హ్యుందాయ్ వెర్నాలో కొత్త వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'వెర్నా'లో కంపెనీ సైలెంట్‌గా ఓ అప్‌డేటెడ్‌ను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ వెర్నా ఇప్పుడు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్‌డేట్‌తో రానుంది.

హ్యుందాయ్ వెర్నాలో కొత్త వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్

అంతేకాకుండా, హ్యుందాయ్ వెర్నా ఎస్+ వేరియంట్‌లో కూడా కంపెనీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. హ్యుందాయ్ వెర్నా ఎస్+ మరియు ఎస్ఎక్స్ వేరియంట్లలో కంపెనీ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లను అందిస్తోంది.

హ్యుందాయ్ వెర్నాలో కొత్త వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్

తాజా అప్‌డేట్స్ అనంతరం మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా ఎస్+ వేరియంట్ ధరలు రూ.9.60 లక్షల నుండి రూ.10.81 లక్షల మధ్యలో ఉన్నాయి. కాగా, హ్యుందాయ్ వెర్నా ఎస్ఎక్స్ వేరియంట్ ధరలు రూ.10.98 లక్షల నుండి రూ.13.36 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

హ్యుందాయ్ వెర్నాలో కొత్త వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్

ఇప్పటి వరకూ హ్యుందాయ్ వెర్నా కారులో ఆఫర్ చేసిన ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లను యాక్సెస్ చేసుకోవాలంటే, యూజర్లు తప్పనిసరిగా తమ స్మార్ట్‌ఫోన్‌ను డేటా కేబుల్ ద్వారా కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయాల్సి వచ్చేది.

హ్యుందాయ్ వెర్నాలో కొత్త వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్

అయితే, కొత్తగా పరిచయం చేసిన ఈ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్ సాయంతో, యూజర్లు ఎలాంటి డేటా కేబుల్ అవరం లేకుండా వైర్‌లెస్‌గా ఈ ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ వెర్నా ఈ బేస్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్ లభిస్తుంది.

హ్యుందాయ్ వెర్నాలో కొత్త వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్

ఈ బేస్ వేరియంట్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండదు. ఈ మోడల్‌లోని ఎస్+ మరియు ఎస్ఎక్స్ వేరియంట్లలో 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. కాగా, వెర్నా ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్ 8.0 ఇంచ్ ఏవిఎన్ యూనిట్, హెచ్‌డి డిస్‌ప్లే బ్లూలింక్ కనెక్టివిటీ కార్ టెక్నాలజీతో వస్తుంది.

హ్యుందాయ్ వెర్నాలో కొత్త వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్

అయితే, హ్యుందాయ్ వెర్నాలో ఫుల్లీ-లోడెడ్ టాప్-ఎండ్ వేరియంట్ అయిన వెర్నా ఎస్ఎక్స్ (ఓ)లో మాత్రం ఈ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్‌ను అందించడం లేదు. ఈ వేరియంట్లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లను యాక్సెస్ చేయటం కోసం డేటా కేబుల్ అవసరం ఉంటుంది.

హ్యుందాయ్ వెర్నాలో కొత్త వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్

పైన పేర్కొన్న మార్పులు మినహా కొత్త హ్యుందాయ్ వెర్నాలో వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ మరియు ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్, మాన్యువల్ డే / నైట్ ఇన్ రియర్ వ్యూ మిర్రర్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ వెర్నాలో కొత్త వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్

అంతేకాకుండా, ఇందులో హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇంటిగ్రేటర్లు, క్రోమ్ ఫినిష్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, 15 ఇంచ్ వీల్ కవర్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, అనలాగ్ టాకోమీటర్, సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్ హెడ్‌రెస్ట్, ఫ్రంట్ మరియు రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్‌లు మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో నాలుగు స్పీకర్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్, మాన్యువల్ ఏసి, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ మరియు పవర్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ వెర్నాలో కొత్త వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్

ఇంజన్ విషయానికి వస్తే, హ్యుందాయ్ వెర్నా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. హ్యుందాయ్ వెర్నా మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో హోండా సిటీ, స్కోడా రాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ వెంటో మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

హ్యుందాయ్ వెర్నాలో కొత్త వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్

హ్యుందాయ్ ఇటీవలే తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా బేస్ వేరియంట్‌లో కూడా కొన్ని మార్పులు చేసింది. హ్యుందాయ్ క్రెటా ఈ బేస్ వేరియంట్లో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్‌లు తొలగించి వాటి స్థానంలో మ్యాన్యువల్‌గా సర్దుబాటు చేసే వాటిని అమర్చారు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Source: Autocar India

Most Read Articles

English summary
Updated Hyundai Verna Gets New Wireless Android Auto And Apple Carplay Feature. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X