2021 Tata Tigor EV రివ్యూ; ఫీచర్స్, ఫెర్ఫామెన్స్ & ఫుల్ డీటైల్స్

ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన శకం ప్రారంభమయ్యింది. అంతే కాదు రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఆటోమోటివ్ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్థాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా వాహన తయారీ సంస్థలు ఇప్పటికే అద్భుతమైన ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేసి విక్రయిస్తున్నాయి.

ఇదిలా ఉండగా దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ Tata Motors (టాటా మోటార్స్) ప్రపంచ మార్కెట్లోని ఇతర వాహన సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా, ఎలక్ట్రిక్ వాహన తయారీలో తన ఉనికిని చాటుకుంటోంది. ఇందులో భాగంగానే టాటా మోటార్స్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తోంది.

2017 లో టాటా మోటార్స్ మొదటిసారిగా Tigor EV (టిగోర్ ఈవి) ని అభివృద్ధి చేసింది. అయితే Tata Motors (టాటా మోటార్స్) 10,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ సరఫరా కోసం EESL నుండి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత ఎలక్ట్రిక్ నాచ్‌బ్యాక్ స్పెషల్ ఫ్లీట్ ఆపరేటర్ల కోసం అభివృద్ధి చేయబడింది.

టాటా మోటార్స్ తర్వాత జిప్‌ట్రాన్ హై-వోల్టేజ్ ఈవి ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేసింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టాటా యొక్క ప్రయత్నం టిగోర్ EV తో ప్రారంభమైంది. దేశీయ మార్కెట్లో ఇటీవల కంపెనీ తన కొత్త Tata Tigor EV (టాటా టిగోర్ ఈవి) ని రూ. 11.99 లక్షల ధరతో విడుదల చేసింది. మేము ఇటీవల ఈ కొత్త Tata Tigor EV డ్రైవ్ చేసాము. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

Tata Tigor EV డిజైన్ & స్టైల్:

Tata Tigor EV యొక్క మొత్తం సిల్హౌట్ దాదాపు దాని అవుట్‌గోయింగ్ మోడల్ మాదిరిగానే ఉంచింది. హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ ల్యాంప్‌ల ఆకారం కూడా అదేవిధంగా ఉంటుంది. కానీ కంపెనీ యొక్క డిజైనర్లు ఈ కొత్త EV లో చిన్న చిన్న అప్డేట్స్ చేశారు. కావున ఇవన్నీ కూడా ఈ కొత్త మోడల్‌ని ప్రత్యేకంగా చూపిస్తాయి.

కొత్త Tata Tigor EV యొక్క ముందు భాగంలో టాటా లోగో గ్రిల్ మీద ఉంచబడింది. గ్రిల్ అనేది ఒక ఫ్లాట్ ప్లాస్టిక్ పీస్. గ్రిల్ కి మరియు బంపర్‌కు మధ్య స్మాల్ వెంట్ ఉంటుంది. బంపర్ మరింత దూకుడుగా కనిపించేలా రీడిజైన్ చేయబడింది. అంతే కాకుండా ట్రై-యారో ప్యాట్రిన్ గ్రిల్ మీద అలాగే ఫ్రంట్ బంపర్ మీద కనిపిస్తాయి.

కొత్త Tigor EV హెడ్‌ల్యాంప్‌లోని లో బీమ్ హాలోజన్ ప్రొజెక్టర్ ద్వారా నిర్వహించబడుతుంది, అయితే హై బీమ్ హాలోజన్ రిఫ్లెక్టర్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా హెడ్‌ల్యాంప్ కింద ఎలక్ట్రిక్ బ్లూలో పూర్తి చేసిన స్ట్రిప్ కూడా మీరు గమనించవచ్చు. గ్రిల్ మీద కనిపించే 'EV' బ్యాడ్జింగ్ మరియు సైడ్ ఫెండర్లు కూడా అదే ఎలక్ట్రిక్ బ్లూలో పూర్తయ్యాయి. క్రోమ్ స్ట్రిప్ విండోస్ కింద ఉంటాయి. అదేవిధంగా డోర్ హ్యాండిల్స్ కూడా క్రోమ్ ఎలిమెంట్‌ను పొందుతాయి.

ఇందులోని చక్రాలు ట్రై-టోన్ యూనిట్లు, గ్రే మరియు బ్లాక్ అనేవి ప్రైమరీ కలర్స్. అయితే వీటిలో నాలుగింట ఒక వంతు బ్లూ షేడ్ లో పూర్తయ్యాయి. కానీ ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనం చూసే ఈ ఫాన్సీ వీల్ బేసిక్ 4-స్పోక్ వీల్ మీద ఉంచిన ప్లాస్టిక్ వీల్ కవర్ అని తెలుస్తుంది.

ఇందులోని రూఫ్‌లైన్ వెనుక వైపుకు వాలుతూ, బూట్ తర్వాత కిందికి సాగుతుంది. ఇది నాచ్‌బ్యాక్ డిజైన్‌ను ఇస్తుంది. టెయిల్ ల్యాంప్స్ స్ప్లిట్ ఎల్ఈడీ యూనిట్లు మరియు మందపాటి క్రోమ్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడ్డాయి. మీరు దాని వెనుక రియర్ వ్యూను పొందుతారు. పైన ఫాక్స్ స్పాయిలర్ ఉంది, దానిలో ఒక LED స్టాప్ లైట్ విలీనం చేయబడింది. మీరు వెనుకవైపు టాటా, టిగోర్, EV మరియు జిప్‌ట్రాన్ బ్యాడ్జింగ్‌ వంటివి గమనించవచ్చు. మొత్తానికి ఈ కొత్త టిగోర్ EV దాని పాత మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

కాక్‌పిట్ మరియు ఇంటీరియర్:

మీరు Tata Tigor EV లోపలికి అడుగు పెట్టగానే అద్భుతమైన క్యాబిన్ స్వాగతం పలుకుతుంది. టాటా యొక్క కొత్త డిజైన్ మరియు సీట్లపై ట్రై-యారో ఎంబ్రాయిడరీ రూపంలో క్యాబిన్ అంతటా కనిపిస్తుంది. సీట్లు బ్లాక్‌తో అలంకరించబడి ఉంటాయి. ఇందులోని డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానెల్‌లు అన్నీ డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌ను పొందుతాయి.

ఇందులోని ఏసీ వెంట్స్ ఎలక్ట్రిక్ బ్లూలో ఫినిష్ అవ్వడం వల్ల మొదట మీ దృష్టిని ఆకర్షిస్తుంది. సెంట్రల్ AC వెంట్స్ కింద ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉంది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు కొన్ని ఇతర స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఎంపికలతో కూడిన 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్.

Tata Tigor EV క్లైమేట్ కంట్రోల్స్ మరియు పవర్ ఫుల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టం కలిగి ఉంటుంది. దీని కోసం కంట్రోల్స్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కింద ఉంచబడ్డాయి. క్లైమేట్ కంట్రోల్స్ మరియు AC-రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లో ప్రదర్శించబడుతుంది, అంతే కాకుండా వీటిని టచ్‌స్క్రీన్ ద్వారా కూడా నియంత్రించవచ్చు.

సెంటర్ కన్సోల్ చాలా సులభం. ఇది గేర్-సెలెక్టర్ నాబ్, క్యూబిహోల్, కప్ హోల్డర్స్ మరియు 12వి పవర్ అవుట్‌లెట్ కలిగి ఉంది. ఇందులోని స్టీరింగ్ వీల్ ఫాన్సీగా కనిపిస్తుంది. ఇది స్పోర్టి మరియు చంకీ ఫీల్ కలిగిస్తుంది.

ఇన్స్ట్రుమెంటేషన్ పూర్తిగా డిజిటల్ క్లస్టర్ ద్వారా నిర్వహించబడుతుంది, ఇది వేరియస్ పారామీటర్స్ ప్రదర్శిస్తుంది. మధ్యలో, టిగోర్ EV ఒక LCD స్క్రీన్‌తో వస్తుంది. ఇది గేర్ పొజిషన్, బ్యాటరీ స్టేట్-ఆఫ్-ఛార్జ్, రిమైనింగ్ రేంజ్, టైమ్, టెంపరేచర్ మరియు ఓడోమీటర్‌ను ప్రదర్శిస్తుంది.

వెనుక సీటు కూడా అదే డిజైన్ లాంగ్వేజ్ పొందుతుంది. సీటుపై ట్రై-యారో నమూనాలు కనిపిస్తాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఫోల్డబుల్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఇన్బిల్ట్ కప్‌హోల్డర్‌లను కూడా పొందుతుంది.

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్:

Tata Motors (టాటా మోటార్స్) కార్లు సాధారణంగా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అదేవిధంగా కొత్త Tata Tigor EV కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులోని సస్పెన్షన్ డ్రైవర్‌ని చాలా సంతోసించేలా చేస్తుంది. ఇందులోని క్యాబిన్ విశాలంగా ఉంటుంది. ఇందులోని ముందు సీట్లు అనుకూలంగా ఉన్నాయి.

వెనుక సీట్ల విషయానికి వస్తే, ఇక్కడ తగినంత క్నీ రూమ్ అందుబాటులో ఉంటుంది. ఇంద్దులో వాలుగా ఉన్న రూఫ్‌లైన్ ఉన్నప్పటికీ, హెడ్‌రూమ్ చాలా బాగుంది. కానీ మేము మరింత అండర్ తై సపోర్ట్ ఆశిస్తున్నాము. మొత్తానికి టిగోర్ EV చాలా అనుకూలంగా ఉంది.

ఈ కారులో అనేక క్యూబిహోల్స్ ఉన్నాయి. ముందు డోర్స్ రెండు హాఫ్ లీటర్ బాటిల్స్ ఉంచడానికి అనుకూలంగా ఉంది, అదేవిధంగా వెనుక డోర్ కూడా 1 లీటర్ బాటిల్‌ ఉంచడానికి తగిన స్థలం కలిగి ఉంది.

Tata Tigor EV లో దాదాపు 316 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇది చాలా విశాలమైనదనే చెప్పాలి. అయితే, మాకు కొంచెం ఆందోళన కలిగించే రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. అదేమిటంటే స్పెర్ వీల్ ఫుట్‌వెల్‌లో కూర్చోదు, కానీ బూట్‌లో ఉంచబడుతుంది. ఈ కారణంగా బూట్ లో కొంత స్పేస్‌ ఇది ఆక్రమిస్తుంది. కావున అదనపు బూట్ స్పేస్ కోసం, వెనుక సీటును ఫోల్డ్ చేసే అవకాశం కూడా లేదు.

మోటార్ పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

కొత్త Tata Tigor EV ఇప్పుడు చాలా మెరుగుపడింది. పాత టాటా టిగోర్ EV ఖచ్చితంగా ఒక ప్రాక్టికల్ కారు కానీ ఆచరణ సాధ్యం కాని పనితీరుతో వచ్చింది. వేగం మరియు పరిధి రెండూ పరిమితం చేయబడ్డాయి. కానీ 2021 టిగోర్ EV సరికొత్త స్థాయిలో ఉంది. టిగోర్ ఇప్పుడు జిప్‌ట్రాన్ హై-వోల్టేజ్ EV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంది.

Tata Tigor ఎలక్ట్రిక్ కార్ IP67 రేటింగ్‌ కలిగిన 26 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. టాటా మోటార్స్ ఈ బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తుంది. ఈ బ్యాటరీ ముందు ఉంచిన ఎలక్ట్రిక్ మోటార్‌కు శక్తినిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 55 కిలో వాట్ పవర్ అవుట్‌పుట్ కలిగి ఉంది, ఇది దాదాపు 72 బిహెచ్‌పి కి అనుగుణంగా ఉంటుంది. అయితే, 172 ఎన్ఎమ్ వద్ద, టిగోర్ EV ని డ్రైవ్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది..

కొత్త Tata Tigor EV యొక్క బ్రేక్ పెడల్ మీద నొక్కి పట్టి, స్టార్టర్ బటన్‌ని నొక్కినప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. కానీ మీరు బ్రేక్ మీద కాలు తీసే వరకు ముందుకు సాగదు. అయితే ప్రారంభించిన తరువాత చాలా నిశ్శబ్దంగా ముందుకు వెళ్తుంది. టాటా టిగోర్ EV యొక్క వేగం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 80km/h వద్ద మొదటి స్పీడ్ వార్ణింగ్ వచ్చే వరకు మీరు ఎంత వేగంగా వెళ్తున్నారో మీకు నిజంగా తెలియదు.

100 కిమీ వేగంలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ పైకి వస్తుంది, ఇది 115 కిమీ వేగం తర్వాత కొంచెం నెమ్మదిస్తుంది. టాటా టిగోర్ ఇవి గంటకు 121 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని మరింత ముందుకు నెట్టడం కష్టం. స్పోర్ట్స్ మోడ్‌లో, యాక్సలరేషన్ చాలా వేగంగా ఉంటుంది.

Tata Tigor EV స్టీరింగ్ మరియు సస్పెన్షన్ రెండూ చాలా చక్కగా ట్యూన్ చేయబడ్డాయి. బ్యాటరీ ప్యాక్ యొక్క అదనపు బరువును నిర్వహించడానికి సస్పెన్షన్ కొంచెం గట్టిగా చేసినట్లు కనిపిస్తోంది. తక్కువ వేగంతో స్టీరింగ్ చక్కగా మరియు తేలికగా అనిపిస్తుంది కానీ స్పీడోమీటర్‌లోని నంబర్స్ పెరిగేకొద్దీ స్టీరింగ్ వీల్ బరువు పెరుగుతుంది.

కొంచెం గట్టి సస్పెన్షన్‌తో ఎగుడుదిగుడుగా రైడ్ వస్తుంది, టిగోర్ EV విషయంలో కూడా ఇదే జరుగుతుంది. రహదారిపై గుంతలు మరియు చిన్న అవాంతరాలు కూడా క్యాబిన్ లోపల అనుభూతి చెందే విధంగా చేస్తాయి. అయితే ముగ్గురు లేదా నలుగులు సీట్లను ఆక్రమించుకుంటే ఇది ఇనుమడిస్తుంది.

Tata Tigor EV యొక్క బ్రేకింగ్ సిస్టం చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రేకింగ్ చాలా చక్కగా నిర్వహించబడుతుంది. అయితే, బ్రేక్‌లు కొంత శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఎలక్ట్రిక్ మోటార్‌ నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఈ శబ్దం క్యాబిన్ లోపల స్పష్టంగా వినిపిస్తుంది. మొత్తం మీద కొత్త టాటా టిగోర్ EV మంచి రైడింగ్ అనుభవాన్ని అందించింది.

టాటా టిగోర్ EV ఛార్జింగ్:

Tata Tigor EV ని ఛార్జ్ చేయడం కూడా చాలా సులభం. ఎందుకంటే ఛార్జింగ్ పోర్ట్ సులభంగా అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా కాకుండా ఛార్జింగ్ కేబుల్ భారీగా ఉన్నప్పుడు, దీన్ని ఉపయోగించడం ఇంకా సులభం అవుతుంది. ఆన్‌బోర్డ్ ఛార్జింగ్ సిస్టమ్ ఉపయోగించినప్పుడు మరియు టిగోర్ EV వాల్ సాకెట్‌ ఉపయోగించి, బ్యాటరీని దాదాపు 8.5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.

టాటా పవర్ యొక్క EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కొన్ని టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లు మరియు మరికొన్ని ఇతర ప్రదేశాలలో ఇన్‌స్టాల్ చేయబడిన డిసి ఫాస్ట్ ఛార్జర్‌ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే, బ్యాటరీ ఛార్జింగ్ సైకిల్ పై ఫాస్ట్ ఛార్జర్‌ ప్రభావం చూపుతున్నందున ఈ ఛార్జర్‌లను రోజూ ఉపయోగించమని మేము సూచించము. కానీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ ఫాస్ట్ ఛార్జర్‌లను ఉపయోగించాలని టాటా మోటార్స్ సూచిస్తుంది. వినియోగదారులు దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

టాటా టిగోర్ EV రేంజ్:

కొత్త Tata Tigor EV యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఇది పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీపై 306 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ARAI-సర్టిఫైడ్ చేయబడింది. అయితే వాస్తవ ప్రపంచ పరిస్థితులలో, టిగోర్ EV 200 కి.మీ ఉంచి 210 కిలోమీటర్లు పరిధిని అందిస్తుంది. అయితే ఈ పరిధి డ్రైవింగ్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది.

Tata Tigor EV ని స్పోర్ట్స్ మోడ్‌ని ఉపయోగించి మాత్రమే డ్రైవ్ చేస్తే, పరిధి భారీగా తగ్గుతుంది. స్పోర్ట్స్ మోడ్‌లో మాత్రమే డ్రైవ్ చేస్తే టాటా టిగోర్ EV పూర్తిగా ఛార్జ్ చేయబడిన 130 కిమీ నుంచి 140 కిలోమీటర్ల పరిధిని మాత్రమే అందించగలదు.

సేఫ్టీ ఫీచర్స్ మరియు కీ ఫీచర్స్:

టాటా మోటార్స్ ఎల్లప్పుడూ సురక్షితమైన కార్లను తయారు చేస్తుంది. ఇందులో భాగంగానే కొత్త Tata Tigor EV కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో 4-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. Tata Tigor EV లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో

  • డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు
  • ఏబీఎస్ విత్ ఈబిడి
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
  • IP67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్
  • ఇంప్యాక్ట్ రెసిస్టెన్ట్ బ్యాటరీ ప్యాక్
  • ఓవర్ ఛార్జ్ ప్రొటక్షన్
  • వేరియంట్స్ అండ్ ప్రైస్:

    Tata Tigor EV నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

    అవి:

    • టిగోర్ EV XE: రూ. 11.99 లక్షలు
    • టిగోర్ EV XM: రూ. 12.49 లక్షలు
    • టిగోర్ EV XZ+: రూ. 12.99 లక్షలు
    • టిగోర్ EV XZ+ డ్యూయల్ టోన్: రూ. 13.14 లక్షలు
    • కలర్స్:

      Tata Tigor EV కేవలం రెండు కలర్ ఆప్సన్స్ లో మాత్రమే విక్రయించబడుతుంది.

      అవి:

      1. డేటోనా గ్రే
      2. టీల్ బ్లూ

      డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

      భారతీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహన విభాగంలో కొత్త Tata Tigor EV అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వెహికల్. ఇది సరసమైన ధర వద్ద అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.

      భారతదేశంలో ఇంధన ధరలు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో సరసమైన ధర వద్ద అధునాతన ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ కార్ అందుబాటులో ఉండటం నిజంగా చాలా అరుదైన విషయం. అంతే కాకుండా టాటా మోటార్స్ యొక్క బ్రాండ్ పై ప్రజలకున్న నమ్మకం ఏ మాత్రం వమ్ము కాదు. ఈ కారణాల వల్ల కొత్త Tata Tigor EV మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
2021 tata tigor ev review in telugu interiors features specs engine performance driving impressions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X