సిఎన్‌జి కార్ల విషయంలో Maruti Suzuki ని ఢీకొట్టేవారే లేరు.. అప్పుడే 10 లక్షల కార్లు అమ్మేశారు..!!
దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటుండం మరియు డీజిల్ కార్ల హవా తగ్గిపోవడంతో కస్టమర్లు ఇప్పుడు అధిక మైలేజీనిచ్చే సిఎన్‌జి కార్ల వైపు పరుగులు తీస్తున్నారు. మనదేశంలో అత్యధికంగా సిఎన్‌జి కార్లను విక్రయించే సంస్థ ఏవరయ్యా అంటే టక్కున గుర్తుకు వచ్చేది మారుతి సుజుకి (Maruti Suzuki). ఈ కంపెనీ విక్రయిస్తున్న మొత్తం 15 మోడళ్లలో 9 మోడళ్లలో CNG ఆప్షన్ ద్వారా అందుబాటులో ఉన్నాయంటే, కంపెనీ వీటికి ఎంత పెద్ద ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరు తెచ్చుకున్న మారుతి సుజుకి, ఇప్పుడు దేశపు అగ్రగామి సిఎన్‌జి కార్ల తయారీ సంస్థగా కూడా పేరు తెచ్చుకుంది. మారుతి సుజుకి ఇప్పటి వరకూ 10 లక్షల యూనిట్లకు పైగా సిఎన్‌జి విక్రయించి, ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. బిఎస్6 ఉద్గార నిబంధనలు ప్రవేశపెట్టిన తర్వాత, మారుతి సుజుకి డీజిల్ కార్ల తయారీని పూర్తిగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో, ఇంజన్ పవర్‌తో సంబంధం లేకుండా అధిక మైలేజీనిచ్చే మారుతి సుజుకి కారును కోరుకునే వారికి సిఎన్‌జి మోడళ్లే దిక్కయ్యాయి.

మారుతి సుజుకి డీజిల్ కార్ల తయారీని నిలిపివేసినప్పటికీ, కంపెనీ అమ్మకాలు మాత్రం పెద్దగా ప్రభావితం కాలేదు. చిన్న కార్లలో సిఎన్‌జి టెక్నాలజీని ప్రవేశపెట్టడం డీజిల్ యూనిట్ల కంటే ఎక్కువ ఆర్థిక విలువను కలిగిస్తుందని మారుతి సుజుకి చెబుతోంది. ప్రస్తుతం, పెట్రోల్ మోడళ్ల వైపు నెమ్మదిగా మారుతున్న మార్కెట్ పరిస్థితుల్లో, బిఎస్6 కంప్లైంట్ డీజిల్ యూనిట్‌ను ప్రవేశపెట్టడం ఆర్థిక సాధ్యత విషయంలో ఎటువంటి లాజిక్ చేయలేదని కంపెనీ పేర్కొంది. తాము ఇప్పటి వరకూ ఫ్యాక్టరీలో అమర్చిన 10 లక్షల సిఎన్‌జి కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం, మారుతి సుజుకి ఇండియా పోర్ట్‌ఫోలియోలో మొత్తం 9 ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కార్లు ఉన్నాయి. వీటిలో మారుతి సుజుకి ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, సెలెరియో, ఎర్టిగా, ఈకో, సూపర్ క్యారీ మరియు మారుతి సుజుకి టూర్-ఎస్ ఉన్నాయి. ఇవే కాకుండా, కంపెనీ ఇటీవల తమ మారుతి సుజుకి డిజైర్ సెడాన్‌ను కూడా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో విడుదల చేసింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొత్తం 1.9 లక్షల యూనిట్ల సిఎన్‌జి వాహనాలను విక్రయించగా, వీటిలో 1.6 లక్షల యూనిట్లు మారుతి సుజుకి సంస్థకు చెందినవే ఉన్నాయి.

మారుతి సుజుకి ఇండియా దాదాపు 2010 నుండి భారత మార్కెట్లో S-CNG కార్లను విక్రయిస్తోంది. మొదటి సంవత్సరంలో అంటే 2010 మరియు 20211 మధ్య కాలంలో, మారుతి సుజుకి మొత్తం 15,900 యూనిట్ల S-CNG కార్లను మాత్రమే విక్రయించింది. ఆ తర్వాత, 2016 మరియు 2017 నాటికి కంపెనీ 3.5 లక్షల CNG కార్లను విక్రయించింది, 2018 మరియు 2019 మధ్య నాటికి 5.3 లక్షల కార్లను మరియు 2020 మరియు 2021 నాటికి మారుతి సుజుకి ఇండియా మొత్తం 7.98 లక్షల యూనిట్ల ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కార్లను విక్రయించింది.

మారుతి సుజుకి తమ S-CNG సిరీస్‌లో అందిస్తున్న ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌లు డ్యూయెర్ పర్పస్ ECU లు మరియు కామన్ రైల్ CNG ఇంజెక్షన్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. ఇవే కాకుండా, మారుతి సుజుకి తన S-CNG వాహనాలను రీ-ట్యూన్ చేయబడిన సస్పెన్షన్ మరియు బ్రేక్‌లతో భారత మార్కెట్లో విక్రయిస్తుంది. కాబట్టి, ఇవి మరింత సురక్షితంగా ఉంటాయి. అంతేకాకుండా, కంపెనీ వీటిని అదనపు భద్రతా ఫీచర్లతో విక్రయిస్తుంది. ఈ భద్రతా లక్షణాలలో, వాహనం ఆపివేయబడిందని గుర్తించి మరియు ఇంధనం నింపుతున్నప్పుడు కారును స్టార్ట్ చేయడానికి అనుమతించని ఓ మైక్రోస్విచ్ కూడా ఉంటుంది.

ఇవే కాకుండా, మారుతి సుజుకి యొక్క S-CNG కార్లలో ఫెర్రూల్ జాయింట్ లతో కూడిన స్టెయిన్‌లెస్ స్టీల్ CNG పైపులు, డ్యూయల్ సోలనోయిడ్ సిస్టమ్, నాన్-రిటర్న్ వాల్వ్ మెకానిజం, CNG ఫిల్లర్ ఫిల్టర్, పెట్రోల్ మోడ్ ఇగ్నిషన్ మరియు ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా అందించహడుతున్నాయి. ఇవన్నీ కూడా మారుతి సుజుకి సిఎన్‌జి కార్లను మరింత సురక్షితంగా మార్చి, వినియోగదారులలో వీటిపై ఉన్న భద్రతా అపోహలను తొలగించేందుకు ఉపయోగపడుతాయి.

దేశంలో సిఎన్‌జి కార్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని, సిఎన్‌జి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ లో కొత్త నగరాలు కూడా చేరుతున్నాయి. ఫలితంగా, ఈ కార్ల విక్రయాలు మరింత పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా సిఎన్‌జి డిస్పెన్సింగ్ అవుట్‌లెట్‌లు కూడా వేగంగా పెరుగుతాయని మారుతి సుజురి భావిస్తోంది. దేశంలో ఒకప్పుడు 1,400 సిఎన్‌జి ఫిల్లింగ్ స్టేషన్లు మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 3,300 లకు దాటిందని మరియు రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో ఈ ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్య 8,700 దాటుతుందని అంచనా వేస్తున్నారు.

భారత మార్కెట్లో Maruti Dzire CNG విడుదల
ఇదిలా ఉంటే, మారుతి సుజుకి తాజాగా మరో కొత్త సిఎన్‌జి కారును మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియో అందుబాటులో ఉన్న డిజైర్ (Dzire) కాంపాక్ట్ ఎస్‌యూవీలో కొత్త సిఎన్‌జి వేరియంట్ ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో కొత్త 'మారుతి సుజుకి డిజైర్ సిఎన్‌జి' (Maruti Suzuki Dzire CNG) ధర రూ. 8.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. డిజైర్ సిఎన్‌జి కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు రూ.11,000 అడ్వాన్స్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications