భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ డిస్‌కంటిన్యూ !?

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ నుండి కంపెనీ తమ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్‌ను తొలగించింది.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ డిస్‌కంటిన్యూ !?

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ చూడటానికి ఓ ఎస్టేట్ వ్యాగన్‌లా అనిపిస్తుంది. దురదృష్టవశాత్తు మనదేశంలో ఎస్టేట్ వ్యాగన్‌లు అంతగా ప్రాచుర్యం పొందలేదు. అధిక ధర మరియు వ్యాగన్ లాంటి డిజైన్ కారణంగా ఈ కారు మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ డిస్‌కంటిన్యూ !?

ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ ఈ విభాగంలో వోల్వో వి90 క్రాస్ కంట్రీ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ ధర సుమారు రూ.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది.

MOST READ:ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్‌కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ డిస్‌కంటిన్యూ !?

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ ఎస్టేట్ వ్యాగన్ మోడల్‌లో బిఎస్-4 కంప్లైంట్ 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించేవారు. ఈ ఇంజన్ గరిష్టంగా 192 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ డిస్‌కంటిన్యూ !?

ఇది మెర్సిడెస్ బెంజ్ యొక్క సిగ్నేచర్ 4-మాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని ట్రాన్సిమిషన్ సాయంతో ఇంజన్ నుండి విడుదలయ్యే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది. ఈ మోడల్ వివిధ రకాల డ్రైవింగ్ మోడ్స్‌తో మంచి ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

MOST READ:ఏప్రిల్ 7 న భారత మార్కెట్లో విడుదల కానున్న 'సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్' ; పూర్తి వివరాలు

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ డిస్‌కంటిన్యూ !?

ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ ఎయిర్-సస్పెన్షన్ కలిగి ఉంటుంది, దీని సాయంతో ఈ కారు యొక్క రైడ్ ఎత్తును 35 మిమీ పెంచుకునే సౌలభ్యం ఉంటుంది. ప్రత్యేకించి ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ-క్లాస్‌లో ఆఫ్-రోడ్ వేరియంట్‌గా ఈ ఆల్-టెర్రైన్ మోడల్ ఇప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ డిస్‌కంటిన్యూ !?

కాగా, భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్‌ను పూర్తిగా తొలగించి వేసిందా లేక బిఎస్6 ఉద్గార నిబంధనల నేపథ్యంలో పాత మోడల్‌ను నిలిపివేసిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

MOST READ:2021 ఫిబ్రవరిలో అమ్ముడైన టాప్ 10 డీజిల్ కార్స్; వాటి వివరాలు

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ డిస్‌కంటిన్యూ !?

మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ న్యూస్‌ని పరిశీలిస్తే, కంపెనీ ఇటీవలే తమ ఈ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి (లాంగ్ వీల్ బేస్) సెడాన్ యొక్క 2021 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దేశీయ విపణిలో ఈ కారు ధర రూ.63.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆల్-టెర్రైన్ మోడల్ డిస్‌కంటిన్యూ !?

ఈ కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి సెడాన్ ఐదు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి: ఈ200 ఎక్స్ప్రెషన్, ఈ200 ఎక్స్‌క్లూజివ్, ఈ200డి ఎక్స్‌ప్రెషన్, ఈ200డి ఎక్స్‌క్లూజివ్ మరియు ఈ350డి వేరియంట్లు. వీటి ధరలు రూ.63.6 లక్షల నుండి రూ.80.9 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. - దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:చూస్తే ఒక్కసారైనా రైడ్ చేయాలనిపించే మాడిఫైడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్

Most Read Articles

English summary
Mercedes Benz E-Class All-Terrain Model Removed From Official Website, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X