సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్ మరియు భారతీయ వాహన వినియోగదారుల అభిరుచి రెండూ చాలా ప్రత్యేకమైనవి. మన మార్కెట్లో ఏ బ్రాండ్ ప్రవేశించినా, భారతీయ వినియోగదారుల అభిరుచి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే తమ ఉత్పత్తులను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెడుతాయి. భారత కార్ మార్కెట్లో ఇటీవలి సంవత్సరాలలో ఎస్‌యూవీలకు డిమాండ్ జోరందుకుంది. ఒకప్పుడు భారత ప్యాసింజర్ కార్ మార్కెట్‌ను హ్యాచ్‌బ్యాక్‌లు డామినేట్ చేయగా, ఇప్పుడు ఆ స్థానాన్ని ఎస్‌యూవీలు ఆక్రమించుకున్నాయి.

మొదటిసారిగా కారును కొనే కస్టమర్లు కూడా ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ఎస్‌యూవీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి, భారతీయులు మరియు ఎస్‌యూవీల పట్ల వారికి ఉన్న ప్రేమ విషయంలో ఎలాంటి దాపరికాలు లేవు. ఒకప్పుడు మన మార్కెట్లో ఎస్‌యూవీలు పెద్దవిగా ఉండి, సామాన్య వినియోగదారులు కొనుగోలు చేయలేని ధరతో ఉన్నప్పుడు, చిన్న కార్లు మరింత సరసమైన ధరలో లభించే హ్యాచ్‌బ్యాక్ లకు కస్టమర్లు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే, ఆ తర్వాతి కాలంలో ఆటోమొబైల్ కంపెనీలు సబ్4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురావడం ప్రారంభించాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండి, తయారీదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో సరసమైన ధరలకే ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఓ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ధరకు ఓ మంచి కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయవచ్చు. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుతం దాదాపు ప్రతి ఆటోమొబైల్ బ్రాండ్ కూడా ఓ ఉత్పత్తిని విక్రయిస్తోంది. ఇప్పుడు తాజాగా ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) కూడా ఈ పోటీ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. సిట్రోయెన్ భారతదేశానికి కొత్త బ్రాండే కావచ్చు, కానీ ఇది ఇప్పటికే దేశీయ విపణిలో సి5 ఎయిర్‌క్రాస్ అనే ప్రీమియం ఎస్‌యూవీని విక్రయిస్తోంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

కాగా, ఇప్పుడు ఈ బ్రాండ్ సిట్రోయెన్ సి3 (Citroen C3) అనే సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, సిట్రోయెన్ సి3 సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని మేము టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది. మరి మా ఈ టెస్ట్ డ్రైవ్‌లో ఈ బుజ్జి ఫ్రెంచ్ ఎస్‌యూవీ మమ్మల్ని ఆకట్టుకుందా? దాని డ్రైవింగ్ పనితీరు ఎలా ఉంది? ఇది బడ్జెట్ బండా లేక ప్రీమియం ఉత్పత్తా? సి3 విషయంలో సిట్రోయెన్ చెప్పినట్లుగా ఇది 'ఎ హ్యాచ్‌బ్యాక్ విత్ ఎ ట్విస్ట్' ని కలిగి ఉందా? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందా రండి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

Citroen C3 - డిజైన్ మరియు స్టైల్

సిట్రోయెన్ సి3 అనేది భారత మార్కెట్లో ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ నుండి వస్తున్న రెండవ ఉత్పత్తి. సిట్రోయెన్ ఇప్పటికే సి5 ఎయిర్‌క్రాస్ అనే మిడ్-సైజ్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. ఇది పక్కా యూరోపియన్ కార్ డిజైన్ కలిగి ఉంటుంది. అయితే, సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీ మాత్రం యూరోపియన్ మరియు ఇండియన్ డిజైన్ లను కలగలపి రూపొందించబడింది. అందుకే, ఈ కారును గుంపులో ఉన్నా గుర్తించడం చాలా సులభం. ఈ కారులో ఎవరి దృష్టినైనా ముందుగా ఆకర్షించే ప్రధాన అంశం దాని విభిన్నమైన పెయింట్ స్కీమ్.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

సి3 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఇందులో సింగిల్ టోన్ మరియు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. సింగిల్-టోన్ మరియు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లతో సహా ఇది మొత్తం 10 విభిన్న రంగులో లభిస్తుంది. వీటికి అదనంగా, కస్టమర్లు తమ సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీని తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునేందుకు అనేక యాక్ససరీలు, 3 ప్యాక్‌లు మరియు 56 కస్టమైజేషన్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. కాబట్టి కస్టమర్లు తమ C3 ని తమ అభిరుచికి మరియు #ExpressYourStyle కి అనుగుణంగా ప్రత్యేకంగా మార్చుకోవచ్చు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

సిట్రోయెన్‌ తన డిజైన్ లాంగ్వేజ్ లో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. సి3 ఎస్‌యూవీలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాంపాక్ట్ కారు ముందు భాగంలో సిగ్నేచర్ సిట్రోయెన్ గ్రిల్ మరియు దాని మధ్యలో ఐకానిక్ సిట్రోయెన్ లోగో ప్రధానంగా కనిపిస్తాయి. ముందు భాగంలో ఓ క్రోమ్ స్ట్రిప్స్, లోగో అంచుల నుండి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు హెడ్‌ల్యాంప్‌లలోకి ప్రవహిస్తున్నట్లుగా ఉంటాయి. ఇది స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను పొందుతుంది. ఇంకా ఇందులో ఫ్రంట్ బంపర్ దిగువ భాగంలో సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్‌ మరియు ఇరువైపులా ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లను కలిగి ఉంటుంది మరియు ఇవి ఆరెంజ్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

సిట్రోయెన్ సి3 యొక్క వివిధ అంశాలలో ఈ ఆరెంజ్ కలర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి మరియు ఇవి కారుకి ప్రత్యేకమైన స్పోర్టీ అప్పీల్‌ను తెచ్చిపెడుతాయి. కారు సైడ్ మిర్రర్స్ మరియు రూఫ్ కూడా ఆరెంజ్ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ చుట్టూ బాడీ క్లాడింగ్‌ని గమనించవచ్చు. ఈ బాడీ క్లాడింగ్ లో ఆరెంజ్ కలర్ యాక్సెంట్స్ కూడా ఉంటాయి. ఓవరాల్ గా ఇది ఈ కారు సైడ్ ప్రొఫైల్‌కు మంచి స్టైలింగ్‌ను జోడిస్తుంది. ఈ కారులోని A మరియు B పిల్లర్స్ నలుపు రంగులో ఉంటాయి, అయితే C పిల్లర్‌ మాత్రం నలుపు రంగు ప్యానెల్‌ను కలిగి ఉండి, దానిపై ఆరెంజే కలర్ స్ట్రిప్‌తో బాడీ-కలర్ స్టైలింగ్ ఉంటుంది. ఇందులోని రూఫ్ ట్రాక్స్ కారుకి మరింత అందాన్ని తెచ్చిపెడుతాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

సిట్రోయెన్ సి3 కారు వెనుక వైపు నుండి కూడా చాలా స్టైలిష్‌గా మరియు అందంగా కనిపిస్తుంది. వెనుక భాగంలో ర్యాప్‌రౌండ్ టెయిల్ ల్యాంప్‌లు మరియు ప్రముఖంగా కనిపించే సిట్రోయెన్ బ్యాడ్జింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌ల పక్కన ఉన్న క్రోమ్ ఎలిమెంట్స్ మరియు బంపర్‌లోని క్రోమ్ స్ట్రిప్‌తో పాటు క్రోమ్ రిఫ్లెక్టర్ సరౌండ్‌లు Citroen C3 కి మరింత ప్రీమియం రూపాన్ని అందిస్తాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

సిట్రోయెన్ సి3 ప్రీమియం మరియు స్టైలిష్ రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ తయారీ ఖర్చును తక్కువగా ఉంచడం తద్వారా బడ్జెట్ ధరకే దీనిని అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ఎస్‌యూవీలోని కొన్ని విషయాలలో చాలా సాధారణంగా ఉంటుంది. ఉదాహరణకు, దాదాపుగా అన్ని కార్లలో కనిపించే షార్క్ ఫిన్ యాంటెన్నా ఈ చిన్న కారులో లేదు. దానికి బదులుగా, సి3 ముందు భాగంలో రూఫ్ పై పాతకాలపు వైర్ యాంటెన్నాను కలిగి ఉంటుంది. నేటి మోడ్రన్ కార్లలో ఇలాంటి ఓల్డ్ స్కూల్ యాంటెన్నా అంటే కాస్తంత ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

ఈ ఎస్‌యూవీ తయారీ ఖర్చును తగ్గించడం చాలా స్పష్టంగా కనిపించే మరో అంశం ఏంటంటే, సిట్రోయెన్ సి3 స్టీల్ వీల్స్ తో మాత్రమే లభిస్తుంది. ఇందులో అల్లాయ్ వీల్స్ ఆప్షన్‌గా కూడా అందుబాటులో లేవు. స్టీల్ వీల్స్‌పై ప్లాస్టిక్ వీల్ క్యాప్స్ అమర్చబడి ఉంటాయి, ఇవి స్టైలిష్‌గానే కనిపిస్తాయి. బడ్జెట్ కార్లలో కూడా కంపెనీలు అల్లాయ్ వీల్స్ ను అందిస్తుంటే, సిట్రోయెన్ కనీసం వీటిని ఆప్షనల్ గా కూడా అదించడం లేదు. బహుశా, ఈ పాయింట్ తో కస్టమర్లు వేరే బ్రాండ్ వైపు మరలే అవకాశం ఉండొచ్చు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

ఇక ఈ చిన్న కారులో అల్లాయ్ వీల్స్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా లేకపోవడాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం, మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలకు సిట్రోయెన్ సి3 అత్యంత స్టైలిష్ మరియు ప్రీమియం ప్రత్యామ్నాయంగా తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

Citroen C3 - కాక్‌పిట్ మరియు ఇంటీరియర్

ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ తమ కార్లలో చమత్కారమైన ఇంటీరియర్‌లను అమలు చేయడానికి ప్రసిద్ధి చెందింది మరియు కొత్తగా రాబోయే సి3 ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. అయితే, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. దీని డ్యాష్‌బోర్డ్ చాలా ఫంకీగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ, సీట్లు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నాయి. సీట్లు చాలా సూక్ష్మంగా మరియు సరళంగా ఉంటాయి. ఇందులో డ్యూయల్-టోన్ సీట్లు ఉంటాయి, కానీ వాటి కలర్స్ మరియు మోడల్స్ మాత్రం చాలా సరళంగా ఉంటాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

కారు లోపల డ్యాష్‌బోర్డ్ చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. డాష్‌బోర్డ్‌లో ఎక్కువ భాగం ప్రత్యేకమైన ఆరెంజ్ కలర్‌లో కవర్ చేయబడి ఉంటుంది. ఏసి వెంట్‌ల డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌కు ఇరువైపులా ఉన్న వెంట్‌లు నిలువుగా ఉంటాయి. డ్రైవర్‌కు కుడివైపున చంకీగా ఉండే ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు దాని మధ్యలో ప్రముఖంగా ఉంచబడిన సిట్రోయెన్ లోగో ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ పై ఆడియో సెట్టింగ్‌ల కోసం స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ ని కూడా పొందుతారు మరియు దిగువ స్పోక్ మధ్యలో ప్రత్యేకమైన డిజైన్ ఎలిమెంట్ ఉంటుంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

స్టీరింగ్ వీల్ వెనుక ఒక డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, ఇది ట్రిప్ మీటర్, డిస్టెన్స్ టూ ఎంప్టీ, సగటు ఇంధన వినియోగం, తక్కువ ఇంధన హెచ్చరిక, గేర్ షిఫ్ట్ ఇండికేషన్, డోర్ అజార్ వార్నింగ్ మొదలైన వాటితో సహా చాలా రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అయితే, ఇది చాలా ముఖ్యమైన ఫీచర్‌ను కోల్పోతుంది. అదేంటంటే, Citroen C3 లో టాకోమీటర్‌ ఉండదు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

ఇక డ్యాష్‌బోర్డ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇందులో 10.25 ఇంచ్ సిట్రోయెన్ కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉంటుంది. ఇది ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో పాటుగా బ్లూటూత్ కనెక్టివిటీ వంటి లక్షణాలను పొందుతుంది. ఇందులో నాలుగు స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ ఉంటుంది. దీని స్పీకర్లు బాగానే ఉన్నాయి మరియు ఆడియో నాణ్యత కూడా బాగానే ఉంది. సిట్రోయెన్ సి3 బడ్జెట్ ధర ఎస్‌యూవీ అయినప్పటికీ కంపెనీ ఇందులో వైర్‌లెస్ Apple CarPlay మరియు Android Auto ఫీచర్ ని కలిగి ఉంది. నిజానికి, ఈ విభాగంలోని చాలా ఎస్‌యూవీలు ఇంకా వైర్‌తో కూడిన కనెక్టివిటీ ఫీచర్లనే అందిస్తున్నాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

మీ స్మార్ట్‌ఫోన్‌ను కారు యొక్క ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో జత చేయడం చాలా సులభం మరియు ఈ ప్రక్రియ అంతా చాలా సరళంగా ఉంటుంది. దాని ఆపరేషన్‌లో ఎటువంటి ల్యాగ్ లేదు మరియు దీనిని ఉపయోగించడం చాలా సులభం. సెంటర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ క్రింద ఎయిర్ కండిషనింగ్ కోసం కంట్రోల్స్ కనిపిస్తాయి. అయితే, ఇవి పాతకాలపు రోటరీ నాబ్‌ల మాదిరిగా ఉంటాయి. నేటి ఆధునిక కార్లలో టచ్ కంట్రోల్స్ తో కూడిన ఏసి కంట్రోల్స్ ను ఈ కారు కోల్పోతుంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

ఏసి కంట్రోల్ క్రింద, ఒక వైపు USB టైప్-A స్లో మరియు మరొక వైపు 12V సాకెట్‌ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను నిల్వ చేయడానికి ఓ క్యూబీహోల్ కూడా ఉంది మరియు దాని కింద కప్‌హోల్డర్‌లు ఉన్నాయి. సెంటర్ కన్సోల్ వెనుకకు సాగదు కానీ గేర్ లివర్ వెనుకకు ముగుస్తుంది. గేర్ లివర్ సిల్వర్ కలర్ ఫినిష్ చేయబడి ఉంటుంది. సిట్రోయెన్ సి3 లోపల కూడా ఖర్చు తగ్గింపు గురించి చాలా స్పష్టంగా కనిపించే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ లోపల అద్దాలను మాన్యువల్‌గా సర్దుబాటు చేయడానికి జాయ్‌స్టిక్స్ ఉంటాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

ఇది సిట్రోయెన్ వంటి ప్రీమియం బ్రాండ్ నుండి వస్తున్నప్పటికీ, పోటీ ప్రపంచంలో సరసమైన ధరకే కారును తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ఖర్చు తగ్గింపు చర్యలకు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. నాలుగు డోర్లపై పవర్ విండోలు ఉంటాయి. అయితే, వాటిని ఆపరేట్ చేయడానికి స్విచ్‌లను మాత్రం సరైన స్థలంలో ఉంచలేదనేది మా అభిప్రాయం. డ్రైవర్ డోర్‌లో డ్రైవర్ సైడ్ విండో మరియు ప్యాసింజర్ విండో కోసం స్విచ్‌లు ఉంటాయి. సెంటర్ కన్సోల్‌లో హ్యాండ్‌బ్రేక్ వెనుక వైపు వెనుక సీటులోని ప్రయాణీకుల విండోలను డౌన్ చేయడానికి లేదా అప్ చేయడానికి స్విచ్‌లు ఉంటాయి. వెనుక తలుపులపై స్విచ్‌లు లేవు. అంటే, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణీకులు విండోస్‌ని కంట్రోల్ చేయలేరు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

అయితే, ఇంత గందరగోళం మధ్యలో మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, ఈ నాలుగు విండోస్ కూడా వన్-టచ్ డౌన్ ఫంక్షన్‌ను పొందుతాయి. అంటే, డ్రైవర్ ఒక్క బటన్ నొక్కగానే అన్ని నాలుగు విండోలు ఒకేసారి క్రిందకు దించుకుంటాయి. కానీ, ఈ విండోస్ ని పైకి పంపాలంటే మాత్రం డ్రైవర్ డోర్ వైపు ఉన్న రెండు స్విచ్ లను మరియు సెంటర్ కన్సోల్ ఉన్న రెండు స్విచ్ లను వేర్వేరుగా ఉపయోగించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, వెనుక ప్రయాణీకుల కోసం ఈ విండో స్విచ్‌లు లేవు కాబట్టి, వాటిని వీరు కంట్రోల్ చేయలేరు. ఓవరాల్‌గా సిట్రోయెన్ సి3 కొన్ని కొత్త పాత ఫీచర్ల సమ్మేళనంతో వచ్చే బడ్జెట్ కారుగా చెప్పుకోవచ్చు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

Citroen C3 - కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్

ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ 1948లో సిట్రోయెన్ 2సివి యొక్క అరంగేట్రం ద్వారా తన ఆటోమొబైల్ ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ఈ బ్రాండ్ తమ కార్లలో సౌలభ్యం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తూనే వచ్చింది. దాదాపు అన్ని సిట్రోయెన్ కార్లు కూడా సౌకర్యవంతంగానే ఉంటాయి మరియు ఇటీవలే భారత మార్కెట్లో విడుదలైన ఫ్లాగ్‌షిప్ సి5 ఎయిర్‌క్రాస్ ఇప్పటికే ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. కాబట్టి, సిట్రోయెన్ సి3 సౌలభ్యం విషయంలో మిమ్మల్ని ఎక్కడా నిరాశపరచదు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

సిట్రోయెన్ సి3 కంఫర్ట్ విషయంలో ఆశించినదాని కంటే ఎక్కువగా ఉందని నివేదించడానికి మేము సంతోషిస్తున్నాము. ముందుగా, ఇది గొప్ప రైడ్ క్వాలిటీని కలిగి ఉంది, దాని గురించి మరికాసేపట్లో తెలుసుకుందాం. ఇప్పుడు సీట్ల దగ్గరకు వస్తే, ఇవి చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ, కంఫర్ట్ విషయంలో మాత్రం బాగానే ఉన్నాయి. ముందు సీట్లు అన్ని వైపులా మంచి కుషనింగ్‌ను కలిగి ఉన్నాయి. ఇవి గొప్ప తై మరియు బ్యాక్ సపోర్ట్ ను ఇస్తాయి.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

అయితే, ఈ సీట్ల విషయంలో నిరుత్సాహపరచే అంశం ఏంటంటే, ఇవి ఫిక్స్డ్ హెడ్‌రెస్ట్‌లతో వస్తాయి. అంటే, వీటిలో తొలగించగల హెడ్‌రెస్ట్స్ లేవు, కాబట్టి ఇది కంపెనీ ఖచ్చితంగా మెరుగుపరచాల్సిన ఓ విషయంగా చెప్పుకోవచ్చు. సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్ డ్రైవర్ మరియు ప్రయాణీకులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ప్రయాణాన్ని చాలా సులభతరం చేస్తుంది. వెనుక సీట్ల విషయంలో కూడా ఇదే కథ. కాబట్టి, ఈ బ్రాండ్ డిటాచబల్ హెడ్‌రెస్ట్ లను ఆఫర్ చేస్తే బాగుండనేది మా అభిప్రాయం.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

సిట్రోయెన్ సి3 కారులో స్టోరేజ్ స్పేస్‌కు కూడా ఎలాంటి ఢోకా లేదు. ఈ కారులో పలు క్యూబిహోల్స్‌తో కూడిన లోడ్‌లు మరియు చుట్టూ ఉపయోగించదగిన సాంకేతికతతో ఇది సెగ్మెంట్‌లోని అత్యంత ఆచరణాత్మక వాహనాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇదివరకు చెప్పుకున్నట్లుగా, ఈ కారును మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉంచడానికి డాష్‌బోర్డ్‌లో కొంత స్థలం ఉంటుంది. గ్లోవ్‌బాక్స్ మరియు డోర్ పాకెట్స్ కూడా లోతుగా ఉంటాయి. సీట్ బ్యాక్ పాకెట్ టాప్-స్పెక్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది మరియు బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేసేవారు ఈ ఫీచర్ ను మిస్ అవుతారు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

వెనుకవైపు ఉన్న ప్రయాణీకులు విండో స్విచ్‌ల వెనుక ఉన్న సెంటర్ కన్సోల్‌లో ఒకే ఒక కప్‌హోల్డర్‌ మాత్రమే ఉంటుంది. అయితే, వెనుక ప్రయాణీకుల స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి మాత్రం రెండు USB స్లాట్‌లు ఉంటాయి. సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీ దాని పరిమాణానికి తగినట్లుగా అద్భుతమైన బూట్ స్థలాన్ని కలిగి ఉంటుంది. ఇందులో 315 లీటర్ల స్టోరేజ్ ఉంటుంది. ఓ చిన్న కుటుంబానికి ఈ లగేజ్ స్పేస్ చక్కగా సరిపోతుంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

Citroen C3 - ఇంజన్ పనితీరు మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్‌లు

సిట్రోయెన్ సి3 రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఇంజన్ల పనితీరును పరిశీలించేందుకు మేము ఈ రెండింటినీ నడిపి చూశాము. బేస్ వేరియంట్ 1.2-లీటర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ PURETECH 82 ఇంజన్‌తో పనిచేస్తుంది. పేరు సూచించినట్లుగానే ఈ ఇంజన్ గరిష్టంగా 82 పిఎస్ శక్తిని జనరేట్ చేస్తుంది. ఇది 80.8 బిహెచ్‌పితో సమానం. దీని గరిష్ట టార్క్ 115 ఎన్ఎమ్ గా ఉంటుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

ఇకపోతే, రెండవది మరింత శక్తివంతమైన ఇంజన్. ఎందుకంటే, ఇది అదనపు శక్తిని ఉత్పత్తి చేయడమే కాదు, టర్బోచార్జర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఇంజన్‌కు PURETECH 110 అనే పేరు పెట్టారు. పేరుకి తగినట్లుగానే ఇది 110 పిఎస్ లేదా 108.4 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇది 190 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ రెండు ఇంజన్లలో మా ఓటు మాత్రం తప్పకుండా ఈ టర్బో ఇంజన్‌కే అని చెప్పాలి. ఇది ఈ కారును ఓ ఫన్ టూ రైడ్ వెహికల్‌గా మారుస్తుంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

కారు కీని ఇగ్నిషల్ ఉంచి ఆన్ చేయగానే, ఇంజన్ ఎటువంటి డ్రామా లేకుండా ఆన్ అవుతుంది. ఇందులోని మూడు-సిలిండర్ల చప్పుడు కేవలం అధిక రెవ్ లలో మాత్రమే వినబడుతుంది మరియు తక్కువ ఆర్‌పిఎమ్‌ల వద్ద ఇందులో ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. దీని క్లచ్ చాలా తేలికగా ఉంది మరియు దాని ఫీడ్‌బ్యాక్ కూడా చాలా బాగుంది. థ్రోటల్‌పై కాలు వేయగానే సిట్రోయెన్ సి3 చాలా త్వరగా వేగాన్ని పుంజుకోవడాన్ని మీరు గుర్తిస్తారు. పీక్ టార్క్ చాలా తక్కువ ఇంజన్ వేగంతో వస్తుంది కాబట్టి టార్క్ వేవ్‌పై రైడ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. అంటే, దీని అర్థం టర్బో ల్యాగ్ చాలా తక్కువగా ఉంది మరియు మీరు ఏ గేర్‌లో ఉన్నా దాన్ని అధిగమించడం చాలా సులభం.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

గేర్‌ల గురించి చెప్పాలంటే, ఈ టాప్-స్పెక్ మోడల్‌లోని గేర్‌బాక్స్ ఒక క్లిక్-షిఫ్టింగ్ టైప్ గేర్‌బాక్స్ మరియు దీని గేర్లను మార్చడం కూడా చాలా సులభంగా ఉంటుంది. రివర్స్ గేర్‌లోకి మారడం కూడా చాలా సులభంగా అనిపిస్తుంది. అయితే, మేము దానిని రివర్స్ గేర్ నుండి బయటకు తీసి న్యూట్రల్ లోకి మార్చడంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాము. ఫస్ట్ డ్రైవ్ ఈవెంట్‌లో మేము ఇలాంటి సమస్యను మరే ఇతర కారులో ఎదుర్కోనందున ఇది వన్ టైమ్ ఇష్యూగా చెప్పవచ్చు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

మేము ఇదివరకు చెప్పినట్లుగా యాక్సిలరేషన్ చాలా బలంగా ఉంది మరియు ఇది కేవలం 10 సెకన్లలోనే గంటకు గరిష్టంగా 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంది. ఈ కారులో డ్రైవ్ మోడ్‌లు ఉండవు, కాబట్టి చాలా మంది దీనిని ఓ నెగిటివ్ ఫీచర్‌గా పరిగణించవచ్చు. అయితే, మా అభిప్రాయం ప్రకారం ఇది "నో నాన్సెన్స్ డ్రైవ్"‌ని అనుమతిస్తుందని మేము భావిస్తున్నాము.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

ఈ కారులోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.2 లీటర్ ఇంజన్ పూర్తి పనితీరు పరంగా మరింత లీనియర్ డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుంది. అయినప్పటికీ, దీని మూడు-సిలిండర్ల చప్పుడు అధిక ఇంజన్ వేగం వద్ద చాలా స్పష్టంగా వినిపిస్తుంది మరియు కొన్ని నిటారుగా ఉన్న వాలులలో ఇంజన్ కాస్తంత నెమ్మదిగా అనిపిస్తుంది. ఈ ఇంజన్ యొక్క 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పనితీరు బాగానే ఉంది మరియు గేర్లు కూడా సులువుగానే మారుతున్నాయి. మెరుగైన హైవే డ్రైవింగ్ సామర్థ్యాలను అనుమతించడానికి 5వ గేర్ కొంచెం పొడవుగా ఉంటుంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

వీల్ గ్రిప్ బాగుంది మరియు అది అందించే ఫీడ్‌బ్యాక్ కూడా చాలా బాగుంది. కాబట్టి, స్టీరింగ్ రెస్పాన్స్ గొప్పగా అనిపిస్తుంది. కంపెనీ ఈ రెండింటినీ బాగా సమతుల్యం (బ్యాలెన్స్) చేసింది. కాబట్టి స్టీరింగ్ తక్కువ వేగం వద్ద తేలికగా ఉంటుంది మరియు వేగం పెరిగేకొద్దీ బరువు కూడా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగిన వేరియంట్లో కొంత టార్క్ స్టీర్ వస్తున్నట్లు మేము గుర్తించాము.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

ఓవరాల్‌గా సిట్రోయెన్ సి3 మంచి హ్యాండ్లింగ్ ను అందిస్తుంది. అయితే, దీని మృదువైన సస్పెన్షన్ ఫలితంగా బాడీ రోల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో సాఫ్ట్ సస్పెన్షన్ యొక్క రైడ్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సిట్రోయెన్ యొక్క అన్ని కార్లు వాటి అద్భుతమైన రైడ్‌కు ప్రసిద్ధి చెందినవే. కాబట్టి, సి3 కూడా ఖచ్చితంగా ఈ అంశానికి కట్టుబడి ఉంటుంది. నెమ్మదిగా మరియు మితమైన వేగంతో ప్రయాణిస్తున్న క్యాబిన్ లోపల ఏమీ అనిపించదు. అయితే ముడంకెల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రం సిట్రోయెన్ సి3 లోపల కొంచెం చప్పుడు వినిపిస్తుంది.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

ఇక చివరగా విషయానికి వస్తే, ఈ కారు ముందు భాగంలో రెండు డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో రెండు డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. దీని ఓవరాల్ బ్రేకింగ్ పనితీరు బాగానే అనిపించింది మరియు అవసరానికి తగినంతగా ఉంది. అయితే, దీని బ్రేక్ పెడల్ ట్రావెల్ మాత్రం సాధారణం కంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది, కాబట్టి దీనికి కొంత అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. మొత్తం మీద, సిట్రోయెన్ సి3 ఓ అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. దాని ఇంజన్లను మిమ్మల్ని ఏ విషయంలోనూ నిరాశపరచవు.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

Citroen C3 - సేఫ్టీ మరియు ముఖ్యమైన ఫీచర్లు

సిట్రోయెన్ తమ సి3 ఎస్‌యూవీని బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో కావల్సిన అన్ని ఫీచర్లను అందించేందుకు ప్రయత్నించింది. అయితే, అవి ధరకు తగినట్లుగా మాత్రమే ఉంటాయనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు మరియు కంఫర్ట్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. కానీ, అధునాతన టెక్ ఫీచర్లు మాత్రం ఇందులో లేవనే చెప్పాలి. సిట్రోయెన్ తమ సి3 కారులో తగినన్ని ఫీచర్లను అమర్చింది, కానీ అందులో ఏదీ కూడా అగ్రస్థానంలో లేదనేది మా అభిప్రాయం.

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

Citroen C3 లో ప్రధానమైన సేఫ్టీ ఫీచర్లు:

- డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు

- రివర్స్ పార్కింగ్ సెన్సార్లు

- వెనుక తలుపులపై చైల్డ్ లాక్

- ఇంజన్ ఇమ్మొబిలైజర్

- స్పీడ్-సెన్సిటివ్ డోర్ లాక్

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

Citroen C3 లో కొన్ని ముఖ్యమైన ఫీచర్లు:

- ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు

- సిట్రోయెన్ కనెక్ట్ 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్

- వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ

- ఫోల్డ్-ఫ్లాట్ రియర్ సీట్

- వన్-టచ్ విండోస్ డౌన్

- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

Citroen C3 కలర్ ఆప్షన్లు

సింగిల్-టోన్ కలర్ ఆప్షన్స్:

- పోలార్ వైట్

- జెస్టీ ఆరెంజ్

- ప్లాటినం గ్రే

- స్టీల్ గ్రే

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

డ్యూయెల్-టోన్ కలర్ ఆప్షన్స్:

- జెస్టీ ఆరెంజ్ రూఫ్‌తో కూడిన పోలార్ వైట్ బాడీ కలర్

- జెస్టీ ఆరెంజ్ రూఫ్‌తో కూడిన ప్లాటినం గ్రే బాడీ కలర్

- ప్లాటినం గ్రే రూఫ్‌తో కూడిన పోలార్ వైట్ బాడీ కలర్

- జెస్టీ ఆరెంజ్ రూఫ్‌తో కూడిన స్టీల్ గ్రే బాడీ కలర్

- ప్లాటినం గ్రే రూఫ్‌తో కూడిన జెస్టీ ఆరెంజ్ బాడీ కలర్

- ప్లాటినం గ్రే రూఫ్‌తో కూడిన స్టీల్ గ్రే బాడీ కలర్

సిట్రోయెన్ సి3 (Citroen C3) టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది చీప్ కారే, కానీ మీరనుకునేంత 'చీప్' కాదు..!

చివరిగా ఏం చెబుతారు..?

సిట్రోయెన్ తమ సి5 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీతో భారత మార్కెట్లో ఓ ప్రీమియం కార్ల తయారీదారుగా స్థిరపడింది. అయితే, ఇప్పుడు సి3 కారుని విడుదల చేయడం ద్వారా ఇది మాస్ మార్కెట్లో ఓ కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయాలని భావిస్తోంది. మరి ఈ ఫ్రెంచ్ కంపెనీ అత్యంత పోటీతో కూడుకున్న ఈ విభాగంలో బ్రేకులు వేయకుండా రయ్యిమని దూసుకుపోతుందో లేదో అనేది కంపెనీ ఈ ఎస్‌యూవీ ధర విషయంలో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

సి3 విషయంలో సిట్రోయెన్ ఇవ్వబోయే "ట్విస్ట్" భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంటుందో లేదో మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. డ్రైవింగ్ మరియు పనితీరు విషయానికొస్తే, సిట్రోయెన్ సి3 ఈ విభాగంలో ఒక గొప్ప కారుగా ఉంటుంది మరియు ఇది దాని ఔత్సాహికులను కూడా సంతోషంగా ఉంచగలదనేది మా అభిప్రాయం. కొన్ని అంశాలలో ఈ కారు దాని పోటీదారుల కంటే ముందుంది కాబట్టి మాకు మాత్రం ఈ కారు ఓ మంచి విజేతగా కనిపిస్తోంది.

Most Read Articles

English summary
Citroen c3 first drive report design features engine performace and driving impressions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X