మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

భారతీయ మార్కెట్లో MG Motor (ఎంజి మోటార్) యొక్క కొత్త MG Astor (ఎంజి ఆస్టర్) ఎట్టకేలకు విడుదలైంది. ఈ కొత్త SUV ప్రారంభ ధర రూ. 9.78 లక్షలు. కంపెనీ ఈ SUV యొక్క బుకింగ్స్ కూడా ఈ నెల 21 నుంచి అధికారికంగా ప్రారంభించనుంది. అయితే దీనికోసం మీరు ముందుగా కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ కొత్త SUV గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

ఎంజి ఆస్టర్ నాలుగు వేరియంట్లు (స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్) మరియు ఐదు ట్రిమ్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎంజి ఆస్టర్ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 16.78 లక్షలు.

Style Super Smart Sharp
VTi-Tech MT ₹9,78,000 ₹11,28,000 ₹12,98,000 ₹13,95,000
VTi-Tech CVT ₹12,68,000 ₹14,18,000 ₹14,98,000
220 Turbo AT ₹15,88,000 ₹16,78,000
మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఎంజి ఆస్టర్ ఎస్‌యూవీని రిజర్వ్ చేసుకున్న వారు నవంబర్ మరియు డిసెంబర్‌లో డెలివరీ పొందుతారు. అయితే ప్రస్తుతం 2021 లో డెలివరీ చేయబడే వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. 2022 లో ఈ వెహికల్ ధరలు పెరుగుతాయి. అంతే కాకుండా ఇప్పుడు ఈ కొత్త SUV యొక్క మొదటి బ్యాచ్ కేవలం 3,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడే అవకాశం కూడా ఉంది.

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

MG Astor డిజైన్:

కొత్త MG Astor అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో గ్రిల్ మరియు ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటివి ఉన్నాయి. దాని క్రింద ఫాగ్ లైట్స్ ఉన్నాయి, దీనితో పాటు బంపర్‌పై లైన్‌లు కూడా ఇవ్వబడ్డాయి, కావున ఇది మంచి దూకుడు రూపాన్ని అందుకుంటుంది.

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

ఆస్టర్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది, కావున చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, అలాగే ఇండికేటర్‌తో పాటు ORVM లో చూడవచ్చు. ఈ కారు యొక్క గ్రిల్ భాగంలో 360 డిగ్రీ కెమెరా మరియు పార్కింగ్ కెమెరా వంటి వాటిని పొందుతుంది. మొత్తానికి ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుంది.

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

MG Astor ఇంటీరియర్ మరియు ఫీచర్స్:

MG Astor మూడు ఇంటీరియర్ కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని డ్రైవర్ సీటు ఆరు రకాలుగా అడ్జస్ట్ చేయవచ్చు. ఇందులో మూడు పవర్ స్టీరింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి స్టాండర్డ్, అర్బన్ మరియు డైనమిక్ మోడ్స్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

కొత్త ఆస్టర్ SUV లో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 7 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆస్టర్ 14 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో తీసుకువచ్చిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి కారు. ఇది పర్సనల్ అసిస్టెంట్ సిస్టమ్ సహాయంతో కారులో ఇవ్వబడుతుంది. కావున ఇది మీ ఆదేశాలను వింటుంది. అంతే కాకుండా దీని ద్వారా మ్యూజిక్ ప్లే చేయవచ్చు, ఫోన్ కాల్స్ తీసుకోవచ్చు. దీనికోసం పారాలింపిక్ క్రీడాకారిణి మరియు ఖేల్ రత్న విజేత 'దీపా మాలిక్' వాయిస్ ఉపయోగించబడింది.

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

MG Astor ఇంజిన్:

MG Astor ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. రెండవది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

ఇందులోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి వర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో జత చేయబడి ఉంటుంది.

ఇక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 108 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది.

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

MG Astor సేఫ్టీ ఫీచర్స్:

కొత్త MG Astor మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఈ కొత్త SUV లో అటానమస్ లెవల్-2 సిస్టమ్‌ ఉంటుంది. కావున ఇది వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ SUV రిలయన్స్ జియో రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు టెలిమాటిక్స్ కోసం భాగస్వామిగా ఉంది. దీని కోసం ఈ-సిమ్ మరియు లాట్ టెక్నాలజీ ఇవ్వబడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం రోబోట్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇది వాహనదారుల ఆదేశాలను పాటిస్తుంది.

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

ఇందులోని అటానమస్ లెవల్ -2 కింద, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు స్పీడ్ అసిస్ట్ ఇవ్వబడతాయి. వీటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కీని కలిగి ఉంది. ఎంజి ఆస్టర్‌కు ఐ-స్మార్ట్ హబ్ కింద పార్కింగ్ అసిస్ట్ అందించబడుతుంది. ఇది దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పార్కింగ్ స్థలాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది.

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

Astor యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,323 మిమీ, వెడల్పు 1,809 మిమీ మరియు ఎత్తు 1,650 మిమీ వరకు ఉంటుంది.

ఇక వారంటీ విషయానికి వస్తే, కంపెనీ ఈ కొత్త SUV పై 3 సంవత్సరాల అపరిమిత కిమీ వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు 3 సంవత్సరాల లేబర్ ఫ్రీ సర్వీసుతో అందిస్తున్నారు, అయితే కస్టమర్లు దీనిని 1 సంవత్సరంలోపు లేదా 1 లక్ష కిమీ వరకు 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇవన్నీ కూడా వాహన వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మార్కెట్లో కొత్త MG Astor వచ్చేసింది.. ధర రూ. 9.78 లక్షలు

కంపెనీ ఈ కొత్త అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగిన లేటెస్ట్ SUV ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది, అయితే ఇది ఎలాంటి అమ్మకాలతో ముందుకు వెలుతుంది, మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుందా.. ? లేదా..? అనే విషయం త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 11, 2021, 13:44 [IST]
English summary
Mg astor launched price rs 9 78 lakh features engine variant details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+