ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ మార్కెట్లో ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది కస్టమర్లు ఎస్‌యూవీలను ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీలు విడుదల చేశాయి. ఇందులో మైక్రో ఎస్‌యూవీల దగ్గర నుంచి ఫుల్ సైజ్ ఎస్‌యూవీలు మరియు ప్రీమియం ఎస్‌యూవీల వరకు ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్‌యూవీలకు మంచి పోటీ ఉంది. ఇప్పుడు ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ యొక్క టైగన్ కూడా చేరింది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. అంతే కాకుండా ఇది ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 2.0 ప్లాన్ నుండి వచ్చిన మొదటి ఉత్పత్తి కూడా. ఫోక్స్‌వ్యాగన్ ఇప్పుడు తన టైగన్ ఎస్‌యూవీని హస్ట్లర్‌ల కారుగా #HustleModeOn హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం చేస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఇటీవల మేము ఫోక్స్‌వ్యాగన్ యొక్క కొత్త టైగన్ ఎస్‌యూవీని డ్రైవ్ చేసాము. టైగన్ ఎస్‌యూవీలోని ఫీచర్స్ ఏంటి, ఇది డ్రైవ్ చేయడానికి ఎలా ఉంటుంది. వాహన వినియోగదారులకు ఇది ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది, అనే విషయాలను గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ డిజైన్ మరియు స్టైల్:

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాదు, ఇది చూడగానే గుర్తించే విధంగా ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. మొత్తానికి ఈ ఎస్‌యూవీ మంచి డిజైన్ కలిగి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బ్రాడ్ యొక్క బ్యాడ్జ్ రెండు స్లాట్ క్రోమ్ గ్రిల్‌పై ఉటుంది. ఫోక్స్‌వ్యాగన్ కారు అంతటా చాలా వరకు క్రోమ్ బిట్‌లను ఉపయోగించింది. ఇవన్నీ కూడా ఈ కారుని మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తుంది. అంతే కాకుండా ఫ్రంట్ ఎండ్‌ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

టైగన్ యొక్క ముందు బంపర్‌లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులోని స్పెషల్ బిట్ అయితే చంకీ క్రోమ్ స్ట్రిప్, ఇది ఫాగ్ ల్యాంప్‌ల మధ్య ఉంటూ, తరువాత ఫాగ్ ల్యాంప్ చుట్టుముట్టడంతో ఇది ముగుస్తుంది. ముందు బంపర్‌లో బ్లాక్డ్ అవుట్ హనీకూంబ్ గ్రిల్ కూడా చూడవచ్చు. బోనెట్‌పై లైన్స్ కూడా గమనించవచ్చు. ఇందులోని వీల్ ఆర్చెస్ కారుని మరింత స్టైలింస్ గా కనిపించేలా చేస్తాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

టైగన్ యొక్క సైడ్ ప్రొఫైల్ లో మీ దృష్టిని ఆకర్షించే మొదటి అంశం ఇందులోని వీల్స్. ఇందులో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇది డబుల్ క్రీజ్ లైన్‌లను కూడా పొందుతుంది. ఇవి డోర్ అంతటా సమాంతరంగా నడుస్తుంది మరియు వెనుక ఫెండర్‌లో టేపర్డ్ పద్ధతిలో ముగుస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఈ ఎస్‌యూవీ యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇందులోని బంపర్ వెడల్పుగా ఉండే క్రోమ్ స్ట్రిప్ ఉంది. టెయిల్ గేట్ దిగువన ఉన్న క్రీజ్ లైన్ వెనుకవైపు కొంత స్టైల్‌ను జోడిస్తుంది. అయితే, ఈ ఎస్‌యూవీని మరింత సూపర్ ప్రీమియమ్‌గా కనిపించేలా చేయడానికి టైల్ లాంప్ కూడా కలిగి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఇందులోని టైల్ లాంప్ మొత్తం వెనుక వెడల్పు అంతటా ఉండటాన్ని మీరు గమనించవచ్చు. ఇది రెడ్ లైటింగ్ ఎలిమెంట్‌లను కవర్ చేసే బ్యాక్అవుట్ డిజైన్. టైగన్ వెనుక భాగం ఎస్‌యూవీకి చెందినదిగా కనిపిస్తుంది. మొత్తానికి ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుందని చెప్పవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

కాక్‌పిట్ మరియు ఇంటీరియర్:

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క క్రోమ్ స్ట్రిప్‌తో ప్రత్యేకమైన హ్యాండిల్‌బార్‌ని టగ్ చేయగానే, మీకు ప్రీమియం ఇంటీరియర్ స్వాగతం పలుకుతుంది. ఈ ఎస్‌యూవీ లోపల వివిధ రంగులలో ఉండే మెటీరియల్స్ చూడవచ్చు. ఇందులోని సీట్లు మరియు డాష్‌బోర్డ్‌లో కూడా విభిన్న రంగులు ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

డాష్‌బోర్డ్‌లోని మెయిన్ ఎలిమెంట్ మొత్తం సిల్వర్ స్ట్రిప్. ఇది డాష్‌బోర్డ్‌లోని అన్ని ఇతర అంశాలను కవర్ చేస్తుంది. డాష్‌బోర్డ్‌ సెంటర్ స్టేజ్ లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఈ కారులోని ముందు ప్రయాణీకుల వైపు ఫాక్స్ కార్బన్ ఫైబర్ ఎలిమెంట్ ఉంది, ఇది డిజైన్‌ను మరింత పెంచడంలో తోడ్పడుతుంది. డాష్‌బోర్డ్ యొక్క రెండు చివర్లలో కొన్ని ఫాన్సీ ఏసీ వెంట్‌లు ఉన్నాయి. టచ్‌స్క్రీన్ కింద సెంట్రల్ ఎసి వెంట్‌లు ఉన్నాయి. అయితే డాష్‌బోర్డ్‌లోని అన్ని ఇతర అంశాలతో పోల్చినప్పుడు, కాస్త బోరింగ్‌గా కనిపిస్తాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

హాప్టిక్ టచ్ ఎలిమెంట్ ఉన్న క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీని కింద USB పోర్ట్‌లు కలిగి ఉండటమే కాకుండా వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ఉన్న క్యూబిహోల్ కూడా కలిగి ఉంటుంది. 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఫోక్స్‌వ్యాగన్ ప్లేతో వస్తుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క టాప్-స్పెక్ మోడల్‌పై 8 ఇంచెస్ టిఎఫ్‌టి స్క్రీన్ ద్వారా ఇన్‌స్ట్రుమెంటేషన్ కలిగి ఉంటుంది. ఇది కారు యొక్క స్పీడ్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ ఫ్యూయెల్ కెపాసిటీ, ​​ఓడోమీటర్, రేంజ్ లెఫ్ట్‌ వంటి సమాచారాన్ని ఇది ప్రదర్శిస్తుంది. ఇది ప్రీమియం అనిపిస్తుంది, అంతే కాకూండా ఇది ప్రీమియం ఎలిమెంట్‌లను కూడా పొందుతుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

వోక్స్వ్యాగన్ టైగన్ డ్యూయల్ టోన్ కలర్ సీట్లను కలిగి ఉంటుంది. ఈ సీట్లు వెంటిలేట్ చేయబడతాయి. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు వెనుక కూర్చున్న ప్రయాణికులకు ఏసీ వెంట్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ అండ్ బూట్ స్పేస్:

ఫోక్స్‌వ్యాగన్ కార్లు వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కావున ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కూడా ఇదేవిధమైన సౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇందులోకి సీట్లు స్పోర్టీగా లేకపోయినప్పటికీ ప్రయాణికులకు మాత్రం చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ముందు సీట్లు కూడా వెంటిలేషన్ ఫంక్షన్‌ను కలిగి ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఇందులోని సీట్లు లాటరల్ సపోర్ట్, లంబర్ సపోర్ట్ మరియు తై సపోర్ట్ కలిగి ఉంటాయి. ఇవన్నీ కేవలం డ్రైవర్ కి మాత్రమే కాకుండా ప్రయాణికులకు కూడా అందుబాటులో ఉంటాయి. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లో లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

వెనుక సీట్ల విషయానికి వస్తే, ఇక్కడ కప్‌హోల్డర్‌లు ఉన్నాయి, మధ్యలో ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో ప్రయాణీకుల కోసం స్పెషల్ ఏసీ వెంట్‌లు ఉన్నాయి. ఏసీ వెంట్‌ల క్రింద మీ స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి సహాయపడే రెండు టైప్-సి పోర్ట్‌లు కూడా ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

మొత్తం మీద ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క క్యాబిన్ విశాలంగా మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉండటం వల్ల మరింత అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు.

Dimensions Volkswagen Taigun
Length 4,221mm
Width 1,760mm
Height 1,612mm
Wheelbase 2,651mm
Boot Space 385-litres
Ground Clearance 205mm
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు టర్బో పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ కాగా, మరొకటి 1.5 లీటర్ టిఎస్ఐ మోటార్. అయితే మేము డ్రైవ్ చేసిన కారు 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజిన్‌ కలిగి ఉంది. ఇది 7 స్పీడ్ DSG గేర్‌బాక్స్‌కి జత చేయబడింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఇక ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ యూనిట్ విషయానికి వస్తే, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఇక్కడ మేము డ్రైవ్ చేసిన 1.5-లీటర్ టిఎస్ఐ యూనిట్‌ పవర్ డెలివరీ ప్రారంభంలో సరళంగా ఉంటుంది. కానీ ఇది మంచి మిడ్-రేంజ్ మరియు టాప్ ఎండ్‌ను పొందింది. డిక్యూ200 7-స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ యూనిట్ అద్భుతమైనది మరియు గేర్ల ద్వారా త్వరగా మారుతుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

గేర్‌బాక్స్ ఎస్ మరియు డి అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. డి మోడ్‌లో, కారు మంచి వేగంతో గేర్‌లను మారుస్తుంది మరియు ఈ మోడ్లో డ్రైవింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది ఇంజిన్ ఎక్కువగా తిరగడానికి అనుమతించకుండా గేర్ల ద్వారా వెళుతుంది, తద్వారా ఇంధన వినియోగం కూడా తక్కువగా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఇక ఇందులోని ఎస్ మోడ్‌ విషయానికి వస్తే, ఇంజిన్‌కి మారడానికి ముందు ఎక్కువ సమయం గేర్‌లను కలిగి ఉన్నందున అధిక ఇంజిన్ వేగంతో మార్పులు జరుగుతాయి. అయితే, సరికొత్త టైగన్ ఎలాంటి అంకితమైన డ్రైవింగ్ మోడ్‌లను పొందలేదు.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఫోక్స్‌వ్యాగన్ కస్టమర్‌లు రెండు ప్రపంచాలలో ఉత్తమమైన వాటిని ఆస్వాదించగలరని ఆశిస్తున్నాము. ఇది ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ కాబట్టి, పొడవైన బాడీ మరియు రూఫ్‌కి కొద్దిగా బాడీ రోల్ ఉంది. ఇది ఎత్తులు మరియు పల్లాల వంటి ప్రదేశాల్లో ప్రయాణించడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లో NVH లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ఇది మంచి ఇన్సులేషన్ కలిగి ఉండటం వల్ల, బయట నుండి చాలా తక్కువ శబ్దం క్యాబిన్‌లోకి ప్రవేశించేలా చేస్తుంది. కానీ 4,200 ఆర్‌పిఎమ్ తర్వాత, క్యాబిన్‌లో ఇంజిన్ శబ్దం వస్తున్నట్లు మీరు గమనించవచ్చు. అయితే లో రివ్స్‌లో, ఇది చాలా మృదువుగా మరియు నిశ్శబ్దంగా నడుస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

మేము ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీని తక్కువ సమయం మాత్రమే కలిగి ఉన్నందున, ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా పరీక్షించలేకపోయాము. అయితే మేము సిటీ మరియు హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఎమ్ఐడి స్క్రీన్ 8.4 నుండి 10.2 కిమీ/లీ మధ్య ప్రదర్శించింది. కానీ మేము ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీని త్వరలో రోడ్ టెస్ట్ చేసినప్పుడు ఖచ్చితమైన గణాంకాలను వెల్లడిస్తాము. అప్పటివరకు వేచి ఉండక తప్పదు.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ సేఫ్టీ ఫీచర్స్:

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ ప్రయాణికుల భద్రతకు తోడ్పడుతుంది. ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే,

 • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
 • టైర్ ప్రెషన్ డిఫ్లేటింగ్ వార్ణింగ్
 • పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ అండ్ రియర్ వ్యూ కెమెరా
 • హిల్ హోల్డ్ కంట్రోల్
 • 6 ఎయిర్‌బ్యాగులు (టాప్-స్పెక్ జిటి వేరియంట్‌లో)
 • ఏబీఎస్ విత్ ఈబిడి
 • ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

  ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కీ ఫీచర్స్:

  ఫోక్స్‌వ్యాగన్ ప్లేతో 10 ఇంచెస్ టచ్ స్క్రీన్

  ఆపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో

  ఎలక్ట్రిక్ సన్‌రూఫ్

  స్మార్ట్ టచ్ క్లైమాట్రానిక్ ఆటో ఏసీ విత్ పోలెన్

  ఎల్ఈడీ లైటింగ్

  ఫోక్స్‌వ్యాగన్ బిల్డ్ క్వాలిటీ

  రెడ్ యాంబియంట్ లైటింగ్

  ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

  ప్రత్యర్థులు:

  భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ యొక్క టైగన్ అత్యంత పోటీతత్వ విభాగంలో ప్రవేశించింది. దేశీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ వంటి వాటిని ప్రత్యర్థిగా ఉంటుంది. భారత మార్కెట్లో ఇవన్నీ కూడా అద్భుతమైన ఎస్‌యూవీలు.

  Fact Check:

  Specifications Volkswagen Taigun Skoda Kushaq Hyundai Creta Kia Seltos
  Engine 1.0-litre Turbo Petrol / 1.5-litre Turbo Petrol 1.0-litre Turbo Petrol / 1.5-litre Turbo Petrol 1.5-litre Petrol / 1.5-litre Turbo-Diesel / 1.4-litre Turbo-Petrol 1.5-litre Petrol / 1.5-litre Turbo-Diesel / 1.4-litre Turbo Petrol
  Power 114bhp / 147.5bhp 114bhp / 147.5bhp 113.4bhp / 113.4bhp / 140bhp 113.4bhp / 113.4bhp / 140bhp
  Torque 175Nm / 250Nm 175Nm / 250Nm 144Nm / 250Nm / 242.2Nm 144Nm / 250Nm / 242.2Nm
  Transmission 6-Speed Manual / 6-Speed Automatic / 7-Speed DSG 6-Speed Manual / 6-Speed Automatic / 7-Speed DSG 6-Speed Manual / iVT / 6-Speed Automatic / 7-Speed DCT 6-Speed Manual / CVT / 6-Speed iMT / 6-Speed Automatic / 7-Speed DCT
  Prices To Be Announced Rs 10.49 lakh to Rs 17.59 lakh Rs 9.99 lakh to Rs 17.70 lakh Rs 9.95 lakh to Rs 17.65
  ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

  డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

  టైగన్ ఎస్‌యూవీ మనం ఇదివరకే చెప్పుకున్నట్లుగా ఇండియా 2.0 ప్లాన్ కింద ఉన్న ఫోక్స్‌వ్యాగన్ యొక్క మొదటి ఎస్‌యూవీ. ఇది MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల భవిష్యత్తులో కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది.

  ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రివ్యూ; దేశీయ ప్రత్యర్థులకు ఎదురు నిలుస్తుందా..!!

  టైగన్ ఎస్‌యూవీ అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ కారు మంచి ప్రీమియం కారు అనుభూతిని అందిస్తుంది. ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలు అద్భుతమైనవిగా ఉన్నాయి. అయితే ఇది మార్కెట్లో సరైన ధర లభిస్తుందో లేదో చూడటానికి ఇప్పుడు అందరి దృష్టి ఫోక్స్‌వ్యాగన్ పైనే ఉంది. ఏది ఏమైనా ఇది మంచి ధర వద్ద లభించే అవకాశం ఉంటుంది. కావున ఉత్తమమైన ఎస్‌యూవీ కోసం ఎదురుచూసే వారికి టైగన్ మంచి ఎంపిక అవుతుంది.

Most Read Articles

English summary
Volkswagen taigun telugu review interiors features specs engine performance driving impressions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X