Taigun బుకింగ్స్ ప్రారంభించిన Volkswagen; పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన Volkswagen దేశీయ మార్కెట్లో ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందిన సంస్థ. కంపెనీ యొక్క కార్లు దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. అయితే కంపెనీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో మరో కొత్త ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్ధమైందన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Taigun బుకింగ్స్ ప్రారంభించిన Volkswagen; పూర్తి వివరాలు

Volkswagen యొక్క ఇండియా 2.0 ప్రాజెక్ట్ ఆధారంగా Volkswagen Taigun (ఫోక్స్‌వ్యాగన్ టైగన్) ఎస్‌యూవీ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ప్రారంభానికి ముందు, కంపెనీ ఈ ఎస్‌యూవీ ఉత్పత్తి మరియు బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Taigun బుకింగ్స్ ప్రారంభించిన Volkswagen; పూర్తి వివరాలు

కొత్త Volkswagen Taigun పుణెలోని ప్లాంట్‌లో తయారవుతున్నట్లు కంపెనీ తెలియజేసింది. అంతే కాకూండా ఈ కొత్త Volkswagen Taigun ఎస్‌యూవీ బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు మరియు కొనుగోలుదారులు కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ లో గాని లేదా డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

Taigun బుకింగ్స్ ప్రారంభించిన Volkswagen; పూర్తి వివరాలు

Volkswagen Taigun ఎస్‌యూవీ MQB AO IN డిజైన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇటీవల ప్రారంభించిన Skoda Kushaq కూడా అదే ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. Volkswagen మరియు Skoda ఒకే ప్లాట్‌ఫారమ్ ను పంచుకోవడం ద్వారా భారతదేశంలో అనేక కొత్త కార్లను ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా విడుదల కానున్నాయి.

Taigun బుకింగ్స్ ప్రారంభించిన Volkswagen; పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో కొత్త Volkswagen Taigun టెస్టింగ్ చేసే సమయంలో చాలా సార్లు గుర్తించబడింది. ఇప్పటికే ఈ కొత్త ఎస్‌యూవీ గురించి చాలా సమాచారం వెలువడింది. ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుందని, అంతే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుందని కూడా కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.

Taigun బుకింగ్స్ ప్రారంభించిన Volkswagen; పూర్తి వివరాలు

Volkswagen Taigun చాలా మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త Volkswagen Taigun యొక్క ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, ఇందులో ముందు భాగంలో క్రోమ్ ప్లేట్లతో కూడిన పెద్ద గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు 17-ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Taigun బుకింగ్స్ ప్రారంభించిన Volkswagen; పూర్తి వివరాలు

Volkswagen Taigun యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మల్టీ-ఫంక్షన్ త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, గ్లోవ్ బాక్స్ మరియు లెదర్ చుట్టబడిన గేర్ లివర్‌ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, యుఎస్బి ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు అనేక కనెక్టెడ్ ఫీచర్స్ పొందుతుంది.

Taigun బుకింగ్స్ ప్రారంభించిన Volkswagen; పూర్తి వివరాలు

Volkswagen Taigun యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది.

Taigun బుకింగ్స్ ప్రారంభించిన Volkswagen; పూర్తి వివరాలు

ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. జిటి వేరియంట్లో 1.5-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో ప్రామాణికంగా అందించబడుతుంది.

Taigun బుకింగ్స్ ప్రారంభించిన Volkswagen; పూర్తి వివరాలు

Volkswagen Taigun ఎస్‌యూవీ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ ప్రయాణికుల భద్రతకు తోడ్పడుతుంది. ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషన్ డిఫ్లేటింగ్ వార్ణింగ్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ అండ్ రియర్ వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వున్నాయి.

Taigun బుకింగ్స్ ప్రారంభించిన Volkswagen; పూర్తి వివరాలు

కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని వచ్చే నెలలో దేశీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. Volkswagen Taigun భారతీయ మార్కెట్లో విడుదలైన తర్వాత Hyundai Creta, Kia Seltos మరియు Skoda Kushaq వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. Volkswagen ఇటీవల కొత్త లోగోను కూడా స్వీకరించినట్లు సమాచారం. Volkswagen యొక్క కొత్త Taigun ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో విడుదలకు ముందే మేము డ్రైవ్ చేసాము. ఈ కొత్త ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, August 20, 2021, 9:40 [IST]
English summary
Volkswagen taigun production and bookings starts in india launch soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+