Mahindra కార్లపై అక్టోబర్ 2021 ఆఫర్స్.. మోడల్ వారీగా డిస్కౌంట్ డీటేల్స్!
భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. సాధరణంగా, ఈ సీజన్ లో మార్కెట్ సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది. కస్టమర్లు కొత్త వాహనాలు, వస్తువులను కొనేందుకు పండుగ సీజన్ కోసం వేచి ఉంటారు. ఈ నేపథ్యంలో, కస్టమర్ల సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ వాహనాలపై భారీ తగ్గింపులను అందిస్తుంటాయి.

తాజాగా, భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) కూడా తమ కార్లపై నగదు తగ్గింపులు మరియు ఇతర ఆఫర్లను ప్రకటించింది. మరి ఏయే మహీంద్రా కారుపై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

1. మహీంద్రా కెయూవి100 ఎన్ఎక్స్‌టి (Mahindra KUV100 NXT)
మహీంద్రా నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ కెయూవి100 ఎన్ఎక్స్‌టి కారుపై కంపెనీ రూ. 41,000 వరకు మొత్తం ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ ఈ కారుపై రూ. 38,055 క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతే కాకుండా, ఈ ఎస్‌యూవీపై కంపెనీ రూ. 3,000 కార్పోరేట్ డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.

2. మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300)
మహీంద్రా నుండి అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300 పై కంపెనీ ఈ నెలలో రూ. 31,628 వరకు మొత్తం ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో ఈ కారుపై రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఇది కాకుండా, దీనిపై రూ. 11,628 వరకు కార్పోరేట్ బోనస్ ఆఫర్ చేయబడుతోంది. అయితే, ఇందులో ఎలాంటి నగదు తగ్గింపు (క్యాష్ డిస్కౌంట్) లేదు.

3. మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio)
మహీంద్రా యొక్క పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియోపై కంపెనీ ఈ అక్టోబర్ 2021 నెలలో మొత్తం రూ. 57,135 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా, ఈ కారుపై రూ. 20,000 వరకు నగదు తగ్గింపు, రూ. 5,000 ఎక్సేంజ్ బోనస్, రూ. 10,135 కార్పోరేట్ బోనస్ మరియు రూ. 22,000 విలువైన ఇతర ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నారు.

4. మహీంద్రా బొలెరో (Mahindra Bolero)
మహీంద్రా యొక్క మల్టీ పర్పస్ వెహికల్ బొలెరోపై కంపెనీ ఈ నెలలో (అక్టోబర్ 2021 లో) కంపెనీ మొత్తం రూ. 30,450 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా, ఈ కారుపై రూ. 19,000 వరకు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 11,450 వరకూ కార్పోరేట్ బోనస్ లను కంపెనీ అందిస్తోంది. ఇవి కాకుండా, దీనిపై ఎలాంటి నగదు తగ్గింపు అందుబాటులో లేదు.

5. మహీంద్రా ఎక్స్‌యూవీ500 (Mahindra XUV500)
మహీంద్రా నుండి లభిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 పై కంపెనీ మొత్తంగా రూ. 2,63,314 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 1,79,800 వరకు నగదు తగ్గింపు, రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 13,514 వరకు కార్పోరేట్ బోనస్ మరియు రూ. 20,000 విలువైన ఇతర ఆఫర్లు ఉన్నాయి.

6. మహీంద్రా మరాజో (Mahindra Marazzo)
మహీంద్రా యొక్క మల్టీ పర్పస్ వెహికల్ మరాజో పై కంపెనీ ఈ నెలలో రూ. 38,793 వరకు మొత్తం ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ ఈ కారుపై రూ. 13,000 వరకు నగదు తగ్గింపు, రూ. 13,793 కార్పోరేట్ బోనస్ మరియు రూ. 12,000 ఇతర ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది ఇది మినహా, దీనిపై వేరే ఆఫర్లేమీ లేవు.

7. మహీంద్రా ఆల్టురాస్ జి4 (Mahindra Alturas G4)
మహీంద్రా యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఆల్టురాస్ జి4 అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఫుల్-సైజ్ ఎస్‌యూవీ అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఈ కారుపై రూ. 66,667 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. వీటిలో రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 16,667 వరకు కార్పొరేట్ బోనస్ లభిస్తుంది. అయితే, దీనిపై ఎలాంటి నగదు తగ్గింపు ఆఫర్ లేదు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, మహీంద్రా కార్లపై కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్లన్నీ కూడా అక్టోబర్ 31, 2021 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. అయితే, వివిధ రాష్ట్రాలు మరియు డీలర్‌షిప్ లను బట్టి ఈ ఆఫర్లు మారే అవకాశం ఉంటుంది. కాగా, కొత్తగా విడుల చేసిన మహీంద్రా థార్, మహీంద్రా బొలెరో నియో మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడళ్లపై కంపెనీ ఎలాంటి ఆఫర్లను అందించడం లేదు.

XUV700 కోసం 3 గంటల్లో 50,000 లకు పైగా బుకింగ్స్..
ఇదిలా ఉంటే, మహీంద్రా ఎక్స్‌యూవీ700 కోసం కస్టమర్లు క్యూ కడుతున్నారు. ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన మొదటి రోజు కేవలం 1 గంటలోనే 25,000 యూనిట్ల బుకింగ్‌లు రాగా, రెండవ రోజు బుకింగ్‌లు ప్రారంభించిన 2 గంటల 8 నిమిషాల వ్యవధిలో అదనంగా మరో 25,000 యూనిట్ల బుకింగ్‌లు వచ్చాయి. ఈ ఎస్‌యూవీ కోసం ఇప్పటి వరకూ 50,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. - XUV700 లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








