కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో ఇండియా, ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన కుషాక్ ఎస్‌యూవీ అమ్మకాల పరంగా అద్భుతాలు సృష్టిస్తోంది. స్కోడా కుషాక్ ఎఫెక్ట్‌తో కంపెనీ గత నెలలో భారీ అమ్మకాలను నమోదు చేసింది. జులై 2020తో పోలిస్తే, జులై 2021లో స్కోడా అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి.

కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..

స్కోడా ఆటో గత జూలై 2020 నెలలో 922 యూనిట్లను విక్రయించగా, జులై 2021లో 3,080 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో అమ్మకాలు మూడు రెట్లు పెరిగినట్లు కంపెనీ నివేదించింది. స్కోడా కుషాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విజయం వలనే అమ్మకాలు పెరిగాయని కంపెనీ తెలిపింది.

కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..

భారతదేశంలో తమ అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలనే లక్ష్యంతో కుషాక్ ఎస్‌యూవీని ప్రారంభించామని, తమ ప్రణాళిక రూపుదిద్దుకోవడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ అన్నారు.

కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..

కరోనా మహమ్మారి నేపథ్యంలో, సవాలుతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ, తాము తమ వ్యూహాత్మక దృష్టికి అనుగుణంగా ఒక విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించగలిగామమని, అమ్మకాల అంచనాలను చేరుకోగలిగామని ఆయన తెలిపారు.

కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..

స్కొడా కుషాక్ కోసం డీలర్‌షిప్‌లకు వచ్చే కస్టమర్ల సంఖ్య మరియు కస్టమర్ ఎంక్వైరీల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అలాగే, భారతదేశంలో కొత్తగా స్కోడా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసేందుకు డీలర్ భాగస్వాముల నుండి ఆసక్తి పెరిగిందని హోలిస్ చెప్పారు.

కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..

స్కోడా బ్రాండ్‌ని కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు తీసుకెళ్లేందుకు తాము అగ్రెసివ్ ప్రణాళికలను అనుసరిస్తున్నామని, దేశవ్యాప్తంగా, తమ శ్రేష్ఠత మరియు కస్టమర్-సెంట్రిసిటీ దృష్టిని పంచుకునే భాగస్వాముల కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు.

కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, జూన్ 28వ తేదీన కంపెనీ ఈ కారుని భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ స్కోడా కుషాక్ ఎస్‌యూవీ కోసం 6,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..

కేవలం రూ.10.49 లక్షల ప్రారంభ ధరకే స్కోడా తమ కుషాక్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. ఇది యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.17.59 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..

స్కోడా కుషాక్ 1.0-లీటర్, 3-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, కంపెనీ ఇందులో 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఈ ఆగస్ట్ నెలలో మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందులోని 1.5-లీటర్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..

స్కోడా ఆటో గడచిన జూలై 2021 లో తన నెట్‌వర్క్ ఉనికిని దాదాపు 15 శాతం పెంచింది. ఈ ఏడాది ఆగస్టు 2021 నాటికి దేశవ్యాప్తంగా 100 కి పైగా నగరాల్లో తన ఉనికిని విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా 100 నగరాల్లో ఏర్పాటు చేయబోయే తమ టచ్‌పాయింట్లతో కలిపి కంపెనీ యొక్క సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ల సంఖ్య 170 కి చేరుకోనుంది.

కుషాక్ ఎఫెక్ట్: జులైలో మూడు రెట్లు పెరిగిన స్కోడా సేల్స్.. 6,000 కి పైగా బుకింగ్స్..

స్కొడా కుషాక్ ఎస్‌యూవీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు మరియు వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Auto India Sales Increased 234 Percent In July 2021; Kushaq Is In High Demand. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X