డిసెంబర్‌లో భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-10 కార్లు

గత సంవత్సరంలో దేశంలో విజృంభించిన కరోనా మహమ్మారి కారణంగా, భారత ఆటోమొబైల్ పరిశ్రమలో దేశీయ అమ్మకాలతో పాటుగా ఎగుమతులు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కరోనా కారణంగా, అంతర్జాతీయ రవాణా స్థంభించడంతో కార్ల ఎగుమతులకు కూడా ఆటంకం కలిగింది.

డిసెంబర్‌లో భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-10 కార్లు

అయితే, భారతదేశంలోని కార్ కంపెనీలు ఈ కష్టకాలం నుండి తేరుకొని తమ ఉత్పత్తులను విదేశాలకు చేర్చచం కొంతమేర విజయం సాధించాయనే చెప్పాలి. గడచిన డిసెంబర్ 2020 నెలకు సంబంధించి టాప్-10 ఎక్స్‌పోర్టెడ్ కార్ల జాబితా విడుదలైంది. ఇందులో హ్యుందాయ్, మారుతి బ్రాండ్లు మాత్రమే వృద్ధిని కనబరిచాయి. ఈ సమయంలో భారత్ నుండి ఎగుమతి అయిన టాప్-10 కార్ల లిస్ట్ ఇలా ఉంది:

డిసెంబర్‌లో భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-10 కార్లు

ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది నిస్సాన్ సన్నీ. ఈ జపనీస్ కార్ బ్రాండ్ సన్నీ సెడాన్‌ను భారత మార్కెట్లో నిలిపివేసినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం మాత్రం దీనిని ఉత్పత్తి చేస్తూనే ఉంది. డిసెంబర్ 2019లో 9,237 యూనిట్లను ఎగుమతి చేసిన నిస్సాన్ డిసెంబర్ 2020లో 7,897 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసి 14.5 క్షీణతను నమోదు చేసింది.

MOST READ: నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

డిసెంబర్‌లో భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-10 కార్లు

ఈ జాబితాలో హ్యుందాయ్ వెర్నా ప్రీమియం సెడాన్ ద్వితీయ స్థానంలో ఉంది. గత డిసెంబర్ (2020) నెలలో హ్యుందాయ్ మొత్తం 7301 యూనిట్ల వెర్నా కార్లను ఎగుమతి చేసింది. డిసెంబర్ 2019లో ఇవి 5117 యూనిట్లుగా మాత్రేమ ఉన్నాయి. ఈ సమయంతో పోల్చుకుంటే వెర్నా ఎగుమతులు 42 శాతం వృద్ధి చెందాయి.

డిసెంబర్‌లో భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-10 కార్లు

ఈ జాబితాలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఈసారి మూడవ స్థానానికి పడిపోయింది. గత డిసెంబర్ 2020లో ఎకోస్పోర్ట్ ఎగుమతులు 6,986 యూనిట్లుగా నమోదయ్యాయి. డిసెంబర్ 2019లో ఇవి 12,607 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఎకోస్పోర్ట్ ఎగుమతులు భారీగీ 44 శాతం క్షీణించాయి.

Rank Models Dec 2020 Dec 2019 Growth (%)
1 Nissan Sunny 7,897 9,237 -14.51
2 Hyundai Verna 7,301 5,117 42.68
3 Ford Ecosport 6,986 12,607 -44.59
4 Hyundai Creta 5,647 3,379 67.12
5 Hyundai Grand i10 3,464 944 266.95
6 Kia Seltos 2,889 6,341 -54.44
7 Chevrolet Beat 2,805 4,129 -33.52
8 Maruti Baleno 2,357 2,118 11.28
9 Marut Dzire 2,263 1,119 102.33
10 Kia Sonet 1,668 0 -

MOST READ: లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

డిసెంబర్‌లో భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-10 కార్లు

నాల్గవ స్థానంలో హ్యుందాయ్ క్రెటా ఉంది. ఇందులో గడచిన సంవత్సరం కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, క్రెటా ఎగుమతులు కూడా జోరందుకున్నాయి. డిసెంబర్ 2020లో 5,647 యూనిట్లు క్రెటాలను ఎగుమతి చేయగా, డిసెంబర్ 2019లో వీటి సంఖ్య 3,379 యూనిట్లుగా ఉండి 67.12 శాతం వృద్ధిని నమోదు చేసింది.

డిసెంబర్‌లో భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-10 కార్లు

ఆ తర్వాతి స్థానంలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఉంది. డిసెంబర్ 2020లో ఈ మోడల్ ఎగుమతులు 3,464 యూనిట్లుగా ఉంటే, డిసెంబర్ 2019లో ఇవి కేవలం 944 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో గ్రాండ్ ఐ10 ఎగుమతులు 266 శాతం భారీ వృద్ధిని నమోదు చేశాయి.

MOST READ: పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

డిసెంబర్‌లో భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-10 కార్లు

ఈ సమయంలో కియా సెల్టోస్ ఎగుమతులు బారీగా క్షీణించాయి. డిసెంబర్ 2019లో 6,341 యూనిట్లను ఎగుమతి చేసిన కియా, డిసెంబర్ 2020లో కేవలం 2,889 యూనిట్ల సెల్టోస్ కార్లను మాత్రమే ఎగుమతి చేయగలిగింది. ఈ సమయంలో సెల్టోస్ ఎగుమతులు 54.44 శాతం తగ్గాయి. మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా సెల్టోస్ దేశీయ అమ్మకాలు కూడా తగ్గుతున్నాయి.

డిసెంబర్‌లో భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-10 కార్లు

గత నెలలో షెవర్లే బీట్ ఎగుమతులు 2,805 యూనిట్లుగా ఉండి, అంతకు ముందు ఇదే సమయంతో పోల్చుకుంటే 33.52 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఇదే కాలంలో మారుతి సుజుకి మొత్తం 2,357 బాలెనో కార్లను ఎగుమతి చేయగా, 2,263 డిజైర్ కార్లను ఎగుమతి చేసి వరుసగా 11.28 మరియు 102.33 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

MOST READ: గుడ్ న్యూస్.. ఇకపై వారు టోల్‌గేట్ చెల్లించకుండా ఉచితంగా వెళ్ళవచ్చు.. వారెవరనుకుంటున్నారా..!

డిసెంబర్‌లో భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-10 కార్లు

ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది కియా సోనెట్. కొరియన్ కార్ బ్రాండ్ గతేడాది చివర్లో ఈ కారును భారత మార్కెట్లో అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. డిసెంబర్ 2020లో కియా మోటార్స్ మొత్తం 1,668 సోనెట్ కార్లను భారత్ నుండి విదేశాలకు ఎగుమతి చేసింది.

Most Read Articles

English summary
Top 10 Exported Cars From India In December 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X