'జీప్ మెరిడియన్' బుకింగ్స్ స్టార్ట్.. ఎప్పటినుంచో తెలుసా..?

ప్రముఖ అమెరికన్ కార్ తయారీ సంస్థ జీప్ (Jeep) భారతీయ మార్కెట్లో తన 'జీప్ మెరిడియన్'(Jeep Meridian) కోసం బుకింగ్స్ స్వీకరించడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం బుకింగ్స్ 2022 మే 03 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. అయితే డెలివరీలు 2022 జూన్ నెల నుంచి ప్రారంభమవుతాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

'జీప్ మెరిడియన్' బుకింగ్స్ స్టార్ట్.. ఎప్పటినుంచో తెలుసా..?

జీప్ మెరిడియన్ (Jeep Meridian) యొక్క ఉత్పత్తి మహారాష్ట్రలోని రంజన్‌గావ్ ప్లాంట్‌లో 2022 మే నుండి ప్రారంభమవుతుంది. ఇప్పటికీ కంపెనీ యొక్క జీప్ మెరిడియన్ 7-సీటర్ అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయించబడుతోంది. అయితే ఇది భారతీయ మార్కెట్లో త్వరలోనే అందుబాటులోకి రానుంది. కావున బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులు 2022 మే 03 నుంచి బుక్ చేసుకోవచ్చు.

'జీప్ మెరిడియన్' బుకింగ్స్ స్టార్ట్.. ఎప్పటినుంచో తెలుసా..?

'జీప్ మెరిడియన్' ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV డిజైన్ కూడా దాదాపు కంపెనీ యొక్క మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. కానీ దీనికి మరింత ఫ్రీమియం డిజైన్ అందించడానికి చాలా చోట్ల క్రోమ్ ఉపయోగించబడింది. దీని డిజైన్ దాదాపుగా కంపాస్‌ను గుర్తుకు తెస్తుంది. కానీ దీని వెనుక భాగం మాత్రం చాలా ఆధునిక డిజైన్ పొందుతుంది.

జీప్ మెరిడియన్ సిగ్నేచర్ 7-స్లాట్ గ్రిల్, ఎల్ఈడీ డిఆర్ఎల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటిని పొందుతుంది.సైడ్ ప్రొఫైల్ 18-ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందటం వల్ల చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

'జీప్ మెరిడియన్' బుకింగ్స్ స్టార్ట్.. ఎప్పటినుంచో తెలుసా..?

జీప్ మెరిడియన్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,769 మిమీ, వెడల్పు 1,859 మిమీ, ఎత్తు 1,682 మిమీ మరియు వీల్‌బేస్ 2,794 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

'జీప్ మెరిడియన్' బుకింగ్స్ స్టార్ట్.. ఎప్పటినుంచో తెలుసా..?

జీప్ మెరిడియన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో మరియు ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు పవర్డ్ లిఫ్ట్‌గేట్ వంటివి ఉన్నాయి.

'జీప్ మెరిడియన్' బుకింగ్స్ స్టార్ట్.. ఎప్పటినుంచో తెలుసా..?

'జీప్ మెరిడియన్' డ్యూయల్ టోన్ ఇంటీరియర్ పొందుతుంది. డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ మరియు డోర్ ప్యానెల్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్‌ ఉంటాయి. అయితే సీట్లు బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. ఈ కొత్త SUV 7 సీటర్ కావున రెండవ మరియు మూడవ వరుస సీట్లు కలిగి ప్రయాణికులకు అనుకూలంగా ఉంటాయి. ఇది క్యాబిన్ కలిగి ఉండటమే కాకుండా, లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ అన్నీ కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉండే విధంగా ఉన్నాయి.

'జీప్ మెరిడియన్' బుకింగ్స్ స్టార్ట్.. ఎప్పటినుంచో తెలుసా..?

ఇందులో మూడవ వరుస సీట్లకు వెళ్ళడానికి రెండవ వరుస సీట్లను ఫోల్డ్ చేయవచ్చు. అంతే కాకుండా మూడవ వరుస సీట్లను పూర్తిగా ఫోల్డ్ చేయవచ్చు, కానీ రెండవ వరుస సీట్లను 60:40 నిష్పత్తిలో ఫోల్డ్ చేయవచ్చు. వెనుక వుండే ప్రయాణికుల కోసం ఎయిర్ బ్లోవర్ మరియు కప్ హోల్డర్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.

'జీప్ మెరిడియన్' బుకింగ్స్ స్టార్ట్.. ఎప్పటినుంచో తెలుసా..?

ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ట్రాక్షన్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు రియర్ కెమెరా వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

'జీప్ మెరిడియన్' బుకింగ్స్ స్టార్ట్.. ఎప్పటినుంచో తెలుసా..?

జీప్ మెరిడియన్ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ మల్టీజెట్ టర్బో డీజిల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 10.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది మరియు గరిష్ట వేగం గంటకు 198 కిమీ.

'జీప్ మెరిడియన్' బుకింగ్స్ స్టార్ట్.. ఎప్పటినుంచో తెలుసా..?

భారతీయ మార్కెట్లో జీప్ మెరిడియన్ టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్ మరియు ఎంజి గ్లోస్టర్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. జీప్ మెరిడియన్ బుకింగ్స్ ఇక త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కావున ఇది దేశీయ మార్కెట్లో ఎలాంటి బుకింగ్స్ పొందుతుందో త్వరలో తెలుస్తుంది.

'జీప్ మెరిడియన్' బుకింగ్స్ స్టార్ట్.. ఎప్పటినుంచో తెలుసా..?

ఇదిలా ఉండగా ఇటీవల జీప్ కంపెనీ భారత విపణిలో 'కంపాస్ నైట్ ఈగల్‌' విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే కంపాస్ నైట్ ఈగల్‌ మాన్యువల్ డీజిల్ వెర్షన్ ధర రూ. రూ. 21.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, కంపాస్ నైట్ ఈగల్‌ ఆటోమేటిక్ పెట్రోల్ వెర్షన్ ధర రూ. రూ. 22.75 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంది. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Monday, April 25, 2022, 17:22 [IST]
English summary
Jeep meridian booking to open from 3rd may details
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+