టొయోటా కార్ల విషయంలో పెరగనున్న వెయిటింగ్ పీరియడ్.. కారణం ఏంటంటే..?

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా, భారతదేశంలో అందించే కొన్ని కార్ల వెయిటింగ్ పీరియడ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయమే. అదేంటంటే, టొయోటా వచ్చే నవంబర్ నెలలో తమ ఉత్పత్తి లక్ష్యం (ప్రొడక్షన్ టార్గెట్) లో 15 శాతం తగ్గించాలని నిర్ణయించింది. విడిభాగాల కొరత కారణంగా, కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

టొయోటా కార్ల విషయంలో పెరగనున్న వెయిటింగ్ పీరియడ్.. కారణం ఏంటంటే..?

ఇది వరకు టొయోటా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 2021 నెలలో 1 మిలియన్ కార్ల (10 లక్షల కార్లను) ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. కానీ, ఇప్పుడు టొయోటా ఈ లక్ష్యాన్ని 8.50 లక్షల నుండి 9 లక్షల కార్లకు తగ్గించాలని నిర్ణయించింది. టొయోటా విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది.

టొయోటా కార్ల విషయంలో పెరగనున్న వెయిటింగ్ పీరియడ్.. కారణం ఏంటంటే..?

కోవిడ్-19 సంక్షోభం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనే ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటీ విడిభాగాల కొరతను ఎదుర్కుంటున్నాయి. వీటిలో టొయోటా కూడా ఉంది. ఈ విడిభాగాల కొరత నేపథ్యంలో, టొయోటా తమ వాహనాల ఉత్పత్తిని తగ్గించడానికి నిర్ణయం తీసుకుంది.

టొయోటా కార్ల విషయంలో పెరగనున్న వెయిటింగ్ పీరియడ్.. కారణం ఏంటంటే..?

టొయోటా విడుదల చేసిన ఒక ప్రకటనలో జపాన్‌లో వాహనాల ఉత్పత్తిని దాదాపు 50,000 కార్లు తగ్గిస్తుందని పేర్కొనబడింది. అదే సమయంలో, విదేశీ వాహనాల ఉత్పత్తి సుమారు 50,000 నుండి 1 లక్షల యూనిట్లు తగ్గించబడుతుందని అంచనా వేయబడింది. ఇంతకుముందు, టొయోటా గత సెప్టెంబర్‌లో కూడా కార్ల ఉత్పత్తిని తగ్గించింది.

టొయోటా కార్ల విషయంలో పెరగనున్న వెయిటింగ్ పీరియడ్.. కారణం ఏంటంటే..?

టొయోటా గత సెప్టెంబర్‌ నెలలో ఉత్పత్తిని దాదాపు 3 శాతం తగ్గించింది. మార్చి 21, 2022 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గానూ టొయోటా తన మొత్తం ఉత్పత్తి లక్ష్యాన్ని 9 మిలియన్ కార్ల (90 లక్షల కార్లు) నుండి మార్చలేదని పేర్కొంది. టొయోటా సెప్టెంబర్ మరియు అక్టోబర్‌లో నెలల్లో చిన్న తరహా ఉత్పత్తి కోతలు స్థిరంగా ఉంచడానికి సహాయపడిందని కూడా తెలిపింది.

టొయోటా కార్ల విషయంలో పెరగనున్న వెయిటింగ్ పీరియడ్.. కారణం ఏంటంటే..?

టొయోటా ఉత్పత్తి తగ్గింపు చర్యల కారణంగా, కార్ల వెయిటింగ్ పీరియడ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి టొయోటా ఈ విడిభాగాల కొరతను అధిగమించేందుకు చురుకుగా ప్రయత్నిస్తోంది. కానీ విడిభాగాల కొరత టొయోటాకే పరిమితం కాదు. ప్రపంచంలోని అనేక ప్రముఖ కంపెనీలు కూడా ఈ విడిభాగాల కొరతతో బాధపడుతున్నాయి.

టొయోటా కార్ల విషయంలో పెరగనున్న వెయిటింగ్ పీరియడ్.. కారణం ఏంటంటే..?

ఇటీవలి కాలంలో సెమీకండక్టర్స్ చిప్స్ కార్ల తయారీలో ముఖ్యమైన భాగాలలో ఒకటి గా మారింది. వీటి కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది ప్రపంచంలోని చాలా కంపెనీల కార్ల ఉత్పత్తిని ప్రభావితం చేసింది. ఈ సమస్య వలన భారతదేశంలోని కార్ కంపెనీలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

టొయోటా కార్ల విషయంలో పెరగనున్న వెయిటింగ్ పీరియడ్.. కారణం ఏంటంటే..?

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా తమ కొత్త తరం థార్ ఎస్‌యూవీ విషయంలో సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్ ఉండటానికి కూడా ఈ సెమీకండక్టర్ల కొరతే ప్రధాన కారణం. కొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీకి భారతదేశంలో మంచి ఆదరణ లభించింది. కానీ, అధిక డిమాండ్ కి తగినట్లుగా సప్లయ్ లేదు. దీంతో మహీంద్రా ఈ డిమాండ్‌ను తీర్చలేకపోయింది.

టొయోటా కార్ల విషయంలో పెరగనున్న వెయిటింగ్ పీరియడ్.. కారణం ఏంటంటే..?

సెమీకండక్టర్ల కొరత కారణంగా కొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీ కోసం వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరుగుతోంది. సెమీకండక్టర్ కొరత సమస్య ఎప్పుడు ముగుస్తుందనేది ఖచ్చితంగా తెలియట్లేదు. ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణల ప్రకారం, ఈ సమస్య దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు.

టొయోటా కార్ల విషయంలో పెరగనున్న వెయిటింగ్ పీరియడ్.. కారణం ఏంటంటే..?

ఈ నేపథ్యంలో, సెమీకండక్టర్ల చిప్స్ కొరతను ఎదుర్కునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యామ్నాయాల గురించి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాయి. ఎలక్ట్రానిక్ పరికకాలు, స్మార్ట్ ఫోన్లు మరియు కార్లలో ఉపయోగించే ఇన్ఫోటైన్‌మెంట్స్ అలాగే లేటెస్ట్ కార్ కెనెక్ట్ మరియు టెక్ ఫీచర్లలో ఈ సెమీ కండక్టర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా, వీటికి డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకుంది.

ఇదిలా ఉండగా Toyota (టొయోటా) మార్కెట్లో తన బ్రాండ్ కార్ల ధరలను ఇప్పుడు దాదాపు రూ. 61,000 వరకు పెంచింది. Toyota ఇప్పుడు టొయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మరియు టొయోటా క్యామ్రీ ధరలను పెంచింది. అయితే కంపెనీ యొక్క టొయోటా వెల్‌ఫైర్ ధరను మాత్రం పెంచలేదు. ఇందులో కూడా కంపెనీ యొక్క క్యామ్రీ ధరను ఏకంగా 61,000 రూపాయలు పెంచింది. టొయోటా కంపెనీ యొక్క పెరిగిన కార్ల ధరల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటేఇక్కడ క్లిక్ చేయండి. మీకు కావలసిన కారు ధరలను గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Most Read Articles

English summary
Toyota to cut its november production by 15 percent details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X