Skoda Slavia సెడాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఆవిష్కరణ.. వివరాలు

స్కోడా కుషాక్ ఎస్‌యూవీ విడుదల తర్వాత, ఇప్పుడు ఈ చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ భారత మార్కెట్ కోసం పరిచయం చేయనున్న మరొక సరికొత్త ఉత్పత్తి 'స్కోడా స్లావియా' (Skoda Slavia) మిడ్-సైజ్ సెడాన్. కంపెనీ ఇటీవలే ఇందుకు సంబంధించిన ఓ అఫీషియల్ టీజర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా, ఇప్పుడు ఈ మోడల్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ చిత్రాలను వెల్లడించింది.

Skoda Slavia సెడాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఆవిష్కరణ.. వివరాలు

అయితే, ఈ కారు డిజైన్ వివరాలు కనిపించకుండా ఉండేలా కంపెనీ దీనిని భారీగా క్యామోఫ్లేజ్ చేసి ఉంది. దీని వెనుక ఓ కారణం కూడా ఉంది. స్కోడా ఆటో ఇండియా ఇటీవల స్లావియా సెడాన్ కోసం ఓ క్యామోఫ్లేజ్ డిజైన్ పోటీ నిర్వహించింది. ఈ పోటీలో పాల్గనే అభ్యర్థులు స్కోడా స్లావియా సెడాన్ యొక్క క్యామోఫ్లేజ్ డిజైన్ స్కెచ్ చేసి, కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోటీలో గెలిచిన వారికి కంపెనీ ఓ సర్‌ప్రైజ్ కానుక అందిస్తుంది.

Skoda Slavia సెడాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఆవిష్కరణ.. వివరాలు

ఈ నేపథ్యంలో, స్కోడా స్లావియా క్యామోఫ్లేజ్ కాంపిటీషన్ విజేత వివరాలను కంపెనీ అక్టోబర్ 11న ప్రకటించింది. వాస్తవికి స్కోడా స్లావియాకు దగ్గరా ఉండే పోలికను ఓ వ్యక్తి డిజైన్ చేసి, ఈ పోటీలో గెలుపొందారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని బాదల్‌పూర్‌కు చెందిన స్రయాష్ కరంబెల్కర్ ఈ పోటీలో గెలుపొందారు. ఈ పోటీలో గెలిచినందుకు అతను ప్రేగ్, చెక్ రిపబ్లిక్‌ దేశాలను సందర్శిస్తాడు.

Skoda Slavia సెడాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఆవిష్కరణ.. వివరాలు

ఈ డిజైన్ పోటీలో గెలుపొందిన స్రయాష్ కరంబెల్కర్ చెక్ రిపబ్లిక్ లోని స్కోడా ఆటో డిజైన్ హెడ్ ఆలివర్ స్టెఫానీని కలుస్తారు. స్కోడా స్లావియా మిడ్-సైజ్ సెడాన్ రహదారి పరీక్షలకు (రోడ్ టెస్ట్) గురైనప్పుడు, అది ఎలా ఉంటుందనే విషయాన్ని, స్రయాష్ కరంబెల్కర్ తన క్యామోఫ్లేజ్ డిజైన్ ద్వారా వెల్లడించారు.

Skoda Slavia సెడాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఆవిష్కరణ.. వివరాలు

ఇదిలా ఉంటే, స్కోడా ఆటో ఇండియా తమ సరికొత్త స్లావియా సెడాన్ ను ఈ ఏడాది శీతాకాలంలో (నవంబర్ - డిసెంబర్ 2021 మధ్యలో) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. స్కోడా స్లావియా పేరు వెనుక ఉన్న చరిత్రను కూడా కంపెనీ తెలియజేసింది. స్కోడా 1896 లో తయారు చేసిన సైకిళ్లను 'స్లావియా' పేరుతో విక్రయించే వారు. కాగా, కంపెనీ ఇప్పుడు తమ ఐకానిక్ నేమ్ ప్లేట్ ను ఈ సెడాన్ కోసం ఉపయోగించనుంది.

Skoda Slavia సెడాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఆవిష్కరణ.. వివరాలు

ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగం స్కోడా ఆటో, భారత మార్కెట్ కోసం అనేక కొత్త ఉత్పత్తులను మరియు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా వచ్చిన మొదటి ఉత్పత్తి స్కోడా కుషాక్ (Skoda Kushaq) మరియు రెండవ ఉత్పత్తి స్కోడా స్లావియా (Skoda Slavia). కుషాక్ మాదిరిగానే ఈ కొత్త స్లావియా సెడాన్ ను కూడా, భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా స్థానికీకరించిన MQB A0 IN ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు.

Skoda Slavia సెడాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఆవిష్కరణ.. వివరాలు

ఈ ఏడాది చివరి నాటికి స్కోడా స్లావియా కారు ప్రజల ముందుకు రానుంది. స్కోడా అందిస్తున్న ర్యాపిడ్ ఎంట్రీ లెవల్ సెడాన్ ఇప్పటికే మంచి ఫీచర్లతో ప్రజల గుండెల్లో ఓ సుస్థిర స్థానాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో, స్కోడా నుండి మంచి పోటీతో కూడుకున్న మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో వస్తున్న స్లావియా సెడాన్ పై ఇప్పటికే భారతీయ వినియోగదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Skoda Slavia సెడాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఆవిష్కరణ.. వివరాలు

స్కోడా స్లావియా మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో హ్యుందాయ్ వెర్నా, మారుతి సియాజ్ మరియు హోండా సిటీ కార్లకు పోటీగా నిలుస్తుంది. తాజా వేదికల ప్రకారం, ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కోడా ర్యాపిడ్ ఎంట్రీ లెవల్ సెడాన్ కంటే పెద్దదిగా ఉంటుందని మరియు మరింత శక్తివంతమైన ఇంజన్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Skoda Slavia సెడాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఆవిష్కరణ.. వివరాలు

స్లావియా ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, సిగ్నేచర్ బటర్‌ఫ్లై ఆకారపు గ్రిల్, అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ మొదలైనవి ఆశించవచ్చు. స్కోడా ఆటో ఇండియా తమ స్లావియా సెడాన్ ను 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్లతో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇవే ఇంజన్లను కంపెనీ తమ లేటెస్ట్ కుషాక్ ఎస్‌యూవీలో కూడా ఆఫర్ చేస్తోంది.

Skoda Slavia సెడాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఆవిష్కరణ.. వివరాలు

స్కోడా ర్యాపిడ్ మ్యాట్ ఎడిషన్ విడుదల..

ఇదిలా ఉంటే, స్కోడా ఆటో తాజాగా భారత మార్కెట్లో తమ కొత్త స్కోడా ర్యాపిడ్ మ్యాట్ ఎడిషన్ (Skoda Rapid Matte Edition) మోడల్ ని విడుదల చేసింది. కొత్త మ్యాట్ పెయింట్ ఫినిష్ తో లభ్యమయ్యే ఈ ర్యాపిడ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Skoda Slavia సెడాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఆవిష్కరణ.. వివరాలు

కేవలం కాస్మెటిక్ అప్‌గ్రేడ్ మాత్రమే కాకుండా, ఈ మ్యాట్ ఎడిషన్ ర్యాపిడ్ సెడాన్ లో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలు కూడా ఉన్నాయి. ఇది మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే, ఇవి కేవలం 400 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda slavia revealed in its prototype with heavy camouflage details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X