దక్షిణ భారత్‌లో Tata Motors కొత్త రికార్డ్; ఒకే రోజు 70 షోరూమ్‌ల ప్రారంభం

భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మరియు ప్రజలు ఎంతగానో నమ్మే బ్రాండ్ Tata Motors (టాటా మోటార్స్). Tata Motors ఇప్పుడు దేశీయ మార్కెట్లో టాటా పంచ్ అనే కారుని విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ కారుకి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది.

Tata Motors కొత్త రికార్డ్; ఒకే రోజు 70 షోరూమ్‌ల ప్రారంభం

ఇదిలా ఉండగా Tata Motors నిరంతరం తన పోర్ట్‌ఫోలియోను పెంచడానికి కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన అమ్మకాలను పెంచడానికి మరియు వినియోగదారులకు మరింత చేరువగా ఉండటానికి డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తోంది. భారతదేశంలో తన ఉనికిని చాటుకోవడానికి కంపెనీ అహర్నిశలు పాటుపడుతోంది.

Tata Motors కొత్త రికార్డ్; ఒకే రోజు 70 షోరూమ్‌ల ప్రారంభం

Tata Motors కంపెనీ తన రిటైల్ అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగానే ఒకేరోజులో దక్షిణ భారతదేశంలో మొత్తం 70 కొత్త టాటా మోటార్స్ షోరూమ్‌లను ప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో ప్రారంభించిన 70 షోరూమ్‌లు 53 నగరాల్లో ప్రారంభించబడ్డాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోని తన మార్కెట్ ని మరింత విస్తరించడానికి చేపట్టిన చర్య.

Tata Motors కొత్త రికార్డ్; ఒకే రోజు 70 షోరూమ్‌ల ప్రారంభం

కేవలం ఒక్కరోజులో 70 షోరూమ్‌లు ప్రారంభించడం నిజంగా చాలా అరుదైన చర్య. టాటా మోటార్స్ ఇప్పటి వరకు చేపట్టిన అతిపెద్ద ప్రధాన చర్యల్లో ఇది కూడా ఒకటి. సరికొత్త మరియు ఆధునిక షోరూమ్‌లు ఎలక్ట్రిక్ కార్లతో సహా కంపెనీ 'న్యూ ఫరెవర్' ప్యాసింజర్ వాహనాలను ప్రదర్శిస్తాయి మరియు కస్టమర్‌లు బ్రాండ్ ఉత్పత్తుల్లో ఉత్తమమైన వాటిని అనుభవించడానికి వీలు కల్పిస్తాయి.

Tata Motors కొత్త రికార్డ్; ఒకే రోజు 70 షోరూమ్‌ల ప్రారంభం

ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో అమ్మకాలను మరింత పెంచడానికి ఈ కొత్త షోరూమ్‌లు చాలా ఉపయోగపడతాయి. టాటా మోటార్స్ నెట్‌వర్క్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాల్లో 272 షోరూమ్‌లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశం మొత్తం 980 డీలర్‌షిప్‌లు ఉన్నాయి.

Tata Motors కొత్త రికార్డ్; ఒకే రోజు 70 షోరూమ్‌ల ప్రారంభం

కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తూ, టాటా మోటార్స్ యొక్క సేల్స్, మార్కెటింగ్ & కస్టమర్ కేర్, ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్, వైస్ ప్రెసిడెంట్ Mr. Rajan Amba (శ్రీ రాజన్ అంబ) మాట్లాడుతూ, అమ్మకాల పరంగా దక్షిణ భారతదేశం 28% కి దోహదం చేస్తుంది. అమ్మకాల పరంగా కంపెనీకి ఇది చాలా కీలకం. మేము మా వినియోగదారులకు అన్నివిధాలా అనుకూలంగా ఉండేవిధంగా చేస్తున్నాము. ప్రస్తుతం ఈ 70 కొత్త షోరూమ్‌లు భారతదేశంలో రిటైల్ విస్తరణ ప్రణాళికలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు.

Tata Motors కొత్త రికార్డ్; ఒకే రోజు 70 షోరూమ్‌ల ప్రారంభం

ఈ విస్తరణ మా వినియోగదారుల అవసరాలు మరియు అభిరుచులను నిరంతరం అభివృద్ధి చేసుకునేలా, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పరిష్కారాలతో, ఈరోజు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడంలో మాకు సహాయపడుతుంది.

Tata Motors కొత్త రికార్డ్; ఒకే రోజు 70 షోరూమ్‌ల ప్రారంభం

ఇటీవల టాటా మోటార్స్ తన కొత్త పోర్ట్‌ఫోలియోను భారత మార్కెట్లో విస్తరించడంతో భాగంగా, కొత్త టాటా టిగోర్ EV ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త టాటా టిగోర్ EV అధునాత సాంకేతిక లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా, ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది 74 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అంతే కాకుండా ఈ కారు కేవలం 5.7 సెకన్లలో 0 నుండి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇప్పుడు ఇందులో ప్రవేశపెట్టిన, జిప్‌ట్రాన్ టెక్నాలజీ కారణంగా ఏకంగా దీని పరిధి 306 కిమీ వరకు పెరిగింది.

Tata Motors కొత్త రికార్డ్; ఒకే రోజు 70 షోరూమ్‌ల ప్రారంభం

కొత్త Tata Tigor EV యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబిడి, డ్యూయల్-వీల్ డిస్క్ బ్రేక్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్క్ అసిస్ట్, హిల్ యాసెంట్ అసిస్ట్, హిల్ డీసెంట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు రియర్ పార్కింగ్ కెమెరాతో పాటు ఇంకా చాలా ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

Tata Motors కొత్త రికార్డ్; ఒకే రోజు 70 షోరూమ్‌ల ప్రారంభం

అంతే కాకుండా కంపెనీ 2021 ఆగస్టులో అమ్మకాల పరంగా 51 శాతం వృద్ధిని సాధించింది, దీనితో పాటు ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో టాటా మోటార్స్ 28,017 యూనిట్ల అమ్మకాలతో మూడవ స్థానంలో నిలిచింది.కంపెనీ మార్కెట్ వాటా 10.8 శాతానికి చేరుకుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tata motors sets milestone with opening 70 new showrooms in southern india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X