ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన BYD Atto 3: ధర రూ. 33.99 లక్షలు

భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ రోజురోజుకి బాగా అభివృద్ధి చెందుతోంది,ఇందులో భాగంగానే చైనా కార్ తయారీ సంస్థ BYD ఇప్పటికే దేశీయ మార్కెట్లో తన కొత్త 'ఆటో 3' (Atto 3) ఆవిష్కరించింది.

కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ని అధికారికంగా ఆవిష్కరించినప్పటికీ ధరలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు, అయితే ఈ రోజు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV యొక్క ధరలను వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందిన ATTO 3 లాంచ్

విడుదలకుముందే గొప్ప అంచనాలతో దూసుకెళ్లిన BYD ATTO 3 ఇప్పటికే సేఫ్టీలో అత్యంత సురక్షితమైన SUV గా 5 స్టార్ రేటింగ్ పొందగలిగింది. అయితే కంపెనీ ఈ ఆధునిక ఎలక్ట్రిక్ SUV ని రూ. 33.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వద్ద అందుబాటులోకి తీసుకువచ్చింది.

BYD కంపెనీ ఇప్పటికే ATTO 3 కోసం 2022 అక్టోబర్ 11 నుంచి బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ SUV కోసం ఇప్పటికే 1,500 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. ఈ SUV బుక్ చేసుకోవాలనుకే కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభమవుతాయి.

BYD Atto 3

BYD ATTO 3 మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి బౌల్డర్ గ్రే, పార్కర్ రెడ్, స్కీ వైట్ మరియు సర్ఫ్ బ్లూ కలర్స్, ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

BYD ATTO 3 మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV ముందు భాగంలో BYD అక్షరాలతో కూడిన సిల్వర్ గ్రిల్‌ ఉంటుంది, దానికి కింది భాగంలో Atto 3 అనేది ఉంటుంది. అంతే కాకుండా ఇందులో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌తో కూడా సొగసైన హెడ్‌లైట్‌ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచెస్ ఫైవ్ స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు సి-పిల్లర్‌పై ప్రత్యేకమైన సిల్వర్ ఫినిషింగ్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ మరియు పెద్ద అక్షరాలతో కూడిన 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' ఉన్నాయి.

BYD Atto 3

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఒక పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింథటిక్ లెదర్ అపోల్స్ట్రే, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు మరియు 5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త BYD అటో 3 ఎలక్ట్రిక్ SUV లోని ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్ 201 హెచ్‌పి పవర్ మరియు 310 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పెద్ద 60.48 kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది, కావున ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 521 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా పొందుతుంది. ఈ SUV కేవలం 7.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్లవరకు వేగవంతం అవుతుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే, BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు 80 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 50 నిమిషాల్లో 0 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. అదే సమయంలో టైప్ 2 AC ఛార్జర్‌ని ఉపయోగించి, బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. కంపెనీ ఈ SUV కొనుగులుదారులకు 7kW AC హోమ్ ఛార్జర్‌తో పాటు 3kW AC పోర్టబుల్ ఛార్జింగ్ బాక్స్‌ వంటి వాటిని కూడా అందిస్తుంది.

ఇటీవల BYD Atto 3 కి నిర్వహించిన యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. ఇందులో ఫ్రంట్ మరియు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతే కాకుండా బెల్ట్ ప్రిటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, ఐసోఫిక్స్, సీట్‌బెల్ట్ రిమైండర్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్పీడ్ అసిస్టెన్స్ మరియు లేన్ అసిస్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. BYD ATTO 3 క్రాష్ టెస్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న చైనా బ్రాండ్ BYD Atto 3 ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఇది భారతీయ విఫణిలో MG ZS EV, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్‌ వంటివాటితో పాటు టాటా నెక్సాన్ EV కి కూడా ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 14, 2022, 12:52 [IST]
English summary
Byd atto 3 ev launched in india at rs 33 99 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+