7 లక్షల మంది కస్టమర్లకు పైగా చేరువైన Maruti Suzuki Vitara Brezza

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న విటారా బ్రెజ్జా (Vitara Brezza) ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. తాజాగా, ఈ ఎస్‌యూవీ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. మారుతి సుజుకి బ్రాండ్ యొక్క ఏకైక ఎస్‌యూవీ అయిన విటారా బ్రెజ్జా మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకూ 7 లక్షల మందికి పైగా కస్టమర్లకు చేరువయ్యింది.

7 లక్షల మంది కస్టమర్లకు పైగా చేరువైన Maruti Suzuki Vitara Brezza

మారుతి సుజుకి ఒక్క నవంబర్ నెలలోనే 10,760 యూనిట్ల విటారా బ్రెజ్జా కార్లను విక్రయించింది. గత 24 నెలల్లోనే 2 లక్షల యూనిట్లకు పైగా విటారా బ్రెజ్జాలను కంపెనీ విక్రయించింది. సేఫ్టీ విషయంలో ఈ కారు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, మారుతి సుజుకి బ్రాండ్ పట్ల ఉన్న విశ్వాసం మరియు ఈ బ్రాండ్ నుండి మరే ఇతర ఎస్‌యూవీ అందుబాటులో లేకపోవడంతో విటారా బ్రెజ్జా అమ్మకాలు సజావుగా సాగుతున్నాయి. మారుతి సుజుకి తమ విటారా బ్రెజ్జాలో కేవలం 2 ఎయిర్‌బ్యాగ్ లను (డ్రైవర్, కో-డ్రైవర్) మాత్రమే అందిస్తోంది.

7 లక్షల మంది కస్టమర్లకు పైగా చేరువైన Maruti Suzuki Vitara Brezza

నిజానికి, ఈ విభాగంలో అమ్ముడవుతున్న ఇతర మోడళ్లలో లభిస్తున్న ఫీచర్లతో పోలిస్తే, విటారా బ్రెజ్జా చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు. అయినప్పటికీ, ఈ మోడల్ అమ్మకాలు మాత్రం జోరుగానే ఉన్నాయి. మరి మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో కస్టమర్లను ఆక్టటుకుంటున్న అంశాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

7 లక్షల మంది కస్టమర్లకు పైగా చేరువైన Maruti Suzuki Vitara Brezza

అద్భుతమైన ఇంజన్, బెటర్ మైలేజ్

మారుతి సుజుకి కార్లు మంచి మైలేజీకి ప్రసిద్ధి చెందినవి. విటారా బ్రెజ్జా ఎస్‌యూవీ కూడా శక్తివంతమైన 1.5 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 105 పిఎస్ శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఇందులోని 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ లీటరుకు 18.76 కి.మీ మైలేజీని మరియు 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ లీటరుకు 17.03 కిమీల మైలేజీని అందిస్తుంది.

7 లక్షల మంది కస్టమర్లకు పైగా చేరువైన Maruti Suzuki Vitara Brezza

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్..

ఈ కారులో ఆఫర్ చేస్తున్న 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పాతది కావచ్చు. కానీ, ఇది టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని పొందే పెట్రోల్ ఇంజన్. టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అద్భుతమైన విశ్వసనీయత మరియు మృదువైన ఆపరేషన్‌ను ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా, అధిక ట్రాఫిక్‌లో చాలా ఓపికగా ప్రయాణించడానికి ఇది సహాయపడుతుంది. ఇది గేర్ షిఫ్టింగ్‌లో చాలా నెమ్మదిగా పనిచేసినప్పటికీ, థ్రోటల్ ఇన్‌పుట్‌లో చాలా బాగా పనిచేస్తుంది.

7 లక్షల మంది కస్టమర్లకు పైగా చేరువైన Maruti Suzuki Vitara Brezza

విశాలమైన క్యాబిన్ మరియు బూట్ స్పేస్

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా పట్ల కస్టమర్లు ఆకర్షితులు కావడానికి మరొక ప్రధాన కారణం దాని విశాలమైన క్యాబిన్ మరియు బూట్ స్పేస్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, ఈ కారులోని వెనుక సీట్లు తగినంత హెడ్ రూమ్ మరియు లెగ్ రూమ్ ని కలిగి ఉండి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఫలితంగా, ఇది దూర ప్రయాణాలకు కూడా అనువైన వాహనంగా ఉంటుంది.

7 లక్షల మంది కస్టమర్లకు పైగా చేరువైన Maruti Suzuki Vitara Brezza

ధరకు తగిన విలువను అందించే కారు

పిండి కొద్దీ రొట్టె అన్న చందంగా, విటారా బ్రెజ్జాలో కూడా ధర కొద్దీ ఫీచర్లు లభిస్తాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విటారా బ్రెజ్జా సరసమైన ధరను కలిగి ఉండి, ధరకు తగిన విలువను అందజేస్తుంది. ఈ విభాగంలో అందుబాటులో ఉన్నా హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనో కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్‌ వంటి కార్ల ధరలతో పోల్చుకుంటే, విటారా బ్రెజ్జా ధర చాలా తక్కువగా ఉంటుంది. మారుతి బ్రాండ్ పట్ల విశ్వసనీయత మరియు లోమెయింటినెన్స్ కారణంగా కస్టమర్లు ఎక్కువగా ఈ కారును ఇష్టపడుతుంటారు.

7 లక్షల మంది కస్టమర్లకు పైగా చేరువైన Maruti Suzuki Vitara Brezza

విటారా బ్రెజ్జా ప్రధాన ఫీచర్లు

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కారులో ప్రధానంగా లభించే ఫీచర్లను పరిశీలిస్తే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సుజుకి స్మార్ట్‌ప్లే స్టూడియో, మల్టీ ఇన్ఫర్మేషన్ డిజిటల్ అండ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ ఫీచర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

7 లక్షల మంది కస్టమర్లకు పైగా చేరువైన Maruti Suzuki Vitara Brezza

అంతేకాకుండా, ఈ కారులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ వైపర్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎల్ఈడి ఫాగ్ లైట్లు, ఫ్రంట్ సీట్ ఆర్మ్ రెస్ట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఏబిఎస్ స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి.

7 లక్షల మంది కస్టమర్లకు పైగా చేరువైన Maruti Suzuki Vitara Brezza

కొత్త 2022 Maruti Vitara Brezza వస్తోంది..

ఇదిలా ఉంటే, అత్యంత ప్రజాదరణ పొందిన ఈ విటారా బ్రెజ్జా ఎస్‌యూవీలో కంపెనీ ఓ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ ను వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న విటారా బ్రెజ్జా కన్నా మరింత మెరుగైన ప్రీమియం ఫీచర్లతో కంపెనీ ఈ కొత్త మోడల్ ను ప్రవేశపెట్టనుంది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maruti suzuki sold over 7 lakh vitara brezza suvs since its launched in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X