క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మాగ్నైట్' కోసం ఏషియన్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ మోడల్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఏషియన్ ఎన్‌క్యాప్ ఇందుకు సంబంధించిన ఫలితాలను, ఇతర వివరాలను ఆ సంస్థ విడుదల చేసింది.

క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న నిస్సాన్ మాగ్నైట్

ఏషియన్ ఎన్‌క్యాప్ విడుదల చేసిన ఫలితాల ప్రకారం, ఈ క్రాష్ టెస్టులో నిస్సాన్ మాగ్నైట్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (ఎఓపి) కోసం 39.02 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (సిఓపి) కోసం 16.32 పాయింట్లు సాధించింది. సేఫ్టీ అసిస్ట్ విభాగంలో నిస్సాన్ మాగ్నైట్ 15.28 పాయింట్లు సాధించి, మొత్తంగా 70.60 పాయింట్ల స్కోరును దక్కించుకుంది. దీంతో ఈ క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం ఫ్రంటల్ మరియు సైడ్ ఇంపాక్ట్ క్రాష్ టెస్టులను నిర్వహించారు. ఈ క్రాష్ టెస్టుల్లో ఉపయోగించిన డమ్మీల (మనుషుల స్థానంలో ఉపయోగించే బొమ్మల) నుండి సేకరించిన డేటా ప్రకారం, డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ ఇద్దరి తల మరియు కాళ్ల తగిన రక్షణ లభించినట్లు పేర్కొన్నారు.

MOST READ:2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు

క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న నిస్సాన్ మాగ్నైట్

అలాగే, ఫ్రంటల్ కొల్లైజన్‌లో ముందు సీటులోని ప్యాసింజర్ ఛాతీకి తగిన రక్షణ లభించిందని, అయితే, డ్రైవర్ ఛాతీకి మాత్రం బలహీనమైన రక్షణ ఉందని ఈ నివేదికలో తెలిపారు. కాగా, సైడ్ ఇంపాక్ట్ సమయంలో డ్రైవర్ ఛాతీ బాగా రక్షించబడినట్లు ఇందులో పేర్కొన్నారు.

క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న నిస్సాన్ మాగ్నైట్

చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే, నిస్సాన్ మాగ్నైట్ కారులోని వెనుక వరుసలో కారు సీటులో కూర్చోబెట్టబడిన 18 నెలల శిశువుతో సమానమైన డమ్మీకి 7.81 పాయింట్ల స్కోర్ లభించేంది. ఇదే సమయంలో వెనుక సీటులో సీట్‌బెల్ట్ వేసి కూర్చోబెట్టిన మూడేళ్ల చైల్డ్ డమ్మీకి పూర్తి 8 పాయింట్ల సేఫ్టీ స్కోర్ లభించింది.

MOST READ:భారత సర్కార్ సాయం చేసి ఉంటే రూ.5,000 లకే ఈ కార్ లభించేంది..

క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న నిస్సాన్ మాగ్నైట్

సేఫ్టీ విషయానికి వస్తే, నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడి )ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇఎస్‌సి (ఇంజన్ స్టెబిలిటీ కంట్రోల్), సీట్‌బెల్ట్ ప్రీటెన్షనర్స్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటివి ఉన్నాయి.

క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న నిస్సాన్ మాగ్నైట్

భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులోని 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు. ఇది లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.

MOST READ:స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న నిస్సాన్ మాగ్నైట్

ఇకపోతే, రెండవది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్లు మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ మాగ్నైట్ ఈ విభాగంలోనే అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉంది. ఇందులో అనేక బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు వాటి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. పెద్ద వీల్ ఆర్చెస్‌తో ఇది రగ్గడ్ లుక్‌ని కలిగి ఉంటుంది.

MOST READ:కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న నిస్సాన్ మాగ్నైట్

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. కాగా, ఈ క్రాష్ టెస్టులో నిస్సాన్ మాగ్నైట్ దక్కించుకున్న 4-స్టార్ సేఫ్టీ రేటింగ్, దాని అమ్మకాలకు మరింత బలం చేకూర్చగలదని కంపెనీ ధీమాగా ఉంది.

Most Read Articles

English summary
Nissan Magnite ASEAN NCAP Crash Test Results Revealed, Scores 4-Star Saftey Rating. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X