భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

టాటా మోటార్స్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్, భారత మార్కెట్లో సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది. ఇటీవలే సరికొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టిన ల్యాండ్ రోవర్ ఇప్పుడు తమ పాపులర్ డిఫెండర్ మోడల్ యొక్క 3-డోర్ వెర్షన్ (డిఫెండర్ 90)ను మార్కెట్లో విడుదల చేసింది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ల్యాండ్ రోవర్ గత ఏడాది భారత మార్కెట్లో తమ 5-డోర్ వెర్షన్ డిఫెండర్ (డిఫెండర్ 110) మోడల్‌ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ ఇది కేవలం ఐదు డోర్ల వేరియంట్‌గా మాత్రమే లభిస్తుండగా, కంపెనీ ఇప్పుడు ఇందులో 3-డోర్ల వెర్షన్ అయిన డిఫెండర్ 90 వేరియంట్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

భారత మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 ఎక్స్-షోరూమ్ రూ.76.57 లక్షలుగా ఉంది. కంపెనీ ఈ ఎస్‌యూవీని ఎక్స్‌-డైనమిక్ మరియు డిఫెండర్ ఎక్స్‌తో సహా పలు ఇతర ట్రిమ్‌లలో అందించనుంది. ఈ రెండు ట్రిమ్స్ కూడా ఎస్, ఎస్‌ఈ మరియు హెచ్‌ఎస్‌ఈ అనే వేరియంట్లలో లభ్యం కానున్నాయి.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. వీటిలో మొదటిది 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది 296 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇకపోతే రెండవది 3.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది, ఇది 296 బిహెచ్‌పి శక్తిని మరియు 650 న్యూటన్ మీటర్ టార్క్ను అందిస్తుంది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

మూడవ ఇంజన్ ఆప్షన్‌గా 3.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఇది 394 బిహెచ్‌పి పవర్‌ను మరియు 550 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 చూడటానికి దాని 5-డోర్ వెర్షన్ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మాదిరిగానే కనిపిస్తుంది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కాకపోతే, ఇది దాని కన్నా తక్కువ వీల్‌బేస్‌ను మరియు కనిష్ట ఓవర్‌హాంగ్‌లను పొందుతుంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 మంచి బ్యాంక్-ఓవర్ యాంగిల్స్‌తో సమర్థవంతమైన ఆఫ్-రోడర్ ఎస్‌యూవీగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో డ్రైవరుతో కలిపి ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చునే అవకాశం ఉంటుది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో ఫ్రంట్ సెంట్రల్ జంప్ సీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీనిని సాయంతో ఈ ఎస్‌యూవీని 6-సీటర్‌గా మార్చుకోవచ్చు. ఇంకా ఈ ఎస్‌యూవీలో ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్‌తో కూడిన 10 ఇంచ్ పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. అంతేకాకుండా, ఇందులో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంటుంది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ని ఫుల్-స్క్రీన్ మ్యాప్, ఫోన్ మరియు మీడియా ఆపరేషన్స్ కోసం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90లో పర్మినెంట్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్, టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్ కూడా లభిస్తుంది. ఇవి రెండూ ఆఫ్-రోడ్ ఉపయోగం కోసం అనువుగా ఉంటాయి. ఈ ఎస్‌యూవీ ఉత్తమమైన వాటర్ వేడింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల

ల్యాండ్ రోవర్ ఇటీవలే తమ సరికొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ లగ్జరీ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.64.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంటుంది. - ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Land Rover Defender 90 Three Door Version SUV Launched In India; Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X