సూపర్ ఫెర్ఫామెన్స్ అందించే కొత్త Tata Tigor EV రివ్యూ వీడియో.. చూసారా!!

Tata Motors (టాటా మోటార్స్) దేశీయ మార్కెట్లో ఇటీవల కంపెనీ తన కొత్త Tata Tigor EV (టాటా టిగోర్ ఈవి) ని రూ. 11.99 లక్షల ధరతో విడుదల చేసింది. మేము ఇటీవల ఈ కొత్త Tata Tigor EV డ్రైవ్ చేసాము. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ గురించి పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.

కొత్త Tigor EV మునుపటి వెర్షన్ కంటే ప్రీమియం, పవర్‌పూల్ పవర్‌ట్రెయిన్‌తో సహా అనేక కొత్త వేరియంట్‌లతో అభివృద్ధి చేయబడింది. కొత్త Tigor EV లో XE, XM, XZ ప్లస్ మరియు XZ ప్లస్ డ్యూయల్ టోన్ వేరియంట్ ఉన్నాయి మరియు కొత్త కారు ధర రూ. 11.99 లక్షలు మరియు టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 13.14 లక్షలు.

కొత్త Tata Tigor EV యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబిడి, డ్యూయల్-వీల్ డిస్క్ బ్రేక్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్క్ అసిస్ట్, హిల్ యాసెంట్ అసిస్ట్, హిల్ డీసెంట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు రియర్ పార్కింగ్ కెమెరాతో పాటు ఇంకా చాలా ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

కొత్త Tata Tigor EV ఇప్పుడు అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. కావున మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఇది 306 కిమీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. Tata Tigor EV యొక్క మునుపటి మోడల్ ఇంతకూ ముందు ఒక చార్జితో 90 నుండి 100 కిమీ పరిధిని అందించేది. కానీ ఇప్పుడు ఇందులో ప్రవేశపెట్టిన, జిప్‌ట్రాన్ టెక్నాలజీ కారణంగా ఏకంగా దీని పరిధి 306 కిమీ వరకు పెరిగింది.

Tata Tigor ఎలక్ట్రిక్ కార్ IP67 రేటింగ్‌ కలిగిన 26 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 55 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటుంది. Tata Tigor యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది 15 amp హోమ్ సాకెట్ ద్వారా ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 8.5 గంటలు సమయం పడుతుంది.

సూపర్ ఫెర్ఫామెన్స్ అందించే కొత్త Tata Tigor EV రివ్యూ వీడియో

Tata Tigor EV డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, IP67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్, ఇంప్యాక్ట్ రెసిస్టెన్ట్ బ్యాటరీ ప్యాక్ మరియు ఓవర్ ఛార్జ్ ప్రొటక్షన్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. Tigor EV డేటోనా గ్రే మరియు టీల్ బ్లూ అనే రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

భారతీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహన విభాగంలో కొత్త Tata Tigor EV అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వెహికల్. ఇది సరసమైన ధర వద్ద అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.

భారతదేశంలో ఇంధన ధరలు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో సరసమైన ధర వద్ద అధునాతన ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ కార్ అందుబాటులో ఉండటం నిజంగా చాలా అరుదైన విషయం. అంతే కాకుండా టాటా మోటార్స్ యొక్క బ్రాండ్ పై ప్రజలకున్న నమ్మకం ఏ మాత్రం వమ్ము కాదు. ఈ కారణాల వల్ల కొత్త Tata Tigor EV మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుందని భావిస్తున్నాము. Tata Tigor EV గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Ziptron powered tata tigor ev first drive review video
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X