భారత్‌లో విడుదలైన కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి ; ధర & వివరాలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి సెడాన్ యొక్క 2021 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త కార్ ధర దేశీయ మార్కెట్లో రూ. 63.6 లక్షలు. మెర్సిడెస్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి మూడు ఇంజన్ ఆప్షన్లతో పరిచయం చేయబడింది. ఇది కొత్త డిజైన్, అనేక అదనపు ఫీచర్లు మరియు పరికరాలతో వస్తుంది.

భారత్‌లో విడుదలైన కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి ; ధర & వివరాలు

ఈ కొత్త ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి సెడాన్ ఐదు వేరియంట్లలో ఇవ్వబడుతుంది. అవి ఇ 200 ఎక్స్ప్రెషన్, ఇ 200 ఎక్స్‌క్లూజివ్, ఇ 200 డి ఎక్స్‌ప్రెషన్, ఇ 200 డి ఎక్స్‌క్లూజివ్ మరియు ఇ 350 డి వేరియంట్లు. మెర్సిడెస్ బెంజ్ యొక్క బేస్ వేరియంట్ అయిన ఇ 200 ఎక్స్‌ప్రెషన్ ధర రూ. 63.6 లక్షలు కాగా, దీని E200 ఎక్స్‌క్లూజివ్ ధర రూ. 67.2 లక్షల వరకు ఉంది. అదే విధంగా ఎక్స్‌ప్రెషన్‌ ఇ 220 డి ధర రూ. 64.8 లక్షలు కాగా, ఇ 220 డి ఎక్స్‌క్లూజివ్ ధర రూ. 68.3 లక్షలు. చివరి మోడల్ అయిన ఇ 350 డి ధర రూ. 80.9 లక్షల వరకు ఉంది.

భారత్‌లో విడుదలైన కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి ; ధర & వివరాలు

2021 ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి సెడాన్ యొక్క బుకింగ్‌లు ఇప్పుడు భారతదేశంలోని అన్ని మెర్సిడెస్ బెంజ్ డీలర్‌షిప్‌లలో ఓపెన్ చేయబడ్డాయి. త్వరలో డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

MOST READ:నిస్సాన్ మాగ్నైట్ వాలెంటైన్స్ డే లక్కీ విజేతల వివరాలు వెల్లడి; ఇందులో మీ పేరుందా?

భారత్‌లో విడుదలైన కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి ; ధర & వివరాలు

మెర్సిడెస్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి స్టాండర్డ్ మోడల్ కంటే 140 మి.మీ పొడవు ఉంటుంది. కావున ఇందులో ఎక్కువ లెగ్‌రూమ్ లభిస్తుంది. మెర్సిడెస్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌ను కంపెనీ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టింది.

భారత్‌లో విడుదలైన కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి ; ధర & వివరాలు

కొత్త బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబిలో గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కొత్త టెయిల్ లైట్స్ మరియు క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్స్ ఉన్నాయి. ఇది కొత్త ఫ్రంట్ బంపర్, అల్లాయ్ వీల్స్ యొక్క కొత్త డిజైన్, ఫ్రంట్-టు-ఎండ్ క్యారెక్టర్ లైన్స్, కొత్త స్ప్లిట్ టెయిల్ లైట్లు, కొత్త ఎల్ఈడి సిగ్నేచర్ కలిగి ఉంది.

MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

భారత్‌లో విడుదలైన కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి ; ధర & వివరాలు

ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి రెండు 10.25 ఇంచెస్ స్క్రీన్‌లను కలిగి ఉంది, సరికొత్త MBUX సిస్టమ్ మరియు డ్రైవర్ డిస్ప్లే కోసం 12.3 ఇంచెస్ స్క్రీన్ తో పాటు MBUX సిస్టమ్‌ ఉంటుంది. ఇది అనేక డ్రైవింగ్ మరియు సెట్టింగ్ మోడ్‌ల కోసం డైనమిక్ సెలెక్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

భారత్‌లో విడుదలైన కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి ; ధర & వివరాలు

వీటితో పాటు, గ్రౌండ్ క్లియరెన్స్ పెంచడానికి ఎయిర్ సస్పెన్షన్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, రియర్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మెమరీ సీట్, యాంబియంట్ లైటింగ్, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, మెకనెక్ట్ కనెక్టివిటీ సూట్ ఇవ్వబడ్డాయి.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

భారత్‌లో విడుదలైన కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి ; ధర & వివరాలు

ఇక ఇందులో సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ప్రీ సేఫ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరాతో యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, యాక్టివ్ బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, యాక్టివ్ స్టీరింగ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి ; ధర & వివరాలు

మెర్సిడెస్ ఇ-క్లాస్‌లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 194 బిహెచ్‌పి శక్తిని మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. వీటితో పాటు 2.0 లీటర్స్, 3.0 లీటర్స్ ఆప్షన్‌ డీజిల్‌ ఇంజిన్లు కూడా ఉన్నాయి. ఇందులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 192 బిహెచ్‌పి శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, అదేవిధంగా 3.0-లీటర్ డీజిల్ ఇంజన్ 282 బిహెచ్‌పి శక్తిని మరియు 600 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అన్ని ఇంజన్లలో 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది.

MOST READ:ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

భారత్‌లో విడుదలైన కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి ; ధర & వివరాలు

2021 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి ఇప్పుడు కొత్త అప్‌డేట్‌లను కలిగి ఉంది, ఇది ఈ విభాగంలో మరింత ఆకర్షణీయమైన లగ్జరీ సెడాన్ సమర్పణగా మారింది. కొత్త ఇ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబి భారత మార్కెట్లో జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ మరియు ఆడి ఎ 6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Mercedes-Benz E-Class LWB Launched In India. Read in Telugu.
Story first published: Tuesday, March 16, 2021, 15:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X