భారత్‌లో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల; ధర రూ.88.06 లక్షలు

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్, తమ కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీ ధర రూ.88.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ లేటెస్ట్ 2021 ఎడిషన్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఎస్‌యూవీలో కంపెనీ అనేక అప్‌గ్రేడ్స్ చేసింది.

భారత్‌లో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల; ధర రూ.88.06 లక్షలు

కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఎస్‌యూవీ యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కంపెనీ అనేక కాస్మెటిక్ మార్పులు చేసింది. లోపలి వైపు ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలోని రెండవ-వరుస సీటింగ్‌ను కూడా కంపెనీ రీడిజైన్ చేసింది. అంతేకాకుండా, ఈ కారులో ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు.

భారత్‌లో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల; ధర రూ.88.06 లక్షలు

కొత్త డిస్కవరీ ఎస్‌యూవీలో యాంత్రికపరమైన మార్పులు కూడా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు కొత్త స్ట్రెయిట్-సిక్స్ ఇంజినియం ఇంజన్ ఉపయోగించారు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ల్యాండ్ రోవర్ డిస్కవరీ మోడల్ చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది.

భారత్‌లో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల; ధర రూ.88.06 లక్షలు

ఈ ఎస్‌యూవీ డిజైన్ విషయానికి వస్తే, కంపెనీ ఇందులో కొత్తగా రూపొందించిన డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సంస్థ యొక్క కొత్త సిగ్నేచర్ ఎల్ఈడి హెడ్‌లైట్‌లను ఉపయోగించింది. అంతేకాకుండా, ఇందులో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ కూడా ఉంటుంది, ఇప్పుడు ఇది విస్తృతమైన బాడీ కలర్ గ్రాఫిక్ మరియు కొత్త సైడ్ వెంట్స్‌ను కలిగి ఉంటుంది.

భారత్‌లో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల; ధర రూ.88.06 లక్షలు

కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ రియర్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో కొత్త ఎల్‌ఈడి టెయిల్ లైట్లు మరియు ఈ రెండింటినీ కలుపుతున్నట్లుగా ఉండే పియానో బ్లాక్ గార్నిష్, పెద్ద అక్షరాలతో డిస్కవరీ బ్యాడ్జింగ్, వెనుక బంపర్ క్రింది భాగంలో సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్ మరియు ఇంటెలిజెంట్ సీట్ ఫోల్డ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భారత్‌లో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల; ధర రూ.88.06 లక్షలు

ల్యాండ్ రోవర్ సంస్థ ఈ ఎస్‌యూవీకి పెద్ద 11.4 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను జోడించింది. ఇది ఇంటెలిజెంట్ సీట్ ఫోల్డింగ్ ఫీచర్‌ను ఉపయోగించడానికి మరియు కారు లోపల లేఅవుట్ను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. సంస్థ ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను రీడిజైన్ చేసింది. ఫలితంగా, ఇది మునుపటి కంటే 48 శాతం పెద్దదిగా ఉంటుంది.

భారత్‌లో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల; ధర రూ.88.06 లక్షలు

ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఎస్‌యూవీలో కంపెనీ సోటా టెక్నాలజీని ఉపయోగించింది, ఇది కారు యజమానులకు 44 వ్యక్తిగత ఎలక్ట్రానిక్ మాడ్యూళ్ళను నవీకరించడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా, ఇందులో స్టీరింగ్ వెనుక భాగంలో పెద్ద 12.3 ఇంచ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఇది హై-డెఫినిషన్ 3డి మ్యాప్స్‌ని కలిగి ఉంటుంది.

భారత్‌లో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల; ధర రూ.88.06 లక్షలు

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ పి300 వేరియంట్ 2.0-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 296 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, డిస్కవరీ పి360 వేరియంట్లో 3.0-లీటర్, 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

భారత్‌లో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల; ధర రూ.88.06 లక్షలు

ఈ ఇంజన్ గరిష్టంగా 355 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డిస్కవరీ డి300 డీజిల్ వేరియంట్ 3.0-లీటర్, 6-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 296 బిహెచ్‌పి పవర్‌ను మరియు 650 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల; ధర రూ.88.06 లక్షలు

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 విడుదల

ఇదిలా ఉంటే, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇటీవలే తమ పాపులర్ డిఫెండర్ మోడల్ యొక్క 3-డోర్ వెర్షన్, డిఫెండర్ 90ని కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 ఎక్స్-షోరూమ్ రూ.76.57 లక్షలుగా ఉంది. - ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 14, 2021, 15:58 [IST]
English summary
New 2021 Land Rover Discovery Launched In India: Price, Specs Features And Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+