హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్: మైలేజ్‌లో ఏది బెస్ట్?

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఇటీవలే క్రెటా ఆధారంగా నిర్మించిన సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ అల్కాజార్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ ఎస్‌యూవీ పరిమాణంలో క్రెటా కన్నా పెద్దదిగా ఉండి, 6 లేదా 7 సీట్ల ఆప్షన్లతో విడుదల చేయబడింది. భారత మార్కెట్లో కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ప్రారంభ 16.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్: మైలేజ్‌లో ఏది బెస్ట్?

హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీని కంపెనీ కె2 డిజైన్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి తయారు చేసింది. హ్యుందాయ్ యొక్క పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటాని కూడా ఇదే ప్లాట్‌ఫాంపై నిర్మించారు. దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజార్ నేరుగా టాటా సఫారీ మరియు ఎంజి హెక్టర్ ప్లస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ రాకతో ఈ విభాగంలో పోటీ అధికమైంది.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్: మైలేజ్‌లో ఏది బెస్ట్?

అల్కజార్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. కానీ, దాని ప్రధాన పోటీదారు అయిన సఫారీ మాత్రం కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తోనే లభిస్తుంది. అదే సమయంలో ఎంజి హెక్టర్ ప్లస్ మాత్రం పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. మరి ఈ మూడు మోడళ్ల యొక్క మైలేజ్ వివరాలు ఏమిటి, మైలేజ్ పరంగా వీటిలో ఏది బెస్ట్ అనేది ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్: మైలేజ్‌లో ఏది బెస్ట్?

హ్యుందాయ్ అల్కాజార్ రెండు ఇంజన్ ఆప్షన్లలో ప్రవేశపెట్టబడింది, వీటిలో 1.5-లీటర్ డీజిల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. దీని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 159 బిహెచ్‌పి పవర్ మరియు 191 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్-డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్: మైలేజ్‌లో ఏది బెస్ట్?

హ్యుందాయ్ అల్కజార్ పెట్రోల్ ఇంజన్ మైలేజ్:

హ్యుందాయ్ అల్కాజార్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇందులోని 6-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 14.5 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుండగా, 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 14.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్: మైలేజ్‌లో ఏది బెస్ట్?

ఎంజి హెక్టర్ ప్లస్ పెట్రోల్ ఇంజన్ మైలేజ్:

ఇకపోతే, ఎంజి హెక్టర్ ప్లస్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇందులోని 6-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 14 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుండగా, 6-స్పీడ్ డిసిటి / సివిటి ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 11.6 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. కాగా, ఈ విభాగంలో టాటా నుండి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్: మైలేజ్‌లో ఏది బెస్ట్?

హ్యుందాయ్ అల్కజార్ డీజిల్ ఇంజన్ మైలేజ్:

డీజిల్ ఇంజన్ మైలేజ్ విషయానికి వస్తే, హ్యుందాయ్ అల్కాజార్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులోని 6-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుండగా, 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 18.1 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని అంచనా.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్: మైలేజ్‌లో ఏది బెస్ట్?

ఎంజి హెక్టర్ ప్లస్ డీజిల్ ఇంజన్ మైలేజ్:

ఎంజి హెక్టర్ ప్లస్ 2.0 డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇందులోని 6-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 16.56 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఈ విభాగంలో ఎంజి హెక్టర్ ప్లస్ డీజిల్ వేరియంట్లు కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తాయి, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో లేదు.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్: మైలేజ్‌లో ఏది బెస్ట్?

టాటా సఫారీ డీజిల్ ఇంజన్ మైలేజ్:

టాటా హారియర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా కంపెనీ రూపొందించిన 6-సీటర్ మరియు 7-సీటర్ ఎస్‌యూవీ టాటా సఫారీ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుది. ఇందులోని 6-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 16.14 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుండగా, 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 14.08 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్: మైలేజ్‌లో ఏది బెస్ట్?

మరి మైలేజ్‌లో ఏ కారు బెస్ట్?

పెట్రోల్ వెర్షన్‌లోని హ్యుందాయ్ అల్కాజార్ యొక్క 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ ఈ విభాగంలో అత్యధికంగా లీటరుకు 14.5 కిమీ మైలేజీని అందిస్తుంది. అదే సమయంలో, డీజిల్ వెర్షన్‌లోని హ్యుందాయ్ అల్కజార్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ లీటరుకు 20.4 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే, పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లు రెండింటిలోనీ టాటా సఫారీ మరియు ఎంజి హెక్టర్ ప్లస్‌ల కన్నా హ్యుందాయ్ అల్కజార్ మెరుగ్గా ఉంటుంది.

Most Read Articles

English summary
Mileage Comparison Between Hyundai Alcazar, Tata Safari And MG Hector Plus. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X