హ్యుందాయ్ ఐ20 ఎలైట్ మరియు ఐ20 ఎన్-లైన్ వెర్షన్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటి?

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, భారత మార్కెట్లో తమ ఎన్-లైన్ సిరీస్ పెర్ఫార్మెన్స్ కార్లను విడుదల చేయనున్నట్లు ఇటీవల ధృవీకరించిన సంగతి తెలిసినదే. హ్యుందాయ్ ఎన్-లైన్ సిరీస్ క్రింద భారతదేశంలో మొదటిగా విడుదల కానున్న మోడల్ హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అని కంపెనీ వెల్లడించింది.

హ్యుందాయ్ ఐ20 ఎలైట్ మరియు ఐ20 ఎన్-లైన్ వెర్షన్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటి?

కంపెనీకి పేర్కొన్న సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ ఆగస్టు 24వ తేదీన మార్కెట్లో విడుదల కానుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ ఐ20తో పోల్చుకుంటే, ఐ20 ఎన్-లైన్ దాని చాలా భిన్నంగా మరియు స్పోర్టీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, స్టాండర్డ్ ఐ20 మరియు ఐ20 ఎన్- లైన్ మధ్య కనిపించే కొన్ని కీలక వ్యత్యాసాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

హ్యుందాయ్ ఐ20 ఎలైట్ మరియు ఐ20 ఎన్-లైన్ వెర్షన్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటి?

1. స్పోర్టీ ఫ్రంట్ ఎండ్

హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ ఫ్రంట్ డిజైన్‌ను గమనిస్తే, దీని బంపర్ స్టాండర్డ్ ఐ20 కన్నా చాలా స్పోర్టీగా ఉంటుంది. ఇందులో తక్కువ రన్నింగ్ లైన్ సహాయంతో మరింత ప్రముఖమైన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లు జత చేయబడతాయి. ఫ్రంట్ క్యాస్కేడింగ్ గ్రిల్ కూడా చెకర్డ్ జెండాను అనుకరించే ఫంకీ మెష్ డిజైన్‌తో ఉంటుంది.

హ్యుందాయ్ ఐ20 ఎలైట్ మరియు ఐ20 ఎన్-లైన్ వెర్షన్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటి?

2. సరికొత్త అల్లాయ్ వీల్స్

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ ఐ20లో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, కొత్త ఐ20 ఎన్-లైన్‌లో మాత్రం సరికొత్త అల్లాయ్ వీల్స్ ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్‌లో 17-ఇంచ్ స్పెషల్ డ్యూయెల్ టోన్ స్పోర్టీ అల్లాయ్ వీల్స్ ఉపయోగించే అవకాశం ఉంది.

హ్యుందాయ్ ఐ20 ఎలైట్ మరియు ఐ20 ఎన్-లైన్ వెర్షన్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటి?

3. స్పోర్టీవ్ రియర్ ప్రొఫైల్

స్టాండర్డ్ హ్యుందాయ్ ఐ20 రియర్ ప్రొఫైల్ చాలా ట్రెడిషనల్ డిజైన్‌ని కలిగి ఉంటుంది. కాగా, ఐ20 ఎన్-లైన్ వెనుక భాగాన్ని అగ్రెసివ్‌గా కనిపించడం కోసం పెద్ద బంపర్‌తో రీడిజైన్ చేశారు. బంపర్ దిగువ భాగంలో బ్లాక్ ట్రిమ్ ఉంటుంది మరియు దాని క్రింది భాగంలో డ్యూయెల్ ఎగ్జాస్ట్ పైప్ సెటప్ కనిపిస్తుంది.

హ్యుందాయ్ ఐ20 ఎలైట్ మరియు ఐ20 ఎన్-లైన్ వెర్షన్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటి?

4. సరికొత్త సైలెన్సర్ డిజైన్

ఇదివరకు చెప్పుకున్నట్లుగా కొత్త హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్‌కు హాట్ హాచ్ లాంటి రియర్ ఎండ్ ఫినిషింగ్‌ను ఇవ్వటానికి కంపెనీ ఇందులో సరికొత్త డిజైన్‌తో కూడిన సైలెన్సర్ పైప్‌ను ఉపయోగించింది. నిగనిగలాడే క్రోమ్ ఫినిషింగ్‌లో డిజైన్ చేయబడిన డ్యూయెల్ ఎగ్జాస్ట్ పైప్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కాగా, స్టాండర్డ్ ఐ20లో ఎగ్జాస్ట్ పైప్ బంపర్ దిగువ భాగంలో కనిపించకుండా ఉంటుంది.

హ్యుందాయ్ ఐ20 ఎలైట్ మరియు ఐ20 ఎన్-లైన్ వెర్షన్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటి?

5. అంతర్గత మార్పులు

స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే, హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ ఎక్స్టీరియర్లో మార్పులు ఉన్నట్లుగానే, ఇంటీరియర్‌లలో కూడా పలు మార్పులు ఉండనున్నాయి. ఇంటీరియర్‌లలో మెటల్ పెడల్స్, ఎన్-లైన్ బ్యాడ్జింగ్ మరియు అక్కడక్కడా రెడ్ యాక్సెంట్‌లు కనిపిస్తాయి. ఇవి కారుకి స్పోర్టీ రూపాన్నిస్తాయి. కాగా, ఈ రెండు కార్లలో లభించే అనేక ఇతర ఫీచర్లు మాత్రమే ఒకేలా ఉండనున్నాయి.

హ్యుందాయ్ ఐ20 ఎలైట్ మరియు ఐ20 ఎన్-లైన్ వెర్షన్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటి?

6. ఇంజన్

స్టాండర్డ్ ఐ20 కారులో బిఎస్6 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదే ఇంజన్‌ను హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్‌లో ఉపయోగించే అవకాశం ఉంది. కాకపోతే, దీని స్పోర్టీ పెర్ఫార్మెన్స్‌కు అనుగుణంగా దీని సస్పెన్షన్, ఇంజన్ రెస్పాన్స్ మరియు ఎగ్జాస్ట్ నోట్ వంటి అంశాలను కంపెనీ రీట్యూన్ చేయనుంది.

హ్యుందాయ్ ఐ20 ఎలైట్ మరియు ఐ20 ఎన్-లైన్ వెర్షన్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటి?

హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.0-లీటర్ జిడిఐ, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పి పవర్‌ను మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఐఎమ్‌టి లేదా 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

హ్యుందాయ్ ఐ20 ఎలైట్ మరియు ఐ20 ఎన్-లైన్ వెర్షన్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటి?

హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్లు

ఇదిలా ఉంటే హ్యుందాయ్ తమ కార్లపై ఆగస్ట్ నెల ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో హ్యుందాయ్ కారుని కొనుగోలు చేసే కస్టమర్లు మంచి నగదు ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ ఔరా, గ్రాండ్ ఐ10 నియోస్, శాంత్రో మరియు స్టాండర్డ్ ఐ20 ఎలైట్ మోడళ్లపై కంపెనీ డిస్కౌంట్లను అందిస్తోంది. - ఈ ఆఫర్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Six major differences between hyundai i20 elite and n line
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X