మాగ్నైట్ అప్‌డేట్: జనవరి నుండి మాస్ డెలివరీలు, డిసెంబర్‌లో 560 యూనిట్లు

డిసెంబర్ 2, 2020వ తేదీన మార్కెట్లో విడుదలైన 'నిస్సాన్ మాగ్నైట్' కాంపాక్ట్ ఎస్‌యూవీ ఒక్క నెల రోజుల వ్యవధిలోనే 33,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకుంది. గత నెలలో కంపెనీ మొత్తం 560 యూనిట్ల మాగ్నైట్ కార్లను కస్టమర్లకు డెలివరీ చేసింది. జనవరి నుండి అత్యధికంగా మాగ్నైట్ కార్లను డెలివరీ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

మాగ్నైట్ అప్‌డేట్: జనవరి నుండి మాస్ డెలివరీలు, డిసెంబర్‌లో 560 యూనిట్లు

నిస్సాన్ మాగ్నైట్ డెలివరీలు డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యాయి, ఫలితంగా కంపెనీ అధిక సంఖ్యలో వీటిని డెలివరీ చేయలేకపోయింది. ప్రస్తుతం నిస్సాన్ పూర్తిస్థాయిలో మాగ్నైట్ వాహనాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఈ కారుకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, నిస్సాన్ తమ ఫ్యాక్టరీలో ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచింది.

మాగ్నైట్ అప్‌డేట్: జనవరి నుండి మాస్ డెలివరీలు, డిసెంబర్‌లో 560 యూనిట్లు

కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి నిస్సాన్ మాగ్నైట్ కోసం 6 నుండి 8 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. ఈ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు కంపెనీ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. ఇందుకోసం నిస్సాన్ అదనంగా 1000 మంది సిబ్బందిని నియమించుకొని, తమ ప్లాంట్‌లో మూడవ షిఫ్టును కూడా ప్రారంభించింది.

మాగ్నైట్ అప్‌డేట్: జనవరి నుండి మాస్ డెలివరీలు, డిసెంబర్‌లో 560 యూనిట్లు

నిస్సాన్ ఇండియా తమ చెన్నై ప్లాంట్‌లో మూడవ షిఫ్ట్ ప్రారంభించడం ద్వారా మాగ్నైట్ కోసం పెరుగుతున్న వెయిటింగ్ పీరియడ్‌ను 2-3 నెలలకు తగ్గించాలని భావిస్తోంది. నిస్సాన్ కేవలం ఫ్యాక్టరీలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్‌షిప్‌లలో కూడా శ్రామిక శక్తిని పెంచుతోంది.

మాగ్నైట్ అప్‌డేట్: జనవరి నుండి మాస్ డెలివరీలు, డిసెంబర్‌లో 560 యూనిట్లు

నిస్సాన్ మాగ్నైట్‌కు ఇంతటి అనూహ్యమైన స్పందన రావటానికి ప్రధాన కారణం, దాని ఆకర్షణీయమైన డిజైన్, సరమైన ధర మరియు బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లే. నిస్సాన్ మాగ్నైట్‌ను డిసెంబర్ 2020 నెల మొత్తం రూ.4.99 లక్షల, (ఎక్స్-షోరూమ్, ఢల్లీ) ప్రత్యేక పరిచయ ప్రారంభ ధరతో విక్రయించారు (బేస్ వేరియంట్ ఎక్స్ఈ ధర).

మాగ్నైట్ అప్‌డేట్: జనవరి నుండి మాస్ డెలివరీలు, డిసెంబర్‌లో 560 యూనిట్లు

కాగా జనవరి 2021 నుండి ఈ వేరియంట్ ధరను రూ.50,000 మేర పెంచారు. దీంతో, ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ఈ వేరియంట్ ధర రూ.5.49 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా మారింది. ఈ ఒక్క బేస్ వేరియంట్ (ఎక్స్ఈ) మినహా మిగిలిన అన్ని వేరియంట్ల ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.

మాగ్నైట్ అప్‌డేట్: జనవరి నుండి మాస్ డెలివరీలు, డిసెంబర్‌లో 560 యూనిట్లు

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎక్స్‌ఈ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై) మరియు ఎక్స్‌వి (ప్రీమియం) అనే నాలుగు వేరియంట్లలో అందిస్తున్నారు. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు వాటి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు మొదలైనవి ఉన్నాయి.

మాగ్నైట్ అప్‌డేట్: జనవరి నుండి మాస్ డెలివరీలు, డిసెంబర్‌లో 560 యూనిట్లు

మాగ్నైట్‌లోని ఇంటీరియర్స్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో 3.5 ఇంచ్ పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్-పవర్ విండోస్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

మాగ్నైట్ అప్‌డేట్: జనవరి నుండి మాస్ డెలివరీలు, డిసెంబర్‌లో 560 యూనిట్లు

నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులోని 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు. ఇది లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.

మాగ్నైట్ అప్‌డేట్: జనవరి నుండి మాస్ డెలివరీలు, డిసెంబర్‌లో 560 యూనిట్లు

ఇకపోతే, రెండవది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్. ఇది గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్లు మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

మాగ్నైట్ అప్‌డేట్: జనవరి నుండి మాస్ డెలివరీలు, డిసెంబర్‌లో 560 యూనిట్లు

ప్రస్తుతం నిస్సాన్ ఇండియా భారత మార్కెట్లో రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. ఇందులో ఒకటి నిస్సాన్ కిక్స్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మరియు నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇవే కాకుండా కంపెనీ జిటి-ఆర్ అనే స్పోర్స్ట్ కారును కూడా విక్రయిస్తోంది. ఈ మోడల్‌ను విదేశాల నుండి దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో విక్రయిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, January 8, 2021, 11:04 [IST]
English summary
Nissan Magnite December 2020 Sales Report, 560 Units Dispatched In Last Month. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+