చైనా బ్రాండ్ అయినప్పటికీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన BYD Atto 3.. త్వరలో భారత్‌లో విడుదల

చైనా కార్ తయారీ సంస్థ BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) దేశీయ మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ SUV 'ఆటో 3' (Atto 3) ని అధికారికంగా ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఈ SUV ధరలను వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. అంతకు ముందే ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV క్రాష్ టెస్ట్ లో అత్యంత సురక్షితమైనదిగా 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన చైనా కార్.. త్వరలో భారత్‌లో విడుదల

ఇటీవల BYD Atto 3 కి నిర్వహించిన యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. ఈ టెస్ట్ లో లెఫ్ట్ హ్యాండ్ మోడల్ టెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది రైట్ హ్యాండ్ మోడల్‌కు కూడా వర్తిస్తుంది.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన చైనా కార్.. త్వరలో భారత్‌లో విడుదల

BYD Atto 3 యొక్క బేస్ వేరియంట్ ని యూరో NCAP క్రాష్ టెస్ట్‌ లో టెస్ట్ చేయడం జరిగింది. కావున ఇందులో ఫ్రంట్ మరియు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతే కాకుండా బెల్ట్ ప్రిటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, ఐసోఫిక్స్, సీట్‌బెల్ట్ రిమైండర్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్పీడ్ అసిస్టెన్స్ మరియు లేన్ అసిస్ట్ సిస్టమ్ వంటివి కూడా ఉన్నాయి.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన చైనా కార్.. త్వరలో భారత్‌లో విడుదల

అడల్ట్ సేఫ్టీ విషయంలో (పెద్దల భద్రతలో) BYD Atto 3 ఎస్‌యువి 38 పాయింట్లకు గాను 34.7 పాయింట్లను స్కోర్ చేసింది. మొత్తమ్ మీద పెద్దల భద్రత విషయంలో 91% సేఫ్టీ ఉందని దీని ద్వారా తెలుస్తుంది. అయితే ఇందులో డ్రైవర్ మొండెం బలహీనమైన రక్షణను పొందుతుందని తెలిసింది.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన చైనా కార్.. త్వరలో భారత్‌లో విడుదల

ఇక పిల్లల సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 49 పాయింట్లకు గానూ 44 పాయింట్లు సాధించింది. మొత్తం మీద పిల్లల భద్రతలో 89% సేఫ్టీ ఉందని నిర్దారించబడింది. ఇందులో అమర్చబడి డమ్మీ ఛైల్డ్స్ ఇద్దరికీ కూడా మంచి భద్రత కల్పించబడుతుంది.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన చైనా కార్.. త్వరలో భారత్‌లో విడుదల

కారులో ఉన్న వ్యక్తుల భద్రతలు మాత్రమే కాకుండా రోడ్డుపైన నడిచే పాదాచారాలకు కూడా హాని కలిగించకుండా ఉండటానికి ఇందులో కొన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. పాదచారుల భద్రత విషయంలో 69 శాతం సేఫ్టీ ఉందని నిర్దారించబడింది. ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) సిస్టమ్ ఆన్‌బోర్డ్ వంటివి ఇందులో ఉండటం వల్ల పాదాచారులు కూడా ఎక్కువ హాని జరిగే అవకాశం ఉండదు.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన చైనా కార్.. త్వరలో భారత్‌లో విడుదల

సేఫ్టీ అసిస్ట్ లో కూడా BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు 74 శాతం స్కోర్ చేసింది. వెహికల్ లేన్ నుండి బయటకు పోతున్నప్పుడు దాని మార్గాన్ని సరి చేయడం ద్వారా లేన్ సపోర్ట్ సిస్టమ్ బాగా పనిచేసింది. ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) తో కార్ టు కార్ రియాక్షన్‌లు చాలా పటిష్టంగా ఉన్నాయని గుర్తించబడింది.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన చైనా కార్.. త్వరలో భారత్‌లో విడుదల

ఇదిలా ఉండగా కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ కారు 'ఆటో 3' (Atto 3) కోసం బుకింగ్స్ స్వీకరించాడా కూడా ప్రారంభించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న మొదటి 500 మంది కస్టమర్లకు 2023 జనవరి నాటికి డెలివరీ చేయనున్నట్లు కూడా కంపెనీ తెలిపింది.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన చైనా కార్.. త్వరలో భారత్‌లో విడుదల

BYD అటో 3 చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌ ప్లాంట్‌లో అసెంబుల్ చేయబడుతుంది. 2023 సంవత్సరంలో కంపెనీ ఏకంగా 15,000 అటో 3 కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం కంపెనీ కావాల్సిన సన్నాహాలు కూడా సిద్ధం చేసుకుంటోంది. ఈ కొత్త SUV ధరలు ఇంకా వెల్లడించనప్పటికీ ఇది రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య వుండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన చైనా కార్.. త్వరలో భారత్‌లో విడుదల

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలుదారులు ఆధునిక డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన వాహనాలను మాత్రమే కాదు, ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ 5 స్టార్ రేటింగ్ ఉన్న వాహనాలను మరింత డిమాండ్ ఎక్కువ. కావున BYD కంపెనీ యొక్క 'అటో 3' సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందటం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Byd atto 3 gets 5 star safety rating in euro ncap crash test details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X