దినదిన గండంగా మారుతున్న 'సెమీకండక్టర్ చిప్' కొరత: ఆలస్యం కానున్న MG Astor డెలివరీస్

ఆటోమొబైల్ పరిశ్రమలో ఇప్పటికీ కొనసాగుతున్న సెమీకండక్టర్ చిప్ కొరత ఎంజి మోటార్ (MG Motor) కంపెనీ యొక్క కొత్త ఎంజి ఆస్టర్ (MG Astor) డెలివరీలను ప్రభావితం చేస్తోంది. నివేదికల ప్రకారం ఎంజి మోటార్ కంపెనీ యొక్క సరఫరాదారులందరూ సెమీకండక్టర్ కొరతను ఎదుర్కొంటున్నారని, ఈ కారణంగా కార్ల ఉత్పత్తి ఆలస్యం అవుతోంది. ఈ కారణంగానే డెలివరీలు కూడా ఆలస్యం కానున్నాయి.

దినదిన గండంగా మారుతున్న 'సెమీకండక్టర్ చిప్' కొరత: ఆలస్యం కానున్న MG Astor డెలివరీస్

ఈని గురించి ఎంజి మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా, ఎంజి ఆస్టర్ బుకింగ్ మరియు డెలివరీ తేదీలపై ప్రస్తావించారు. సెమీకండక్టర్ చిప్ సరఫరా కారణంగా ప్రస్తుత పరిస్థితి కొంత శోచనీయంగా మారింది. కావున ఇప్పటికే ప్రకటించిన మా ప్రణాలికను మార్చుకుంటున్నామని ఆయన అన్నారు.

దినదిన గండంగా మారుతున్న 'సెమీకండక్టర్ చిప్' కొరత: ఆలస్యం కానున్న MG Astor డెలివరీస్

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది 5,000 యూనిట్లను డెలివరీ చేస్తామని వాగ్దానం చేసినప్పటికీ, పరిస్థితి మెరుగుపడకపోతే డెలివరీలను వచ్చే ఏడాదికి రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. అయితే ఎంజి ఆస్టర్ మొదటి బ్యాచ్‌లో బుక్ చేసుకున్న కస్టమర్ల కార్లను లాంచ్ ధరకే విక్రయిస్తామని కంపెనీ తెలిపింది.

దినదిన గండంగా మారుతున్న 'సెమీకండక్టర్ చిప్' కొరత: ఆలస్యం కానున్న MG Astor డెలివరీస్

భారతీయ మార్కెట్లో MG Motor (ఎంజి మోటార్) యొక్క కొత్త MG Astor (ఎంజి ఆస్టర్) రూ. 9.78 లక్షల ప్రారంభ ధర వద్ద గత నెలలో విడుదలైంది. ఎంజి ఆస్టర్ నాలుగు వేరియంట్లు (స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్) మరియు ఐదు ట్రిమ్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎంజి ఆస్టర్ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 16.78 లక్షలు.

దినదిన గండంగా మారుతున్న 'సెమీకండక్టర్ చిప్' కొరత: ఆలస్యం కానున్న MG Astor డెలివరీస్

కొత్త MG Astor అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో గ్రిల్ మరియు ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటివి ఉన్నాయి. దాని క్రింద ఫాగ్ లైట్స్ ఉన్నాయి, దీనితో పాటు బంపర్‌పై లైన్‌లు కూడా ఇవ్వబడ్డాయి, కావున ఇది మంచి దూకుడు రూపాన్ని అందుకుంటుంది. ఆస్టర్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అలాగే ఇండికేటర్‌తో పాటు ORVM లో చూడవచ్చు. ఈ కారు యొక్క గ్రిల్ భాగంలో 360 డిగ్రీ కెమెరా మరియు పార్కింగ్ కెమెరా వంటి వాటిని పొందుతుంది.

దినదిన గండంగా మారుతున్న 'సెమీకండక్టర్ చిప్' కొరత: ఆలస్యం కానున్న MG Astor డెలివరీస్

MG Astor మూడు ఇంటీరియర్ కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని డ్రైవర్ సీటు ఆరు రకాలుగా అడ్జస్ట్ చేయవచ్చు. ఇందులో స్టాండర్డ్, అర్బన్ మరియు డైనమిక్ అనే మూడు పవర్ స్టీరింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ SUV లో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 7 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

దినదిన గండంగా మారుతున్న 'సెమీకండక్టర్ చిప్' కొరత: ఆలస్యం కానున్న MG Astor డెలివరీస్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆస్టర్ 14 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో తీసుకువచ్చిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి కారు. ఇది పర్సనల్ అసిస్టెంట్ సిస్టమ్ సహాయంతో కారులో ఇవ్వబడుతుంది. కావున ఇది మీ ఆదేశాలను వింటుంది. అంతే కాకుండా దీని ద్వారా మ్యూజిక్ ప్లే చేయవచ్చు, ఫోన్ కాల్స్ తీసుకోవచ్చు. దీనికోసం పారాలింపిక్ క్రీడాకారిణి మరియు ఖేల్ రత్న విజేత 'దీపా మాలిక్' వాయిస్ ఉపయోగించబడింది.

దినదిన గండంగా మారుతున్న 'సెమీకండక్టర్ చిప్' కొరత: ఆలస్యం కానున్న MG Astor డెలివరీస్

MG Astor ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. రెండవది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇందులోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి వర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో జత చేయబడి ఉంటుంది. ఇక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 108 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది.

దినదిన గండంగా మారుతున్న 'సెమీకండక్టర్ చిప్' కొరత: ఆలస్యం కానున్న MG Astor డెలివరీస్

కొత్త MG Astor మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో అటానమస్ లెవల్-2 సిస్టమ్‌ ఉంటుంది.

దినదిన గండంగా మారుతున్న 'సెమీకండక్టర్ చిప్' కొరత: ఆలస్యం కానున్న MG Astor డెలివరీస్

ఇందులోని అటానమస్ లెవల్ -2 కింద, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు స్పీడ్ అసిస్ట్ ఇవ్వబడతాయి. వీటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కీని కలిగి ఉంది. ఎంజి ఆస్టర్‌కు ఐ-స్మార్ట్ హబ్ కింద పార్కింగ్ అసిస్ట్ అందించబడుతుంది. ఇది దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పార్కింగ్ స్థలాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. మొత్తానికి ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దినదిన గండంగా మారుతున్న 'సెమీకండక్టర్ చిప్' కొరత: ఆలస్యం కానున్న MG Astor డెలివరీస్

ప్రస్తుతం దేశంలో సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా డెలివరీ ఆలస్యం కానుంది. అయినప్పటికీ కంపెనీ ఈ ఆస్టర్ SUV ని బుక్ చేసుకున్న కస్టమర్లకు త్వరగా డెలివరీ చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తుంది. కావున డెలివరీలు వీలైనంత త్వరగా పొందే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Mg astor delivery to delay due to chip crisis details
Story first published: Monday, November 22, 2021, 12:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X