హ్యుందాయ్ నుంచి మరో CNG వేరియంట్ వచ్చేసింది; ధర రూ. 8.57 లక్షలు
భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కొత్తగా వాహనాలను కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాకుండా CNG వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు CNG వాహనాలను విడుదల చేసాయి.
ఇప్పుడు ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్' (Hyundai Motor) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త 'ఆరా' (Aura) కాంపాక్ట్ సెడాన్ యొక్క ఎస్ఎక్స్ వేరియంట్‌ను సిఎన్‌జి వెర్సన్ లో విడుదల చేసింది. ఈ కొత్త సిఎన్‌జి వేరియంట్ గురించి మరింత ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఈ కొత్త 'ఆరా ఎస్ఎక్స్ సిఎన్‌జి' (Aura SX CNG) వేరియంట్ ధర భారతీయ మార్కెట్లో రూ. 8.57 లక్షలు (ఎక్స్-షోరూమ్). హ్యుందాయ్ కంపెనీ దేశీయ విఫణిలో ఇప్పటికే సిఎన్‌జి వేరియంట్ ని కేవలం ఎస్ వేరియంట్‌లో మాత్రమే అందించడం జరిగింది. హ్యుందాయ్ ఎస్ సిఎన్‌జి వేరియంట్ ధర రూ. 7.88 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ వేరియంట్ కంటే కూడా 'ఆరా ఎస్ఎక్స్ సిఎన్‌జి' చాలా వరకు ఆధునికంగా ఉంటుంది.

'ఆరా ఎస్ సిఎన్‌జి' వేరియంట్ తో పోలిస్తే కొత్త ఎస్ఎక్స్ వేరియంట్ 15-ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 5.3-ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు వాయిస్ రికగ్నిషన్ వంటి వాటి కోసం 8.0 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు పుష్-బటన్ స్టార్ట్-స్టాప్తో స్మార్ట్ కీ, ఫ్రంట్ పవర్ అవుట్ లెట్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ ఆరా ఎస్ఎక్స్ సిఎన్‌జి వేరియంట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 68 బిహెచ్‌పి పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఆరా ఎస్ఎక్స్ సిఎన్‌జి వేరియంట్, టాటా టిగోర్ సిఎన్‌జి ఎక్స్‌జెడ్ ప్లస్ కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సిఎన్‌జి వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇందులో మారుతి సుజుకి, హ్యుందాయ్ మరియు టాటా మోటార్స్ వంటి కంపెనీలు ఈ సిఎన్‌జి వాహన అమ్మకాల్లో ముందుకు సాగుతున్నాయి. అయితే ఇప్పుడు హ్యుందాయ్ కంపెనీ మరో కొత్త మోడల్ విడుదల చేసింది. ఇది కూడా మునుపటి సిఎన్‌జి మోడల్స్ అమ్మకాల మాదిరిగానే మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

హ్యుందాయ్ కంపెనీ భారతీయ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరించడంతో భాగంగానే ఇప్పుడు ఈ కొత్త సిఎన్‌జి వేరియంట్ తీసుకురావడం జరిగింది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. అయితే వినియోగదారునికి ఎక్కువ డబ్బును ఆదా చేయడంలో ఈ సిఎన్‌జి వెహికల్ తప్పకుండా ఉపయోగపడుతుంది.

ఇదిలా ఉండగా హ్యుందాయ్ కంపెనీ ఇటీవల కొత్త 'వెన్యూ ఫేస్‌లిఫ్ట్' ను భారతీయ విఫణిలో విడుదల చేసింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 5 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి E, S, S+/S(O), SX, మరియు SX (O) వేరియంట్స్. ఈ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 7.53 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. కంపెనీ దీనికోసం బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారభించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 20,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ తన 'ఆరా ఎస్ఎక్స్ సిఎన్‌జి' విడుదల చేసింది. అయితే ఈ కొత్త వేరియంట్ కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాము. అంతే కాకూండా దేశీయ మార్కెట్లో ఇతర కంపెనీలు కూడా సిఎన్‌జి మరియు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కొనుగోలుదారులు ఎక్కువగా సిఎన్‌జి మరియు ఎలక్ట్రిక్ వాహనాలను కోరుకోవడమే.ఎప్పటికప్పుడు ఇలాంటి కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








