75,000 బుకింగ్స్ స్వీకరించిన Mahindra Thar: ఇప్పటికీ తగ్గని డిమాండ్
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న వాహన తయారీదారుల్లో ఒకటి Mahindra & Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా). Mahindra కంపెనీ యొక్క Thar (థార్) SUV కి మార్కెట్లో వివలైనప్పటి నుంచి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. Mahindra తన Thar (థార్) SUV ని అక్టోబర్ 2020 లో దేశీయ విఫణిలో విడుదల చేసింది. ఈ SUV విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందగలిగింది.

Mahindra కంపెనీ యొక్క Thar (థార్) SUV ఇప్పటికి 75,000 యూనిట్ల బుకింగ్లను స్వీకరించినట్లు నివేదికల ద్వారా తెలిసింది. కంపెనీ ఈ SUV ని ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకు అనేక అప్డేట్స్ చేసింది. ఇది పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఎక్స్టీరియర్ కొత్త స్టైలింగ్ అప్‌డేట్ వంటి అనేక ముఖ్యమైన అప్‌డేట్‌లను అందుకుంది.

Mahindra తన థార్ SUV కి యువ వినియోగదారుల నుండి 40 శాతం బుకింగ్‌లను అందుకున్నట్లు తెలిపింది. ఇందులో దాదాపు 50 శాతం బుకింగ్స్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కోసం, 25 శాతం బుకింగ్ పెట్రోల్ మోడల్ కోసం అని తెలిసింది.

కంపెనీ ఈ ఆఫ్ రోడ్ SUV ని మార్కెట్లో విడుదల చేసి దాదాపు సంవత్సరం కావొస్తున్నప్పటికీ ఆదరణ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు మహీంద్రా థార్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన 4 వీల్ డ్రైవ్ SUV గా నిలిచింది. ఈ SUV ఆఫ్ రోడ్ ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ SUV కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

Mahindra కంపెనీ తన కొత్త థార్ SUV ని 2020 అక్టోబర్ 2 న భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ఈ SUV ని ప్రారంభించినప్పుడు, AX వేరియంట్ మరియు LX వేరియంట్ల ధరలు వరుసగా రూ. 9.8 లక్షలు మరియు రూ .12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కంపెనీ యొక్క మొదటి మహీంద్రా థార్ రూ. 1.10 కోట్లకు వేలం వేయబడింది. దీని ద్వారా వచ్చిన మొత్తం డబ్బును స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వబడింది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం.

మహీంద్రా థార్ రెండు ఇంజిన్ ఆప్సన్లను కలియు ఉంటుంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో కూడా 4x4 ఎంపిక అందుబాటులో ఉంది.

కొత్త మహీంద్రా థార్ మరింత శక్తివంతమైనది మరియు మెరుగైనది. అంతే కాకుండా ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి, కావున కొత్త మహీంద్రా థార్ గ్లోబల్ NCAP టెస్ట్ లో సేఫ్టీలో ఏకంగా 4-స్టార్ రేటింగ్ పొందగలిగింది.

మహీంద్రా థార్ ఇప్పుడు మునుపటి కంటే కూడా చాలా సురక్షితమైనదిగా నిర్దారించబడింది. థార్ SUV అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది ఎల్ఈడీ డిఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, హార్డ్ రూఫ్‌టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ISOFIX మౌంట్‌లతో ఫార్వర్డ్ ఫేసింగ్ రియర్ సీట్లు మరియు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను పొందుతుంది.

మహీంద్రా థార్ ప్రత్యేకంగా ఆఫ్-రోడింగ్ కోసం రూపొందించబడింది. ఇది షిఫ్ట్-ఆన్-ఫ్లై ట్రాన్స్‌ఫర్ కేస్‌తో 4x4 డ్రైవ్ రైలును కలిగి ఉంది ఈ SUV మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, ఫ్రంట్ యాక్సిల్ మరియు బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ కోసం ఎలక్ట్రిక్ డ్రైవ్‌లైన్ డిస్కనెక్ట్ కూడా పొందుతుంది.

Mahindra Thar యొక్క 5-డోర్ల మోడల్ కూడా త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి కంపెనీ ఇప్పటికే కొంత సమాచారం వెల్లడించింది. Mahindra Thar యొక్క 5-డోర్ల మోడల్ 2023-2026 మధ్య భారతదేశంలో ప్రారంభించబడుతుందని కంపెనీ తెలిపింది. ఇది థార్ యొక్క ప్రస్తుత మోడల్ కంటే పెద్దది మరియు ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో ఉంటుంది.


Click it and Unblock the Notifications








