భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇటీవలి కాలంలో ఈ విభాగంలో అనేక కొత్త మోడళ్లు వచ్చి చేరాయి. ధరకు ప్రాధాన్యతనిచ్చే భారత్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని, తయారీదారులు కూడా సరసమైన ధరలకే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలను అందిస్తున్నారు.

భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

ఈ కథనంలో భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం రండి..!

భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

1. రెనో కైగర్

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ కొద్ది రోజుల క్రితమే కైగర్ అనే సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ కోసం ఇప్పటికే అధికారికంగా బుకింగ్‌లు మరియు టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.

MOST READ:ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ విడుదల చేసిన నితిన్ గడ్కరీ, ఏం చెప్పారో తెలుసా..!

భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

మార్కెట్లో రెనో కైగర్ ధరలు రూ.5.45 లక్షల నుండి రూ.9.55 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ మోడల్ రెండు ఇంజన్లు, మూడు గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. - ఈ మోడల్‌కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

2. నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ ఇండియా గడచిన డిసెంబర్ 2020 నెలలో తమ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. మొదట్లో 'మాగ్నైట్'ను కంపెనీ కేవలం రూ.4.99 లక్షల ప్రత్యేక పరిచయ ప్రారంభ ధరకే అందించింది. అయితే, ఆ తర్వాత జనవరి 2021లో కేవలం ఈ ప్రారంభ వేరియంట్ (ఎక్స్ఈ) ధరను మాత్రమే రూ.50,000 పెంచింది. మిగతా వేరియంట్ల ధరలు పెంచలేదు.

MOST READ:పాస్టాగ్ లొల్లి షురూ.. ఇంట్లో పార్క్ చేసి ఉన్న కారుకి రూ.310 టోల్ చార్జ్!

భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

ప్రస్తుతం మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ధరలు రూ.5.49 లక్షల నుండి రూ.9.35 లక్షల మధ్యలో ఉన్నాయి. మాగ్నైట్ కూడా రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. - ఈ కారుకి సంబంధించిన లేటెస్ట్ ధరలు, పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

3. కియా సోనెట్

సెల్టోస్ తర్వాత కియా మోటార్స్ అంతటి అధిక విజయాన్ని అందించింది సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. కియా సోనెట్ విభాగంలో ఇప్పటికీ అగ్రగామిగా కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కియా సోనెట్ ధరలు రూ.6.8 లక్షల నుండి రూ.12 లక్షల మధ్యలో ఉన్నాయి. సోనెట్ మూడు (రెండు పెట్రోల్, ఒక డీజిల్) ఇంజన్లు మరియు వివిధ రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

కియా సోనెట్ టాప్-ఎండ్ వేరియంట్లలో సెగ్మెంట్లో కెల్లా బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకించి యువో కనెక్ట్ టెక్నాలజీ, బోస్ సౌండ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, మూడ్ లైట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్, మూడు డ్రైవింగ్ మోడ్స్ మరియు మూడు ట్రాక్షన్ మోడ్‌లు ఉన్నాయి. - కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

4. హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయిస్తున్న వెన్యూ కాంపాక్ట్ సెడాన్ ఇటీవలే భారత మార్కెట్లో 1 లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ ధరలు రూ.6.87 లక్షల నుండి రూ.11.61 లక్షల మధ్యలో ఉన్నాయి.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో ఫెరారీ సూపర్ స్పోర్ట్స్ కార్.. చూస్తే మైండ్ బ్లోయింగ్

భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

హ్యుందాయ్ వెన్యూ కూడా రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో కంపెనీ గతేడాది ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) పేరిట ఓ కొత్త క్లచ్‌లెస్ గేర్‌బాక్స్ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. - హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి పూర్తి టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

5. టాటా నెక్సాన్

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పై నాలుగు మోడళ్లతో పోల్చుకుంటే, టాటా నెక్సాన్ గత కొంత కాలంగా మార్కెట్లో ఉంది. ఈ మోడల్‌లో కంపెనీ ఇటీవలే కొత్తగా అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. కొత్త అవతార్‌లో వచ్చిన టాటా నెక్సాన్ మార్కెట్లో సానుకూలం స్పందనను అందుకుంటోంది. సేఫ్టీ విషయంలో కూడా ఇది బెస్ట్ అనిపించుకుంటోంది.

భారత్‌లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు: సోనెట్, మాగ్నైట్, కైగర్, నెక్సాన్..

ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సాన్ కారు ధరలు రూ.7.09 లక్షల నుండి రూ.12.8 లక్షల మధ్యలో ఉన్నాయి. మార్కెట్లో ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది పూర్తి ఎలక్ట్రిక్ కార్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇటీవలే మా బృందం ఈ ఎలక్ట్రిక్ నెక్సాన్ కారు టెస్ట్ డ్రైవ్ చేసింది. - టాటా నెక్సాన్ ఈవీ పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Most Affordable Compact SUV In India: Renault Kiger, Nissan Magnite, Kia Sonet And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X