2022 MG ZS EV: మొన్న విడుదలైంది.. అప్పుడే అమ్ముడైపోయింది, మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

ఇటీవల కాలంలో భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఎంజి మోటార్స్ (MG Motors) యొక్క '2022 ఎంజి జెడ్ఎస్ ఈవి' (2022 MG ZS EV) SUV విడుదల చేసింది విషయం తెలిసిందే, అయితే కంపెనీ యొక్క ఈ కొత్త అప్డేటెడ్ ఎలక్ట్రిక్ SUV యొక్క బుకింగ్స్ అప్పుడే నిలిపివేయబడ్డాయి. దీనికి ప్రధాన కారణం కంపెనీ ఇప్పటికే మొత్తం యూనిట్లను విక్రయించింది. కావున ఈ కొత్త SUV కోసం బుకింగ్స్ ఇక వచ్చే సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

2022 MG ZS EV: మొన్న విడుదలైంది.. అప్పుడే అమ్ముడైపోయింది, మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

ఎంజి మోటార్ ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎక్సైట్ మరియు ఎక్స్క్లూసివ్ వేరియంట్లు. ఇందులో ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 21.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ. 25.88 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 MG ZS EV: మొన్న విడుదలైంది.. అప్పుడే అమ్ముడైపోయింది, మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

కొత్త MG ZS EV ఫేస్‌లిఫ్టెడ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దాదాపు ఆస్టర్‌కి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV కొత్త LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ సిగ్నేచర్‌లతో సన్నగా ఉండే హెడ్‌ల్యాంప్‌లు మరియు LED టెయిల్-ల్యాంప్‌లు, కూడా ఆస్టర్‌తో సమానంగా ఉంటాయి. ఇది కొత్త ఫ్రంట్ బంపర్, కొత్త బాడీ కలర్, ట్రెడిషినల్ గ్రిల్ వంటివి పొందుతుంది, ఛార్జింగ్ పోర్ట్ ఈ గ్రిల్‌లో ఉంటుంది.

2022 MG ZS EV: మొన్న విడుదలైంది.. అప్పుడే అమ్ముడైపోయింది, మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

ఈ కొత్త SUV యొక్క వెనుక భాగంలో LED టెయిల్ లైట్లు మరియు రియర్ బంపర్ వంటివి ఇవ్వబడ్డాయి. అయితే దీని ప్రొఫైల్ పెద్దగా మార్చబడలేదు, కానీ ఇందులో 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించబడ్డాయి. దాని ఫ్రంట్ ఫెండర్‌లో ఎలక్ట్రిక్ బ్యాడ్జ్ ఇవ్వబడింది. కొత్త ZS EV 4 ఎక్స్టీరియర్ కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి ఫెర్రిస్ వైట్, కరెంట్ రెడ్, అషెన్ సిల్వర్ మరియు సేబుల్ బ్లాక్ కలర్స్.

2022 MG ZS EV: మొన్న విడుదలైంది.. అప్పుడే అమ్ముడైపోయింది, మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

ఇక ఈ కొత్త SUV లోని ఇంటీరియర్ విషయానికి వస్తే, దాని డాష్‌బోర్డ్ అలాగే ఉంచబడుతుంది, అయితే దీనికి చాలా పరికరాలు జోడించబడతాయి. ఇందులోని చాలా ఫీచర్స్ చాలా వరకు MG ఆస్టర్ నుండి తీసుకోబడతాయి. ఇందులో 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో కొత్త ఫాక్స్ కార్బన్ ఫైబర్ ట్రిమ్ టాప్ వేరియంట్‌లో టచ్‌స్క్రీన్ చుట్టూ ఇవ్వబడుతుంది.

2022 MG ZS EV: మొన్న విడుదలైంది.. అప్పుడే అమ్ముడైపోయింది, మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

అంతే కాకూండా ఇందులో వాయిస్ కమాండ్‌తో కంట్రోల్ చేయగలిగే 75కి పైగా ఐ-స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) ఫంక్షన్ మరియు 360 డిగ్రీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది MG లోగో క్రింద ఉంచబడుతుంది. ఇందులో 7-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డిజిటల్ బ్లూటూత్ కీ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, TPMS, ESC వంటి ఇతర ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి.

2022 MG ZS EV: మొన్న విడుదలైంది.. అప్పుడే అమ్ముడైపోయింది, మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త ZS EV దాని పెట్రోలుతో నడిచే MG ఆస్టర్ SUV కి దగ్గరగా ఉండే కాస్మెటిక్ అప్డేట్స్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. అయితే ఈ 2022 MG ZS EV 461 కిమీ పరిధిని అందించే పెద్ద బ్యాటరీని పొందుతుంది. ఈ కొత్త SUV ఎక్కువ పరిధిని అందించడం వల్ల ఇప్పుడు ఎక్కువమంది కొనుగోలుదారులు దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

2022 MG ZS EV: మొన్న విడుదలైంది.. అప్పుడే అమ్ముడైపోయింది, మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

కొత్త ZS EV ఫేస్‌లిఫ్ట్‌లో ఇప్పుడు అతిపెద్ద అప్‌డేట్ ఇందులోని బ్యాటరీ ప్యాక్. ఇందులో మునుపటి 44.5 kWh బ్యాటరీ ప్యాక్ స్థానంలో 50.3kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. కావున ఈ బ్యాటరీ ఈ కొత్త SUV ని 461 కిమీ ప్రయాణించేలా చేస్తుంది. అయితే మునుపటి బ్యాటరీ 419 కిమీ పరిధిని అందిస్తుంది. అంటే ఇప్పుడు మునుపటి మోడల్ కంటే కూడా ఈ కొత్త మోడల్ 42 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఇది నిజంగా కస్టమర్లకు శుభవార్త అనే చెప్పాలి.

2022 MG ZS EV: మొన్న విడుదలైంది.. అప్పుడే అమ్ముడైపోయింది, మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

కొత్త MG ZS EV ఇప్పుడు 176 బిహెచ్‌పి పవర్ మరియు 353 ఎన్ఎమ్ టార్క్ అందించే ఫ్రంట్-యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతోంది. ఇది కూడా దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ. ఈ కొత్త అప్డేటెడ్ SUV కేవలం 8.5 సెకన్లలో 0-100 కిమీ/గం వేగవంతం అవుతుంది.

2022 MG ZS EV: మొన్న విడుదలైంది.. అప్పుడే అమ్ముడైపోయింది, మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

2022 ఎంజి జెడ్ఎస్ ఈవి (2022 MG ZS EV) రాబోయే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఫేస్‌లిఫ్ట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి, కొత్త ZS EV ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వెహికల్ అవుతుంది.

Most Read Articles

English summary
2022 mg zs ev sold out for year 2022 features range specification details
Story first published: Friday, March 11, 2022, 11:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X