MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ (MG Motor) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఎమ్‌జి ఆస్టర్' (MG Astor) ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదలైంది. కంపెనీ ఈ కారును నేడు (అక్టోబర్ 11, 2021వ తేదీన) దేశీయ విపణిలో విడుదల చేసింది.

MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

ఎమ్‌జి ఆస్టర్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే వేరియంట్లు ఉన్నాయి. ఈ వేరియంట్లలో స్టైల్ అనేది ఆస్టర్ యొక్క బేస్ వేరియంట్, ఈ వేరియంట్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుది.

MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

మరి ఈ కథనంలో ఎమ్‌జి ఆస్టర్ స్టైల్ బేస్ వేరియంట్ యయొక్క ధర, ఇందులో లభించే ఫీచర్లు, ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ వివరాలు అలాగే మైలేజ్ వంటి విషయాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి. ఒకవేళ మీరు ఈ బేస్ వేరియంట్ ని కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

MG Astor Style - ధర

భారత మార్కెట్లో ఎమ్‌జి ఆస్టర్ స్టైల్ (MG Astor Style) వేరియంట్ ధర రూ. 9.78 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంటుంది. ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఈ వేరియంట్ 1.5 లీటర్ న్యాచుల్ పెట్రోల్ ఇంజన్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది.

MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కావాలనుకునే వారు సూపర్ వేరియంట్ ను ఎంచుకోవచ్చు. అలాగే, టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారు స్మార్ట్ లేదా షార్ప్ అనే వేరియంట్లను ఎంచుకోవచ్చు. వీటి ధరలు రూ. 11.28 లక్షల నుండి రూ. 16.78 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

MG Astor Style - ఫీచర్లు

  • ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, మూడు స్టీరింగ్ మోడ్‌లు
  • డాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్, ఆర్మ్‌రెస్ట్‌లు మరియు సెంటర్ కన్సోల్‌పై ప్రీమియం లెదర్ ఇన్‌సెర్ట్స్
  • డిల్ డిసెంట్ కంట్రోల్
  • ఎల్ఈడి హంక్ఐ హెడ్‌లైట్
  • ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్
  • PM 2.5 ఫిల్టర్‌తో కూడిన ఆటోమేటిక్ ఏసి
  • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  • రియర్ డిఫాగర్
  • రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఫోల్డబుల్ కీ
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్
  • 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • MG Astor Style - సేఫ్టీ ఫీచర్లు

    • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్
    • ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
    • హిల్ హోల్డ్ కంట్రోల్
    • హిల్ డీసెంట్ కంట్రోల్
    • అన్ని చక్రాలపై డిస్క్ బ్రేకులు
    • ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్
    • మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు
    • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్
    • MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

      MG Astor Style - ఇంజన్ ఆప్షన్

      ఎమ్‌జి ఆస్టర్ స్టైల్ బేస్ వేరియంట్ కాబట్టి, ఇది కేవలం ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. ఈ వేరియంట్ లో 1498 సిసి (1.5 లీటర్) న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

      MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

      ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. ఈ వేరియంట్ లో సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండదు, కానీ ఇది ఇతర మూడు (సూపర్, స్మార్ట్, షార్ప్) వేరియంట్లలో లభిస్తుంది. స్మార్ట్ మరియు షార్ప్ వేరియంట్లలో ఇందులోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లభిస్తుంది. ఇది 138 బిహెచ్‌పి పవర్ ను మరియు 220 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మాత్రం 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది.

      MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

      MG Astor Style - మైలేజ్

      ఎమ్‌జి మోటార్ ఇండియా ఇంకా తమ ఆస్టర్ యొక్క మైలేజ్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. ఇందులోని 1462 సిసి పెట్రోల్ ఇంజన్ / మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ యొక్క రియల్ వరల్డ్ మైలేజ్ లీటరుకు సుమారు 12 - 16 కిమీ ఉంటుందని అంచనా. కంపెనీ ఈ కారులో 48 లీటర్ల పెద్ద ఇంధన ట్యాంక్ ను ఆఫర్ చేసింది.

      MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

      MG Astor Style - కలర్ ఆప్షన్స్

      ఎమ్‌జి ఆస్టర్ స్టైల్ మొత్తం 5 కలర్ ఆప్షన్‌ లలో అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

      • స్పైస్డ్ ఆరెంజ్
      • అరోరా సిల్వర్
      • గ్లేజ్ రెడ్
      • క్యాండీ వైట్
      • స్టారీ బ్లాక్
      • MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

        MG Astor Style - వీల్స్, బ్రేక్స్, సైజ్

        ఎమ్‌జి ఆస్టర్ స్టైల్ వేరియంట్ 215/55 R17 చక్రాలను కలిగి ఉంటుంది. ఇందులో స్పేర్ వీల్ సైజ్ 215/60 R16 గా ఉంటుంది. ఇవన్నీ కూడా స్టాండర్డ్ స్టీల్ వీల్స్. బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు మరియు వెనుక భాగాల్లో (అన్ని చక్రాలపై) డిస్క్ బ్రేక్‌లు ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి. ఈ ఎస్‌యూవీ పొడవు 4323 మిమీ, వెడల్పు 1809 మిమీ, ఎత్తు 1650 మిమీ మరియు వీల్‌బేస్ 2585 మిమీ గా ఉంటుంది.

        MG Astor Style బేస్ వేరియంట్ కొనొచ్చా? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

        డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

        ఎమ్‌జి ఆస్టర్ స్టైల్ అనేది బేస్ వేరియంట్ అయినప్పటికీ, కంపెనీ ఇందులో తగినన్ని ఫీచర్లను అందిస్తోంది మరియు వీటిలో చాలా వరకు ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కాబట్టి, ఈ నేపథ్యంలో ఆస్టర్ యొక్క స్టైల్ వేరియంట్ కొనుగోలు చేయడం సముచితంగానే ఉంటుంది. అయితే, మీరు మరింత శక్తివంతమైన ఇంజన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు హై-టెక్ స్మార్ట్ ఫీచర్లను కోరుకుంటే మాత్రం మీకు షార్ప్ (టాప్-ఎండ్) వేరియంట్ చాలా అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 11, 2021, 17:34 [IST]
English summary
Mg astor style base variant price specs features and other details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+