శరవేగంగా సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి; కేవలం 3 నెలల్లో 10,000 యూనిట్లు

ప్రముఖ వాహనతయారీ సంస్థ నిస్సాన్ భారత మార్కెట్లో మాగ్నైట్ ఎస్‌యూవీని విడుదల చేసినప్పటి నుంచి అత్యంత ప్రజాదరణ పొందుతుంది. మాగ్నైట్ ఎస్‌యూవీ కంపెనీ యొక్క రాతను తిరగరాసింది. మాగ్నైట్ ఎస్‌యూవీ కారణంగా ప్రస్తుతం కంపెనీ ప్రతి నెలా సరాసరి 4000 కార్లను విక్రయిస్తున్నట్లు తెలిపింది.

శరవేగంగా సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి; కేవలం 3 నెలల్లో 10,000 యూనిట్లు

నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాలు మార్కెట్లో జోరుగా సాగుతున్నాయి. ఈ కారణంగానే కంపెనీ తన ఉత్పత్తులను కూడా మరింత వేగవంతంగా చేస్తోంది. ఇటీవల కంపెనీ మాగ్నైట్ ఎస్‌యూవీ యొక్క 10,000 యూనిట్ల మార్కును దాటింది.

శరవేగంగా సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి; కేవలం 3 నెలల్లో 10,000 యూనిట్లు

నిస్సాన్ మాగ్నైట్ దేశీయ మార్కెట్లో గత కొన్ని నెలల క్రితమే విడుదలైంది. విడుదలైనప్పటినుంచి వినియోగదారుల నుండి ఈ ఎస్‌యూవీ గొప్ప స్పందన వస్తోంది. నిస్సాన్ మాగ్నైట్ బుకింగ్ ప్రస్తుతం 40,000 యూనిట్లను దాటింది. ఈ ఎస్‌యూవీకి ఉన్న డిమాండ్ కారణంగా కారు కోసం కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ 6 నెలలకంటే ఎక్కువ వుంది.

MOST READ:వాణిజ్య వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గించడానికి టాటా మోటార్స్ కొత్త వ్యూహం

శరవేగంగా సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి; కేవలం 3 నెలల్లో 10,000 యూనిట్లు

ఈ వెయిటింగ్ పీరియడ్ మరింత తగ్గించడానికి, కంపెనీ నిస్సాన్ మాగ్నైట్‌ ఉత్పత్తులను చాలా వేగంగా నిరంతరంగా పనిచేస్తోంది. కేవలం 100 రోజుల్లో కంపెనీ 10,000 యూనిట్ల ఉత్పత్తి సంఖ్యను దాటింది. సంస్థ తన ఉత్పత్తిని పెంచడంలో ఇప్పుడు పూర్తిగా నిమగ్నమై ఉంది.

శరవేగంగా సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి; కేవలం 3 నెలల్లో 10,000 యూనిట్లు

ప్రస్తుతం కంపెనీ యొక్క 2021 మార్చి అమ్మకాల విషయానికి వస్తే, గత నెలలో 4012 యూనిట్లను విక్రయించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ అమ్మకాలు మార్చి 2020 లో కేవలం 825 యూనిట్లు మాత్రమే. కావున ప్రస్తుతం అమ్మకాలు 826% పెరుగుదలను నమోదు చేశాయి. అయితే ఫిబ్రవరిలో 4244 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుతం 5.47% క్షీణించాయి.

MOST READ:గిఫ్ట్‌గా పొందిన కారుని గురువుకి గిఫ్ట్‌గా ఇచ్చిన ఇండియన్ క్రికెటర్, ఎవరో తెలుసా?

శరవేగంగా సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి; కేవలం 3 నెలల్లో 10,000 యూనిట్లు

ఇటీవల, నిస్సాన్ కంపెనీ ఈ ఎస్‌యూవీ ధరను పెంచినాట్లు కూడా ప్రకటించింది. నిస్సాన్ మాగ్నైట్ యొక్క టర్బో వేరియంట్ ధరను ఇప్పుడు రూ. 30,000 పెంచింది. టర్బో వేరియంట్ కాకుండా ఇతర వేరియంట్లలో పెరుగుదల లేదు.

శరవేగంగా సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి; కేవలం 3 నెలల్లో 10,000 యూనిట్లు

పెరిగిన ధరలు 2021 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ఆటోమొబైల్ భాగాల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని, కావున ధరలు పెరుగుదల జరిగిందని కంపెనీ తెలిపింది.

MOST READ:మళ్ళీ పట్టాలెక్కిన 'గాతిమాన్ ఎక్స్‌ప్రెస్'.. టైమింగ్ & ఫుల్ డీటైల్స్

శరవేగంగా సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి; కేవలం 3 నెలల్లో 10,000 యూనిట్లు

నిస్సాన్ కంపెనీ మోడల్ మరియు వేరియంట్ ప్రకారం ధరలను పెంచింది. పెరిగిన ధరలు అమ్మకాలపైన ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో వేచి చూడాలి. మార్చిలో లేదా అంతకు ముందు బుకింగ్ చేసిన వినియోగదారులకు మాత్రమే కంపెనీ పాత ధరను విదిస్తుంది. అయితే కొత్తగా బుక్ చేసుకున్న వారికీ ఈ కొత్త ధరలు వర్తిస్తాయి.

Most Read Articles

English summary
Nissan Magnite Achieves 10,000 Unit Production Milestone. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X