సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్; కేవలం రూ.49,999 మాత్రమే!

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు "ఎమ్‌జి జిఎస్" కోసం కంపెనీ కొత్తగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు కంపెనీ జూమ్‌కార్ మరియు ఓరిక్స్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్; కేవలం రూ.49,999 మాత్రమే!

ఏకకాలంలో మొత్తం డబ్బును చెల్లించి ఈ ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోలేని కస్టమర్లు ప్రతినెలా రూ.49,999 చెల్లించి ఈ కారును సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ సమయంలో ఇన్సూరెన్స్ నుండి మెయింటినెన్స్ వరకూ అన్ని విషయాలను కంపెనీయే చూసుకుంటుంది.

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్; కేవలం రూ.49,999 మాత్రమే!

ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం ప్రవేశపెట్టిన ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రస్తుతం ముంబై, పూణే, ఢిల్లీ-ఎన్‌సిఆర్ మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే అందిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో ఈ ప్లాన్‌ను ప్రారంభించనున్నారు. ఇది 12, 24, 18, 30 మరియు 36 నెలల చందా ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్; కేవలం రూ.49,999 మాత్రమే!

ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీని గతేడాది జనవరిలో భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇది ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు వేరియంట్‌లలో మాత్రమే లభిస్తోంది. భారత మార్కెట్లో దీని ఎంట్రీ లెవల్ వేరియంట్ (ఎక్సైట్) ధర రూ.20.88 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ (ఎక్స్‌క్లూజివ్) ధర రూ.23.58 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్; కేవలం రూ.49,999 మాత్రమే!

ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 3-ఫేజ్ పర్మినెంట్ మాగ్నెట్ మోటార్ ఉంటుంది, ఇది 44.5 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 141 బిహెచ్‌పి పవర్‌ను మరియు 353 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్; కేవలం రూ.49,999 మాత్రమే!

ఇందులోని బ్యాటరీలను హోమ్ ఛార్జర్ ద్వారా అయితే, 80 శాతం వరకూ ఛార్జ్ చేయటానికి 6 నుండి 7 గంటల సమయం పడుతుంది. అదే 50 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, ఈ ఎస్‌యూవీని కేవలం 50 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్; కేవలం రూ.49,999 మాత్రమే!

ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జీపై గరిష్టంగా 340 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో త్రీ-లెవల్ బ్రేకింగ్ రీజనరేషన్ టెక్నాలజీ కూడా ఉంది, ఇది బ్రేకింగ్ చేసేటప్పుడు బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది, ఫలితంగా డ్రైవింగ్ రేంజ్ పెరుగుతుంది.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్; కేవలం రూ.49,999 మాత్రమే!

ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అద్భుతమైన ఫీచర్లు లభిస్తాయి. ఇందులో స్టార్-రైడర్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, హీటెడ్ రియర్ వ్యూ మిర్రర్స్, రూఫ్ ట్రాక్స్, ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్ మొదలైనవి ఉన్నాయి.

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్; కేవలం రూ.49,999 మాత్రమే!

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క ‘ఐ-స్మార్ట్' కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2.5 పిఎమ్ ఎయిర్-ఫిల్టర్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్; కేవలం రూ.49,999 మాత్రమే!

అంతేకాకుండా, ఇందులో కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ మరియు స్మార్ట్‌ఫోన్ ద్వారా లేదా ఏఐ సహాయంతో మీ కారును కంట్రోల్ చేయటానికి 60కి పైగా వాయిస్ కమాండ్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీని ఫెర్రిస్ వైట్, కోపెన్‌హాగన్ బ్లూ మరియు కరెంట్ రెడ్ అనే కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు.

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్; కేవలం రూ.49,999 మాత్రమే!

ఇదిలా ఉంటే, ఎమ్‌జి జిఎస్ మోడల్‌లో కంపెనీ ఓ పెట్రోల్ వెర్షన్‌ను కూడా డెవలప్ చేస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ మోడల్ ఈ ఏడాది మధ్య భాగం నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
MG Motor Launches ZS EV Subscription Plan Through Zoomcar And Orix. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X