మార్కెట్లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ (Jeep Compass Night Eagle) విడుదల: ధర రూ.21.95 లక్షలు!

ఐకానిక్ అమెరికన్ ఎస్‌యూవీ బ్రాండ్ జీప్ (Jeep) భారత విపణిలో విక్రయిస్తున్న కంపాస్ (Compass) ఎస్‌యూవీలో నైట్ ఈగల్‌ (Night Eagle) పేరిట ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. జీప్ కంపాస్ నైట్ ఈగల్ (Jeep Compass Night Eagle) పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. దేశీయ మార్కెట్లో మాన్యువల్ డీజిల్ వెర్షన్ ధర రూ. 21.95 లక్షలుగా ఉంటే, ఆటోమేటిక్ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 22.75 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

మార్కెట్లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ (Jeep Compass Night Eagle) విడుదల: ధర రూ.21.95 లక్షలు!

జీప్ కంపాస్ నైట్ ఈగల్ పేరుకి తగినట్లుగానే పూర్తిగా బ్లాక్ కలర్ థీమ్‌లో ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీలో గ్రిల్, గ్రిల్ రింగ్‌లు, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్, సైడ్ మిర్రర్లు మరియు ఫాగ్ ల్యాంప్ బెజెల్స్ అన్నీ కూడా గ్లోస్-బ్లాక్ ఫినిషింగ్‌ లో ఉంటాయి. రూఫ్ మాత్రం భిన్నంగా పెయింట్ చేయబడి, ఎందుకంటే ఇది డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్ ను కలిగి ఉంటుంది కాబట్టి. స్టాండర్డ్ జీప్ కంపాస్‌కి మరియు మరియు నైట్ ఈగల్ ఎడిషన్ జీప్ కంపాస్‌కి ఉండే ప్రధానమైన ఎక్స్టీరియర్ మార్పులు ఇవే.

మార్కెట్లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ (Jeep Compass Night Eagle) విడుదల: ధర రూ.21.95 లక్షలు!

కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ ఇంటీరియర్స్ ను గమనిస్తే, క్యాబిన్ మొత్తం ముదురు నలుపు రంగులో డిజైన్ చేయబడి ఉంటుంది. ఇందులో లైట్ టంగ్‌స్టన్ స్టిచింగ్‌తో కూడిన సీట్లు, ప్యూర్ బ్లాక్ క్లాత్/వినైల్ అప్‌హోలెస్ట్రీ, డోర్ ట్రిమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌పై బ్లాక్ వినైల్ ఇన్‌సర్ట్‌లు ఉంటాయి. మొత్తం ఇంటీరియర్‌లో ఎక్కువగా పియానో ​​బ్లాక్ ఫినిషింగ్స్ కనిపిస్తాయి.

మార్కెట్లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ (Jeep Compass Night Eagle) విడుదల: ధర రూ.21.95 లక్షలు!

జీప్ కంపాస్ నైట్ ఈగల్ టాప్-స్పెక్ వేరియంట్ లో (ట్రైల్‌హాక్ కాకుండా) 7 ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌ తో కూడిన 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ట్రైల్‌హాక్ యొక్క నైట్ ఈగల్ వేరియంట్‌లో డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అలాగే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆల్-స్పీడ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

మార్కెట్లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ (Jeep Compass Night Eagle) విడుదల: ధర రూ.21.95 లక్షలు!

జీప్ కంపాస్ నైట్ ఈగల్ (Jeep Compass Night Eagle) పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని పెద్ద 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 3750 ఆర్‌పిఎమ్ వద్ద 168 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ‌తో జతచేయబడి ఉంటుంది.

మార్కెట్లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ (Jeep Compass Night Eagle) విడుదల: ధర రూ.21.95 లక్షలు!

ఇక పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 1.4 లీటర్ మల్టీఎయిర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 161 బిహెచ్‌పి శక్తిని మరియు 2,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లభించదు.

మార్కెట్లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ (Jeep Compass Night Eagle) విడుదల: ధర రూ.21.95 లక్షలు!

జీప్ కంపాస్‌లో కంపెనీ మరింత ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ అయిన కంపాస్ ట్రైల్‌హాక్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసిన సరిగ్గా రెండు నెలల తర్వాత కంపెనీ ఈ నైట్ ఈగల్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ కోసం మార్కెట్లో 4 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. భారత మార్కెట్లో ఈ మోడల్‌కు సంబంధించి మొదటి బ్యాచ్ కార్లు కేవలం రెండు నెలల్లోనే పూర్తిగా అమ్ముడైపోయాయి.

కొత్త జీప్ కంపాస్ నైట్ ఈగల్ విడుదల సందర్భంగా, జీప్ బ్రాండ్ - ఇండియా హెడ్ నిపున్ జె మహాజన్ మాట్లాడుతూ, జీప్ కంపాస్ నైట్ ఈగల్ దాని సరికొత్త ఆల్-బ్లాక్ స్టైలింగ్‌తో ఇప్పుడు మరింత బోల్డ్‌గా మరియు చాలా అందంగా కనిపిస్తుందని, ఈ మోడల్‌కి అధిక డిమాండ్ ఉందని, జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసిన రెండు నెలల్లోనే పూర్తిగా విక్రయించబడిందని, ట్రైల్‌హాక్ మాదిరిగానే ఈ నైట్ ఈగిల్ ఎడిషన్ పట్ల కూడా కొనుగోలుదారులు అదే ఉత్సాహాన్ని చూపగలరని తాము భావిస్తున్నామని అన్నారు.

మార్కెట్లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ (Jeep Compass Night Eagle) విడుదల: ధర రూ.21.95 లక్షలు!

కొత్త Jeep Compass Trailhawk గురించి క్లుప్తంగా..

జీప్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న కొత్త 2022 జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ (2022 Jeep Compass Trailhawk) ఎడిషన్ విషయానికి వస్తే, మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 30.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ధర దాని స్టాండర్డ్ కంపాస్ టాప్-స్పెక్ మోడల్ అయిన ఎస్ వేరియంట్ ధర కంటే దాదాపు రూ. 1.38 లక్షలు ఎక్కువగా ఉంటుంది. కంపెనీ ఈ మోడల్‌ను ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ప్రియుల కోసం మరిన్ని అదనపు ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో డిజైన్ చేసింది.

మార్కెట్లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ (Jeep Compass Night Eagle) విడుదల: ధర రూ.21.95 లక్షలు!

కొత్త జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఎడిషన్‌లో కొత్త హెడ్‌ల్యాంప్‌లు, విభిన్నమైన ఫ్రంట్ గ్రిల్‌, షార్ప్‌గా కనిపించే బంపర్‌లు, సరికొత్త బోనెట్ డెకాల్ (బానెట్ పై స్టిక్కర్), 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, 225/65 R17 సెక్షన్ టైర్లు, రియర్ రెడ్ హుక్, స్కఫ్ ప్లేట్ మరియు ఫెండర్‌లపై కొత్త ట్రయల్ రేటింగ్ బ్యాడ్జ్ మార్పులు కనిపిస్తాయి. దీని ఇంటీరియర్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. అయితే, ఇందులోని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ స్వల్పంగా అప్‌డేట్ చేయబడి ఉంటుంది. సీట్లపై కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్ మరియు సీట్లపై ఉన్న 'ట్రైల్‌హాక్' లోగోలు దీనిని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 19, 2022, 9:44 [IST]
English summary
After compass trailhawk now jeep india laucnhes compass night eagle prices and features
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+