దగ్గరపడుతున్న లాంచ్ డేట్.. అప్పుడే డీలర్షిప్ చేరుకుంటున్న 'సిట్రోయెన్ సి3'
ప్రముఖ ప్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'సిట్రోయెన్' (Citroen) భారతీయ మార్కెట్ కోసం తయారు చేస్తున్న ఎస్‌యూవీ 'సి3' గురించి ఇప్పటికే చాలా సమాచారం వెల్లడించింది. అయితే ధరలను మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కంపెనీ ఈ ఎస్‌యూవీ ధరలను ఈ నెల 20 న వెల్లడించనుంది.
సిట్రోయెన్ కంపెనీ తన సి3 ఎస్‌యూవీని ఇంకా దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే డీలర్‌షిప్‌లను చేరుకోవడం ప్రారంభించింది. ఇక ఈ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి కేవలం 4 రోజుల సమయం మాత్రమే ఉంది.

సిట్రోయెన్ కంపెనీ ఈ ఎస్‌యూవీ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున ఈ ఎస్‌యూవీ కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు ముందస్తుగా రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి.

కొత్త సిట్రోయెన్ సి3 అనేది 2 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. అవి లైవ్ మరియు ఫీల్ వేరియంట్స్. సిట్రోయెన్ సి3 భారతదేశంలో ఉత్పత్తి కానున్న మేడ్-ఇన్-ఇండియా ప్రోడక్ట్ కానుంది. ఎందుకంటే ఇది భారతదేశంలో ఉత్పత్తి కానున్న సిట్రోయెన్ కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి. ఇది 2021 సెప్టెంబర్ నెలలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టబడింది. అయితే ఇప్పుడు భారతీయ రోడ్లపైన తిరగడానికి సిద్ధంగా ఉంది.

సిట్రోయెన్ సి3 'కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్' (CMP) పై నిర్మించబడుదుతోంది. ఈ డిజైన్ ప్లాట్‌ఫారమ్ భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మరింత సరసమైనదిగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కావున దీని ధర కూడా కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది.

సిట్రోయెన్ సి3 ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా కంపెనీ దీనిని డ్యూయల్ టోన్ రూఫ్ టాప్ తో ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది, కావున ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఈ ఎస్‌యూవీలో ఇవ్వనున్నారు. సి3 యొక్క ఇంటీరియర్‌లో రెండు కలర్ ఆప్షన్‌లు ఉంటాయి.

సిట్రోయెన్ సి3 పరిమాణం పరంగా కొంత చిన్నగానే ఉంటుంది. కావున ఇది 3,981 మిమీ పొడవు, 1,733 మిమీ వెడల్పు, 1,586 మిమీ ఎత్తు మరియు వీల్‌బేస్ 2540 మిమీ వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

సిట్రోయెన్ సి3 SUV 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లతో విడుదలయ్యే అవకాశం ఉంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. కానీ టర్బో పెట్రోల్ అనేది కావేలం ఫీల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వస్తుంది.

1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 81 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. టర్బోచార్జ్డ్ వెర్షన్ యొక్క 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.

కంపెనీ ఈ ఎస్‌యూవీ ధరలను ఇంకా అనధికారికంగా వెల్లడించనప్పటికీ, కొన్ని వర్గాలద్వారా తెలిసిన సమాచారం ప్రకారం బేస్ వేరియంట్ 'లైవ్' ధర రూ. 6 లక్షల నుంచి రూ. 6.25 లక్షల మధ్య ఉంటుందని వెల్లడయ్యింది. ఇక ఫీల్ వేరియంట్ ధరలు రూ. 7 లక్షల నుంచి 8.5 లక్షల వరకు ఉన్నట్లు తెలిసింది. కానీ అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ సి3 విడులయానికి ఇక ఎన్నో రోజులు లేదు. కావున ఇప్పటికీ ఈ ఎస్‌యూవీ గురించి చాలా సమాచారం తెలుసుకున్నాము. అయితే ఈ కొత్త ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది. సిట్రోయెన్ సి3 అనేది భారతీయ మార్కెట్లో టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇటీవల మేము ఈ చిన్న ఎస్‌యూవీని టెస్ట్ డ్రైవ్ కూడా చేసాము, దీనికి సంబంధించిన సమాహారం తెలుసుకోటానికి ఇక్కడ క్లిక్ చేయండి. అదే విధంగా ఈ ఎస్‌యూవీ గురించి ఎప్పటికప్పుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








