స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వేరియంట్ల వారీ ఫీచర్లు, ధరలు మరియు వివరాలు

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో గత నెల (జూన్) 28వ తేదీన భారత మార్కెట్లో తమ సరికొత్త ఎస్‌యూవీ 'స్కోడా కుషాక్' విడుదల చేసిన సంగతి తెలిసినదే. కేవలం రూ.10.49 లక్షల ప్రారంభ ధరకే కంపెనీ ఈ కారును విడుదల చేసింది. దేశీయ విపణిలో స్కోడా కుషాక్ యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వేరియంట్ల వారీ ఫీచర్లు, ధరలు మరియు వివరాలు

స్కోడా ఇండియా ఈ ఎస్‌యూవీని రెండు ఇంజన్ ఆప్షన్స్ (1.0-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్)తో ప్రవేశపెట్టింది. ఈ కారు యొక్క ప్రతి వేరియంట్లో కూడా కంపెనీ ఉత్తమమైన ఫీచర్లను అందిస్తోంది. స్కోడా కుషాక్‌లో వేరియంట్ల వారీగా అందిస్తున్న ఫీచర్ల వివరాలు మరియు వాటి ధరల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వేరియంట్ల వారీ ఫీచర్లు, ధరలు మరియు వివరాలు

స్కోడా కుషాక్ యాక్టివ్ (రూ.10.49 లక్షలు, ఎక్స్ షోరూమ్)

ఇదొక ఎంట్రీ లెవల్ వేరియంట్. ఈ వేరియంట్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 1.0-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లభిస్తుంది. ఇందులో 16 ఇంచ్ స్టీల్ వీల్స్, మాన్యువల్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, డిఆర్‌ఎల్‌లు మరియు హాలోజన్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఇడి టెయిల్ లైట్స్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ రూఫ్ రైల్స్ మరియు బ్లాక్ స్కిడ్ ప్లేట్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వేరియంట్ల వారీ ఫీచర్లు, ధరలు మరియు వివరాలు

అంతే కాకుండా, ఈ వేరియంట్‌లో బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన బి-పిల్లర్ మరియు సి-పిల్లర్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, బ్లాక్ ఫాబ్రిక్ సీట్లు, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ అడ్జస్టబల్ స్టీరింగ్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ నాలుగు పవర్ విండోస్ మొదలైన ఫీచర్లు కూడా లభిస్తాయి.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వేరియంట్ల వారీ ఫీచర్లు, ధరలు మరియు వివరాలు

ఈ బేస్ వేరియంట్‌లో కంపెనీ బేసిక్ ఎమ్ఐడి క్లస్టర్, 12వి పవర్ సాకెట్, రిమోట్ లాకింగ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ-కొలైజన్ బ్రేకింగ్, బ్రేక్ డిస్క్ వైపింగ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ సిస్టమ్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ ఫీచర్లను కూడా అందిస్తోంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వేరియంట్ల వారీ ఫీచర్లు, ధరలు మరియు వివరాలు

స్కోడా కుషక్ యాంబిషన్ (రూ.12.79 లక్షల నుండి 14.19 లక్షలు, ఎక్స్-షోరూమ్)

స్కోడా కుషక్ యాంబిషన్ మిడ్-లెవల్ వేరియంట్. ఇందులో యాక్టివ్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు కాకుండా, 16 ఇంచ్ సింగిల్-టోన్ అల్లాయ్ వీల్స్, డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్, సిల్వర్ రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఈ వేరియంట్ 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వేరియంట్ల వారీ ఫీచర్లు, ధరలు మరియు వివరాలు

ఇంకా, ఈ వేరియంట్‌లో సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, రియర్ వైపర్ మరియు డీఫాగర్, 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పాడిల్ షిఫ్టర్స్ (ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రమే), హిల్ హోల్డ్ కంట్రోల్ (ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రమే), సెంటర్ స్ట్రిప్ మరియు బ్లాక్ ఫాబ్రిక్ సీట్లు మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వేరియంట్ల వారీ ఫీచర్లు, ధరలు మరియు వివరాలు

ఇవే కాకుండా, ఈ వేరియంట్‌లో లెదర్‌తో చుట్టిబడిన స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, పెద్ద 3.5 ఇంచ్ మల్టీ-ఇన్ఫో డిస్‌ప్లే, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, డెడ్ పెడల్, ఫ్రంట్ స్కఫ్ ప్లేట్లు, ముందు మరియు వెనుక యుఎస్‌బి-చార్జింగ్ పోర్టులు, రియర్ ఏసి వెంట్స్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన 60:40 స్ప్లిట్ సీట్లు, రియర్ పార్శిల్ షెల్ఫ్, రియర్ వ్యూ కెమెరా, డ్యూయల్ హార్న్, పవర్ విండోస్ మరియు చైల్డ్ సేఫ్టీ లాక్ ఫీచర్లు ఉన్నాయి.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వేరియంట్ల వారీ ఫీచర్లు, ధరలు మరియు వివరాలు

స్కోడా కుషాక్ స్టైల్ (రూ.14.59 లక్షల నుంచి రూ.17.59 లక్షలు, ఎక్స్ షోరూమ్)

ఇది స్కోడా కుషాక్ యొక్క టాప్-స్పెక్ వేరియంట్, ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో పాటుగా 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ మరియు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో కూడిన 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వేరియంట్ల వారీ ఫీచర్లు, ధరలు మరియు వివరాలు

ఈ వేరియంట్లో 17 ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, పూర్తి ఎల్ఈడి టెయిల్ లాంప్స్, క్రోమ్ ఇన్సెర్ట్స్‌తో కూడిన డోర్ హ్యాండిల్స్, బి-పిల్లర్ మరియు సి-పిల్లర్ పై గ్లోసీ బ్లాక్ ఫినిష్, విండో మరియు ట్రంక్‌పై క్రోమ్ గార్నిష్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ మరియు వైపర్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు మరియు లెథర్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు ఉంటాయి.

స్కొడా కుషాక్ ఎస్‌యూవీ వేరియంట్ల వారీ ఫీచర్లు, ధరలు మరియు వివరాలు

ఇంకా ఇందులో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సబ్‌ వూఫర్ మరియు 6-స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్, సింగిల్-పాన్ సన్‌రూఫ్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, కర్టెన్ మరియు సైడ్ ఎయిర్‌బ్యాగులు (మ్యాన్యువల్ వేరియంట్‌లో మాత్రమే) , టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (మ్యాన్యువల్ వేరియంట్‌లో మాత్రమే) మరియు యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Kushaq SUV Variant-wise Features, Specs And Price Details. Read in Telugu.
Story first published: Monday, July 26, 2021, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X