కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్స్!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అందిస్తున్న ఈకో ఎమ్‌పివిలోని కార్గో వేరియంట్స్‌ను కంపెనీ ఇప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది. ఇకపై మారుతి ఈకో కార్గో వేరియంట్లు రివర్స్ పార్కింగ్ అసిస్టెంట్ సిస్టమ్ (ఆర్‌పిఎఎస్)‌తో లభిస్తాయి.

కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్స్!

ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్లను కంపెనీ తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ అప్‌డేట్ కారణంగా ఈ వాహనాల ధరలను కూడా సవరించామని, ప్రస్తుత ఈకో కార్గో వాహనాల ధరలు రూ.4.27 లక్షల నుండి రూ.5.49 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయని కంపెనీ పర్కొంది.

కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్స్!

సవరించిన ధరలు ఏప్రిల్ 21, 2021 నుండి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి ఈకో కార్గో వాహనాలు పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లలో లభ్యమవుతాయి. ఈ వ్యాన్లలో కొత్తగా జోడించిన రివర్స్ పార్కింగ్ అసిస్టెంట్ సిస్టమ్ (ఆర్‌పిఎఎస్)‌ కారణంగా ఇప్పుడు వీటిని రివర్స్ చేయటం చాలా సులువుగా ఉంటుందని కంపెనీ వివరించింది.

MOST READ:రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్స్!

ఈ వ్యాన్లలో కొత్తగా జోడించిన ఆర్‌పిఎఎస్ వ్యవస్థతో పాటుగా, ఈకో యొక్క కార్గో వేరియంట్లలో స్పీడ్ లిమిటింగ్ డివైజ్, రిఫ్లెక్టర్ స్ట్రిప్స్, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ వంటి మరెన్నో ఫీచర్లను కూడా ఇందులో అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ఈబిడితో కూడిన ఏబిఎస్, సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్స్!

ఇంజన్ పరంగా మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని 1.2-లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి శక్తిని మరియు 98 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్స్!

ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. సిఎన్‌జి వెర్షన్‌లో ఇదే ఇంజన్ గరిష్టంగా 46 బిహెచ్‌పి శక్తిని మరియు 85 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే జతచేయబడి ఉంటుంది.

కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్స్!

ప్యాసింజర్ వెర్షన్ మారుతి సుజుకి ఈకో ఎమ్‍‌పివి వ్యాన్‌లో కూడా ఇదే పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో లేదు. మొత్తం ఈకో అమ్మకాల్లో 17 శాతం అమ్మకాలు సిఎన్‌జి వేరియంట్ల ద్వారానే వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:అలెర్ట్: కర్ణాటకలో 14 రోజుల కఠిన ఆంక్షలతో కరోనా లాక్‌డౌన్

కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్స్!

మారుతి సుజుకి ఈకో యొక్క బిఎస్ 6 కంప్లైంట్ వెర్షన్ కంపెనీ గతేడాది జనవరిలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత బిఎస్ 6 ఎస్-సిఎన్‌జి మోడల్‌ను మార్చి నెలలో మార్కెట్లో విడుదల చేసింది.

కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్స్!

ఈకో యొక్క కార్గో వేరియంట్‌ను తొలిసారిగా 2015లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మూడేళ్ళలోనే ఇది 1 లక్ష యూనిట్లకు పైగా అమ్ముడైంది. కాగా, 2018 నాటికి ఈ మోడల్ 5 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది.

MOST READ:భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయిన మారుతి సుజుకి ఈకో కార్గో వ్యాన్స్!

ఈ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, మారుతి సుజుకి తమ కస్టమర్ల కోసం 'కూల్ యువర్ కార్' పేరిట ఈ స్పెషల్ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్ క్యాంప్ ఏప్రిల్ 20, 2021వ తేదీ నుండి ప్రారంభమైన మే 20, 2021వ తేదీ వరకు కొనసాగుతుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maruti Suzuki Updates Eeco Cargo Variants With New Safety Feature. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X