సెప్టెంబర్ 2021లో విడుదలైన టాప్ కార్లు: ఫోర్స్ గుర్ఖా, సెల్టోస్ ఎక్స్-లైన్ మరెన్నో..!

ప్రస్తుత పండుగ సీజన్ లో ప్రజల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. పండుగ సీజన్ పూర్తిగా రాకముందే, అనేక కంపెనీలు కొత్త అవతార్‌లో తమ కొత్త ఉత్పత్తులను మరియు స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

సెప్టెంబర్ 2021లో విడుదలైన టాప్ కార్లు: ఫోర్స్ గుర్ఖా, సెల్టోస్ ఎక్స్-లైన్ మరెన్నో..!

గత నెలలో, కియా సెల్టోస్ ఎక్స్-లైన్, టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్, హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ మరియు కొత్త తరం ఫోర్స్ గూర్ఖా వంటి మోడళ్లు మార్కెట్లో విడుదలయ్యాయి. మరి వీటి సంబంధించిన సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

సెప్టెంబర్ 2021లో విడుదలైన టాప్ కార్లు: ఫోర్స్ గుర్ఖా, సెల్టోస్ ఎక్స్-లైన్ మరెన్నో..!

1. 2021 ఫోర్స్ గుర్ఖా - ధర రూ. 13.59 లక్షలు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్స్ మోటార్స్ (Force Motors) తమ కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా (Force Gurkha) ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని సెప్టెంబర్ నెలలో భారతదేశంలో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 13.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్‌లు కూడా ప్రారంభం అయ్యాయి.

సెప్టెంబర్ 2021లో విడుదలైన టాప్ కార్లు: ఫోర్స్ గుర్ఖా, సెల్టోస్ ఎక్స్-లైన్ మరెన్నో..!

ఆసక్తిగల కస్టమర్లు రూ. 25,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. దీని డెలివరీలు అక్టోబర్ 15వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. మునుపటి తరం మోడల్ తో పోలిస్తే, కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా అనేక మార్పులతో తీసుకురాబడింది. ఇందులో మరింత శుద్ధమైన ఇంజన్, కొత్త సీటింగ్ లేఅవుట్, ఆకర్షణీయమైన ఇంటీరియర్, కొత్త ఫీచర్లు మరియు పరికరాలు ఉన్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్ 2021లో విడుదలైన టాప్ కార్లు: ఫోర్స్ గుర్ఖా, సెల్టోస్ ఎక్స్-లైన్ మరెన్నో..!

2. కియా సెల్టోస్ ఎక్స్-లైన్

కొరియన్ కార్ బ్రాండ్ కియా ఇండియా (Kia India) భారత మార్కెట్లో విక్రయిస్తున్న సెల్టోస్ (Seltos) మిడ్-సైజ్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ ను విడుదల చేసింది. కియా సెల్టోస్ ఎక్స్-లైన్ (Kia Seltos X-Line) పేరుతో కంపెనీ ఈ కొత్త వేరియంట్ ను ప్రవేశపెట్టింది. దేశీయ విపణిలో ఈ కొత్త వేరియంట్ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

సెప్టెంబర్ 2021లో విడుదలైన టాప్ కార్లు: ఫోర్స్ గుర్ఖా, సెల్టోస్ ఎక్స్-లైన్ మరెన్నో..!

స్టాండర్డ్ వెర్షన్ సెల్టోస్ తో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 కియా సెల్టోస్ ఎక్స్-లైన్ వేరియంట్ ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్లలో పలు మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇది ప్రత్యేకమైన మ్యాట్ గ్రాఫైట్ గ్రే షేడ్‌లో గ్లోస్ బ్లాక్ రూఫ్‌తో లభిస్తుంది. ఇంకా ఇందులో చేసిన ఇతర మార్పులలో పియానో ​​బ్లాక్ స్ట్రిప్‌తో మాట్టే గ్రాఫైట్ గ్రిల్ మరియు ముందు భాగంలో ఆరెంజ్ యాక్సెంట్స్ కలిగిన బ్లాక్ స్కిడ్ ప్లేట్ మొదలైనవి ఉంటాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్ 2021లో విడుదలైన టాప్ కార్లు: ఫోర్స్ గుర్ఖా, సెల్టోస్ ఎక్స్-లైన్ మరెన్నో..!

3. టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా సఫారీ (Tata Safari) లో కంపెనీ ఓ ప్రత్యేకమైన గోల్డ్ ఎడిషన్‌ (Gold Edition) ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్‌ ప్రారంభ ధర రూ. 21.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఈ కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ వైట్ గోల్డ్ మరియు బ్లాక్ గోల్డ్ అనే రెండు విభిన్న కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

సెప్టెంబర్ 2021లో విడుదలైన టాప్ కార్లు: ఫోర్స్ గుర్ఖా, సెల్టోస్ ఎక్స్-లైన్ మరెన్నో..!

టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్ లోని వైట్ గోల్డ్ కలర్ స్కీమ్‌లో ప్రీమియం ఫ్రాస్ట్ వైట్ బాడీ పెయింట్ మరియు బ్లాక్ కాంట్రాస్టింగ్ రూఫ్ ఉంటుంది. ఇందులోని గ్రిల్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, రూఫ్ రైల్స్, డోర్ హ్యాండిల్స్, టాటా మరియు సఫారీ బ్యాడ్జ్‌లపై గోల్డ్ కలర్ యాక్సెంట్స్ ఉంటాయి. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే, బ్లాక్ గోల్డ్ కలర్ స్కీమ్‌లో బయట వైపు మొత్తం కాఫీ బీన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఉంటుంది. ఇందులో కూడా గ్రిల్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, రూఫ్ రైల్స్, డోర్ హ్యాండిల్స్, టాటా మరియు సఫారీ బ్యాడ్జ్‌లపై గోల్డ్ కలర్ యాక్సెంట్స్ ఉంటాయి. - ఈ మోడల్‌కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్ 2021లో విడుదలైన టాప్ కార్లు: ఫోర్స్ గుర్ఖా, సెల్టోస్ ఎక్స్-లైన్ మరెన్నో..!

4. హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ (Hyundai) భారత మార్కెట్లో తమ కొత్త ఐ20 ఎన్-లైన్ (i20 N-Line) స్పోర్టీ వేరియంట్ హ్యాచ్‌బ్యాక్ ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2021 Hyundai i20 N-Line యొక్క ప్రారంభ ధర రూ. 9.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. హ్యుందాయ్ తమ ఐ20 ఎన్-లైన్ స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్‌ను రెండు ట్రిమ్‌లలో పరిచయం చేసింది. వీటిలో ఎన్6 (N6) మరియు ఎన్8 (N8) వేరియంట్లు ఉన్నాయి.

సెప్టెంబర్ 2021లో విడుదలైన టాప్ కార్లు: ఫోర్స్ గుర్ఖా, సెల్టోస్ ఎక్స్-లైన్ మరెన్నో..!

ఈ స్పోర్టీ వెర్షన్ హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్‌ మొత్త మూడు ట్రిమ్ లలో లభిస్తుంది. ఇందులో N6 (iMT), N8 (IMT) మరియు N8 (DCT) అనే మూడు ట్రిమ్‌లు ఉన్నాయి. భారతదేశంలో హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ కంపెనీ యొక్క మొట్టమొదటి ఎన్‌లైన్ సిరీస్ కారు అవుతుంది. హ్యుందాయ్ 2013 లో తొలిసారిగా తమ మొదటి ఎన్-లైన్ సిరీస్ కారును అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది.

సెప్టెంబర్ 2021లో విడుదలైన టాప్ కార్లు: ఫోర్స్ గుర్ఖా, సెల్టోస్ ఎక్స్-లైన్ మరెన్నో..!

ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ ఇప్పుడు ఈ సిరీస్‌లో మొత్తం 11 మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో హ్యుందాయ్ కోనా మరియు టక్సన్ ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి. - ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కి చెందిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Top car launches in september 2021 force gurkha seltos x line and more details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X