2022 ఫిబ్రవరిలో 'హ్యుందాయ్ ఇండియా' అద్భుతమైన ఆఫర్స్: పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్ ఇండియా' (Hyundai India) దేశీయ మార్కెట్లో తమ అమ్మకాలను పెంచుకోవడానికి 2022 ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని మోడల్స్ పైన గొప్ప ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో కంపెనీ యొక్క హ్యుందాయ్ ఐ20 (Hyundai i20), హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios), హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) మరియు హ్యుందాయ్ శాంట్రో (Hyundai Santro) వంటి మోడల్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ ఇండియా ఇప్పుడు ఈ మోడల్ కార్లపైన క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి అందిస్తుంది. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్లు ఈ నెల 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 ఫిబ్రవరిలో 'హ్యుందాయ్ ఇండియా' అద్భుతమైన ఆఫర్స్: పూర్తి వివరాలు

హ్యుందాయ్ శాంత్రో (Hyundai Santro):

హ్యుందాయ్ బ్రాండ్ యొక్క హ్యుందాయ్ శాంత్రో (Hyundai Santro) ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ పైన కంపెనీ ఇప్పుడు రూ. 40,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ అనేది కేవలం పెట్రోల్ వేరియంట్ కి మాత్రమే పరిమితం చేయబడి ఉంటుంది. కావున హ్యుందాయ్ శాంత్రో CNG మోడల్ కి ఈ ఆఫర్ అనేది వర్తించదు. దీనిని కొనుగోలుదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

2022 ఫిబ్రవరిలో 'హ్యుందాయ్ ఇండియా' అద్భుతమైన ఆఫర్స్: పూర్తి వివరాలు

హ్యుందాయ్ శాంట్రో (Hyundai Santro) 1.1-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 68 బిహెచ్‌పి పవర్ మరియు 99 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్‌ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

2022 ఫిబ్రవరిలో 'హ్యుందాయ్ ఇండియా' అద్భుతమైన ఆఫర్స్: పూర్తి వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios):

హ్యుందాయ్ కంపెనీ యొక్క హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios) మోడల్ పైన కూడా ఇప్పుడు రూ. 50,000 వరకు డిస్కౌంట్స్ అందుబటులో ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ వంటి వున్నాయి. ఈ డిస్కౌంట్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లపైన మాత్రమే అందుబటులో ఉంటుంది. CNG మోడల్ పైన ఎలాంటి డిస్కౌంట్ లేదు.

2022 ఫిబ్రవరిలో 'హ్యుందాయ్ ఇండియా' అద్భుతమైన ఆఫర్స్: పూర్తి వివరాలు

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura):

ఇక మన జాబితాలో చివరి మోడల్ అయిన హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) పైన కంపెనీ రూ. 50,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఈ డిస్కౌంట్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లపైన మాత్రమే అందుబటులో ఉంటుంది. CNG మోడల్ పైన ఎలాంటి డిస్కౌంట్ లేదు.

2022 ఫిబ్రవరిలో 'హ్యుందాయ్ ఇండియా' అద్భుతమైన ఆఫర్స్: పూర్తి వివరాలు

హ్యుందాయ్ ఐ20 (Hyundai i20):

హ్యుందాయ్ కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణపొందిన కార్ మోడల్స్ లో ఈ హ్యుందాయ్ ఐ20 (Hyundai i20) ఒకటి. ఇప్పుడు కంపెనీ యొక్క ఈ మోడల్ లోని పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌ల దాదాపు రూ. 40,000 వరకు డిస్కౌంట్ అదుబాటులో ఉంది. ఈ మోడల్ సాధారణ ధర రూ. 6.98 లక్షలు (ఎక్స్-షోరూమ్).

2022 ఫిబ్రవరిలో 'హ్యుందాయ్ ఇండియా' అద్భుతమైన ఆఫర్స్: పూర్తి వివరాలు

హ్యుందాయ్ ఐ20 (Hyundai i20) మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది, కావున వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఐ20 మోడల్ వివిధ రకాల ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్సన్స్ కూడా పొందుతుంది. ఇప్పుడు కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ వీటి అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉంటుంది.

2022 ఫిబ్రవరిలో 'హ్యుందాయ్ ఇండియా' అద్భుతమైన ఆఫర్స్: పూర్తి వివరాలు

అయితే పైన తెలిపిన ఈ మోడల్ కాకుండా మిగిలిన హ్యుందాయ్ క్రెటా, అల్కాజార్, ఎలంట్రా, టక్సన్, వెన్యూ మరియు వెర్నా వంటి ఇతర కార్లపై కంపెనీ ఎలాంటి డిస్కౌంట్స్ అందించడం లేదు. దీనిని వాహన కొనుగోలుదారులు తప్పకుండా గమనించాలి.

2022 ఫిబ్రవరిలో 'హ్యుందాయ్ ఇండియా' అద్భుతమైన ఆఫర్స్: పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా, గత నెలలో కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా, మొత్తం 44,022 కార్లను విక్రయించినట్లు ప్రకటించింది. అయితే, గతేడాది జనవరి 2021 నెలలో విక్రయించిన 52,005 కార్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 15.35 శాతం క్షీణించాయి. అయితే, రానున్న నెలల్లో అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని కంపెనీ భావిస్తోంది.

2022 ఫిబ్రవరిలో 'హ్యుందాయ్ ఇండియా' అద్భుతమైన ఆఫర్స్: పూర్తి వివరాలు

గడచిన డిసెంబర్ 2021 నెలతో పోలిస్తే, ఈ కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ కార్ల అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. డిసెంబర్ 2021లో కంపెనీ మొత్తం విక్రయాలు 32,312 యూనిట్లుగా ఉంటే, జనవరి 2022లో 44,022 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో అమ్మకాలు 36.24 శాతం వృద్ధిని సాధించాయి. గత నెలలో టాప్ సేల్స్ చార్ట్‌లో హ్యుందాయ్ క్రెటా, వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, శాంట్రో, వెర్నా మరియు హ్యుందాయ్ అల్కాజార్ మోడళ్లు ఉన్నాయి.

2022 ఫిబ్రవరిలో 'హ్యుందాయ్ ఇండియా' అద్భుతమైన ఆఫర్స్: పూర్తి వివరాలు

వాస్తవానికి, డిసెంబర్‌ నెలలో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి, స్టాక్ క్లియరెన్స్ కోసం కార్ కంపెనీలు డిసెంబర్ నెలలో తమ కార్లపై భారీ డిస్కౌంట్లు మరియు వివిధ రకాల ఆఫర్లను అందిస్తుంటాయి. అయినప్పటికీ, హ్యుందాయ్ కార్ల అమ్మకాలు మాత్రం డిసెంబర్ 2021 నెలలో భారీగా క్షీణించాయి. దీంతో డిసెంబర్ నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విక్రయాల పరంగా మూడవ స్థానంలోకి పడిపోయింది. రెండవ స్థానాన్ని టాటా మోటార్స్ దక్కించుకుంది. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

More from DriveSpark

Article Published On: Monday, February 21, 2022, 11:35 [IST]
English summary
Hyundai india february 2022 discount on santro aura i10 i20 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+