమస్యలు ఎదుర్కుంటున్న ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలలో మారుతి సుజుకి కూడా ఒకటి. ఈ సమస్య వలన గత సెప్టెంబర్ 2021 నెలలో మారుతి సుజుకి అమ్మకాలు సగానికి పైగా పడిపోయాయి. ప్రతినెలా సగటున 1.5 లక్షల కార్లను విక్రయించే మారుతి గత సెప్టెంబర్‌లో కేవలం 63,111 కార్లను విక్రయించింది. సెప్టెంబర్ 2020 తో పోలిస్తే ఇది 57.3 శాతం క్షీణించింది.

అక్టోబర్ 2021లో 60 శాతానికి పడిపోనున్న Maruti Suzuki కార్ ప్రొడక్షన్!

కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో లాంచ్‌కి రెడీ!

మారుతి సుజుకి నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండవ తరం (సెకండ్ జనరేషన్) సెలెరియో (Celerio) కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ను కంపెనీ నవంబర్ 10, 2021 వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మునుపటి మోడళ్లతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం సెలెరియో మోడల్ అనేక రెట్లు మెరుగ్గా ఉంటుందని సమాచారం. - ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maruti suzuki may achieve only 60 percent production in october details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X