టెస్టింగ్ సమయంలో మరోసారి కెమెరాకు చిక్కిన MG Astor; వివరాలు

MG Motor (ఎంజి మోటార్) కంపెనీ దేశీయ మార్కెట్లో MG Astor అనే కొత్త మోడల్ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ కొత్త MG Astor పర్వత ప్రాంతాల్లో టెస్ట్ చేస్తోంది. ఈ కొత్త SUV అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉంటుంది. అంటే కాకుండా ఈ కొత్త మోడల్ మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ టక్నాలజీ కలియు ఉంటుంది.

టెస్టింగ్ సమయంలో మరోసారి కెమెరాకు చిక్కిన MG Astor; వివరాలు

టెస్టింగ్ సమయంలో గుర్తించబడిన కొత్త MG Astor పోటోలను కూడా ఇక్కడ మీరు అమానించవచ్చు. MG Astor యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో MG బ్రాండ్ లోగో కవర్ చేయబడింది. అయితే ఈ కొత్త SUV యొక్క గ్రిల్ మరియు హెడ్‌లైట్ చూడవచ్చు చూడవచ్చు.

టెస్టింగ్ సమయంలో మరోసారి కెమెరాకు చిక్కిన MG Astor; వివరాలు

MG Astor లో LED యూనిట్ ఉపయోగించబడింది. దాని క్రింద ఫాగ్ లైట్స్ ఉన్నాయి. అంతే కాకుండా బంపర్‌పై లైన్‌లు ఇవ్వబడ్డాయి. కావున ఇది కారుకి మంచి దూకుడు రూపాన్ని అందిస్తుంది. ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ 5-స్పోక్ అల్లాయ్ వీల్ చూడవచ్చు, ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇండికేటర్‌తో పాటుగా ORVM లో చూడవచ్చు.

టెస్టింగ్ సమయంలో మరోసారి కెమెరాకు చిక్కిన MG Astor; వివరాలు

MG Astor యొక్క డోర్ హ్యాండిల్ మరియు రూఫ్ రైల్ కూడా ఇక్కడ గమనించవచ్చు. ఈ కొత్త SUV యొక్క వెనుక భాగంలో టైల్ లైట్ మరియు MG లోగో వంటివి చూడవచ్చు. దీనికి ఎగువన స్టాప్ లైట్ మరియు దిగువన స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. దీనిలో ఎక్కువ భాగం కాన్సెప్ట్ మోడల్ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నాము.

టెస్టింగ్ సమయంలో మరోసారి కెమెరాకు చిక్కిన MG Astor; వివరాలు

కంపెనీ MG Astor ను డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌తో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కావున ఇది బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఈ డ్యూయెల్ టోన్ కలర్ లోపల డాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్‌లు మరియు సీట్లపై కూడా ఉంటుంది. అంతే కాకూండా డాష్‌బోర్డ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చుట్టూ స్మూత్ లెదర్ ఉపయోగించవచ్చు.

టెస్టింగ్ సమయంలో మరోసారి కెమెరాకు చిక్కిన MG Astor; వివరాలు

MG Astor యొక్క ఇంటీరియర్‌ చాలా సరళమైన డిజైన్ కలిగి ఉంటాయి. ఇందులో రెండు వైపులా రౌండ్ ఏసీ వెంట్‌లు ఉన్నాయి. డాష్‌బోర్డ్‌ కూడా చాలా కు చాలా సరళమైన డిజైన్ ఇవ్వబడింది మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మధ్యలో ఉంచబడింది మరియు గేర్‌బాక్స్ దాని దిగువన ఉంచబడింది.

టెస్టింగ్ సమయంలో మరోసారి కెమెరాకు చిక్కిన MG Astor; వివరాలు

ఇందులోని సెంట్రల్ కన్సోల్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది మరియు ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో వస్తుంది. ఏసీ వెంట్‌లు టచ్‌స్క్రీన్ పైన ఉంచబడ్డాయి, కంట్రోల్ స్విచ్‌లు స్క్రీన్ క్రింద ఉంచబడ్డాయి.

టెస్టింగ్ సమయంలో మరోసారి కెమెరాకు చిక్కిన MG Astor; వివరాలు

ఇటీవల కంపెనీ MG Astor యొక్క ఫీచర్స్ కూడా వెల్లడించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ SUV లో, రిలయన్స్ జియో రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్, టెలిమాటిక్స్ కోసం ఈ-సిమ్ మరియు లాట్ టెక్నాలజీని అందిస్తుంది. అంటే కాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అసిస్టెంట్ కూడా అందించబడుతుంది. ఇది క్యాబిన్ లోపల డాష్‌బోర్డ్‌లో ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది క్యాబిన్ లోపల డాష్‌బోర్డ్‌పై అమర్చబడిన చిన్న రోబోట్. ఈ రోబోపై చిన్న స్క్రీన్ కూడా ఇవ్వబడింది. ఇది రోబోట్ యొక్క వ్యక్తీకరణను చూపుతుంది. ఇది వాయిస్ ద్వారా డ్రైవర్‌ను గుర్తిస్తుంది, అంతే కాకుండా వాయిస్ కమాండ్‌ల ఆధారంగా పనిచేస్తుంది.

టెస్టింగ్ సమయంలో మరోసారి కెమెరాకు చిక్కిన MG Astor; వివరాలు

కొత్త MG Astor అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీని కూడా ఉపయోగిస్తుంది, అంతే కాకుండా ఇది ఇండియన్ మార్కెట్లో ఏ ఇతర కారులోనూ అందుబాటులో లేని అటానమస్ లెవల్-2 టెక్నాలజీని కలిగి ఉంది. ఇందులో చాలా వరకు కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

టెస్టింగ్ సమయంలో మరోసారి కెమెరాకు చిక్కిన MG Astor; వివరాలు

MG Motor కంపెనీ ఈ కొత్త MG Astor SUV ని పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లాంచ్ చేసే అవకాశం ఉంది. కావున ఇందులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ లేదా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు మాన్యువల్ ఆప్షన్‌తో అందించబడుతుంది. అయితే కంపెనీ దీని గురించి అధికారిక సమాచారం అందించలేదు.

MG Motor యొక్క ఈ కొత్త మోడల్ భారతీయ మార్కెట్లో పండుగ సీజన్లలో విడుదలకానున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ కొత్త MG Astor అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము.

More from DriveSpark

Article Published On: Monday, September 6, 2021, 12:33 [IST]
English summary
Mg astor spied testing design features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+