గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

మోటారిస్టులకు గుడ్ న్యూస్. మీరు మీ వాహనంతో పాటుగా తరచూ ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి బదిలీ అవుతున్నట్లయితే, మీరు మీ పాత వాహనాన్ని కొత్త రాష్ట్రంలో కొత్తగా రీ-రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేలా భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH India) ఓ కొత్త నిబంధనను తీసుకువచ్చింది.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం, ప్రభుత్వం కొత్త వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్ గుర్తును కూడా ప్రవేశపెట్టింది, ఇది భారత్ సిరీస్ (BH - Series) పేరుతో ఉంటుంది.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఒక వాహన యజమాని భారతదేశంలోని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు, అతను BH - సిరీస్ మార్కు కలిగిన వాహనం కలిగి ఉంటే, అతనికి కొత్తగా బదిలీ అయిన రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ అవసరం ఉండదు.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

ప్రస్తుతం ఈ సదుపాయం దేశ రక్షణ సిబ్బంది, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాష్ట్ర పిఎస్‌యులు మరియు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో కార్యాలయాలు కలిగిన ప్రైవేటు రంగ కంపెనీలకు స్వచ్ఛందంగా అందుబాటులో ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో "ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు స్టేషన్ బదిలీ అందుబాటులో ఉంది. ఇటువంటి పథకాలు చాలా మంది ఉద్యోగుల మనస్సులో అసహనాన్ని సృష్టించాయి".

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

"మోటార్ వాహనాల చట్టం, 1988 సెక్షన్ 47 ప్రకారం, వాహనం రిజిస్టర్ చేయబడిన రాష్ట్రం మినహా ఏ రాష్ట్రంలో నైనా ఒక వ్యక్తి 12 నెలలకు మించి ఆ వాహనాన్ని ఉంచడానికి అనుమతి ఉండదు. కాబట్టి 12 నెలల లోపే వినియోగదారులు తమ పాత వాహనాన్ని కొత్త రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది." అని తెలిపింది.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

ఈ సమస్యకు పరిష్కారంగా, ఐటి ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే BH - సిరీస్‌ ను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఈ చర్య వలన తరచూ రాష్ట్రాలు బదిలీ అయ్యే ఉద్యోగులు వాహనాల రిజిస్ట్రేషన్ బదిలీ విషయంలో కూడా ఉపశమనం పొందవచ్చు.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

ఈ కొత్త నిబంధన అమల్లోకి రానంత వరకూ వాహనదారులకు ఈ ప్రక్రియ చాలా అసౌకర్యంగా మరియు ఎక్కువ సమయం మరియు డబ్బుతో కూడుకున్నదిగా ఉండేది. ఒక వాహనాన్ని పాత రాష్ట్రం నుండి కొత్త రాష్ట్రానికి బదిలీ చేయాలంటే, పాత రాష్ట్రంలో సదరు వాహనానికి సంబంధించిన ఎన్ఓసి (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)ను పొందాల్సి ఉంటుంది.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

వాహనదారులు ఈ ఎన్ఓసి కోసం పాత రాష్ట్రంలో ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త రాష్ట్రంలోని ఆర్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి తన పాత వాహనాన్ని కొత్త వాహనంలో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్టర్ చేసుకునేటప్పుడు కొత్త రాష్ట్రంలో రోడ్డు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

కానీ, ఇప్పుడు ఈ కొత్త BH - సిరీస్ తో ఇదంతా సులువుగా జరిగిపోనుంది. కొత్త BH - సిరీస్ తో, వాహన యజమాని మరొక రాష్ట్రానికి తన వాహనాన్ని తీసుకువెళ్లడంలో పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు మరియు వారి సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది. ఈ విషయంలో వారు మోటార్ వాహన పన్నును రెండు సంవత్సరాలకు ఒకసారి చొప్పున చెల్లిస్తూ ఉంటే సరిపోతుంది.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

ఈ పథకం వలన భారతదేశంలోని ఉద్యోగస్తులు ప్రస్తుత రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నుండి తమ ప్రైవేట్ వాహనాలను కొత్త రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతానికి బదిలీ చేసినప్పుడు, కొత్త రాష్ట్రంలో వాటిని ఉచితంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం.. ఎలాగంటే..?

కోవిడ్-19 వ్యాప్తి తర్వాత దేశంలో లెర్నర్స్ లైసెన్స్ మరియు డ్రైవర్స్ లైసెన్స్ పొందే ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఆన్‌లైన్ చేసింది. ప్రజలు డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసేలా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, డ్రైవింగ్ లైసెన్స్ విధివిధానాల్లో మార్పులు చేసింది.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు ప్రైవేట్ వాహన తయారీదారులు, ఎన్జీవోలు మరియు ఆటోమొబైల్ అసోసియేషన్లు ప్రభుత్వం ఆమోదించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను నిర్వహించగలవు. నిర్దేశిత శిక్షణ పూర్తి చేసుకున్న వ్యక్తులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయడానికి కూడా వారికి అనుమతి ఉంటుంది.

గుడ్ న్యూస్.. కొత్త రాష్ట్రంలో మీ పాత వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు!

ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ బుధవారం నాడు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, పైన తెలిపిన సంస్థలు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులతో పాటుగా ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీవోల) ద్వారా కూడా డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ కొనసాగుతుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Morth introduces new bharat series registration mark for vehicles
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X